PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/revanth-reddy22190fde-1925-4331-b62e-4c270e7b62c9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/revanth-reddy22190fde-1925-4331-b62e-4c270e7b62c9-415x250-IndiaHerald.jpgకాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి మరోసారి కేసీఆర్ సర్కారుపై మండిపడ్డారు. హైదరాబాద్ కు ఆయన పాదయాత్ర కొనసాగుతూనే ఉంది. మొన్న ఉన్నట్టుండి తన దీక్షను పాదయాత్రగా మార్చిన రేవంత్ రెడ్డి.. ఆ పాదయాత్రను కంటిన్యూ చేస్తున్నారు. దారి పొడవునా రైతులు, ఇతర వర్గాలతో మాట్లాడుతూ తన యాత్ర కొనసాగిస్తున్నారు. అక్కడక్కడా సభలు నిర్వహిస్తున్నారు. తన పాదయాత్రలో భాగంగా తిమ్మరాసిపల్లిలో ఎంపీ రేవంత్ రెడ్డిలో ప్రసంగించారు. కేసీఆర్ పాలనపై నిప్పులు చెరిగిన రేవంత్ రెడ్డి.. ఢిల్లీ వెళ్లొచ్చాక కేసీఆర్ ఫాంహౌస్ లrevanth-reddy;modi;kcr;revanth;delhi;hyderabad;revanth reddy;mp;fire;house;manam;reddy;yatraఏం.. నీ అయ్య సొమ్ముతో పంట కొంటున్నవా..? - రేవంత్‌ రెడ్డి ఫుల్ ఫైర్‌..!ఏం.. నీ అయ్య సొమ్ముతో పంట కొంటున్నవా..? - రేవంత్‌ రెడ్డి ఫుల్ ఫైర్‌..!revanth-reddy;modi;kcr;revanth;delhi;hyderabad;revanth reddy;mp;fire;house;manam;reddy;yatraThu, 11 Feb 2021 09:00:00 GMTరెడ్డి మరోసారి కేసీఆర్ సర్కారుపై మండిపడ్డారు.  హైదరాబాద్ కు ఆయన పాదయాత్ర కొనసాగుతూనే ఉంది. మొన్న ఉన్నట్టుండి తన దీక్షను పాదయాత్రగా మార్చిన రేవంత్ రెడ్డి.. ఆ పాదయాత్రను కంటిన్యూ చేస్తున్నారు. దారి పొడవునా రైతులు, ఇతర వర్గాలతో మాట్లాడుతూ తన యాత్ర కొనసాగిస్తున్నారు. అక్కడక్కడా సభలు నిర్వహిస్తున్నారు.

తన పాదయాత్రలో భాగంగా తిమ్మరాసిపల్లిలో ఎంపీ రేవంత్ రెడ్డిలో ప్రసంగించారు. కేసీఆర్ పాలనపై నిప్పులు చెరిగిన రేవంత్ రెడ్డి.. ఢిల్లీ వెళ్లొచ్చాక కేసీఆర్ ఫాంహౌస్ లో పడుకున్నాడని ఎద్దేవా చేశారు. మోడీ ఏం చూపిస్తే కేసీఆర్ భయపడుతున్నాడో చెప్పాలని నిలదీశారు. తెలంగాణలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని.. పేద, మధ్య తరగతి బతికే పరిస్థితి లేదని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసారు.

కేసీఆర్ ఇంట్లో ఐదుగురు పదవులు తీసుకున్నారని.. కానీ పేద ముసలోళ్ల ఇంట్లో రెండు పెన్షన్లు ఇవ్వడం లేదుని రేవంత్ రెడ్డి విమర్శించారు. రూ.రెండు లక్షల కోట్ల బడ్జెట్ లో ఒక ఇంట్లో ఇద్దరు ముసలోళ్లకు పెన్షన్ ఇస్తే కేసీఆర్ ముల్లేమైనా పోతదా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రైతు వ్యతిరేక చట్టాలు వంద మీటర్ల లోతులో పాతే వరకు కొట్లాటే ఉంటుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నిరంజన్ రెడ్డి.. పంట మేమెట్ల కొంటామంటున్నావు... నీ అయ్య సొమ్ముతో పంట కొంటున్నావా? అంటూ రేవంత్ రెడ్డి వ్యవసాయ మంత్రిపై ఫైర్ అయ్యారు.

తన ప్రసంగంలో దిల్లీ రైతుల దీక్ష గురించి రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. అక్కడ రాకేష్ తికాయత్ కంటతడి పెడితే లక్షలాది మంది రైతులు ఢిల్లీకి వచ్చారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. గ్రామాల్లోని రైతులను అడుగుతున్నా... మనందరం హైదరాబాద్ కు కదం తొక్కితే కేసీఆర్ మెడలు వంచలేమా అని రేవంత్ రెడ్డి పిలుపు ఇచ్చారు. రేవంత్ రెడ్డి పాదయాత్రకు రైతుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.




ఒకే రోజు ఒకే అంశంపై ఇద్దరూ యువ హీరోలు పోటీ పడుతున్నారు!! ఎందుకో తెలుసా ?

సాయి ధరమ్ తేజ్ కి పెళ్లి.. అమ్మాయి ఎవరో తెలుసా..?

జగడ్డ: "చింత చచ్చినా పులుపు చావలేదు" అన్నట్టు ఉంది బాబోరి వరుస ...?

మహేష్.. రాజమౌళి.. 'అతడు అడవిని జయించాడు'..!

ఉప్పెన క్లైమాక్స్ సెటైర్ల పై స్పందించిన వైష్ణవ్ తేజ్ !

ఎడిటోరియల్: వైఎస్ షర్మిల ఖచ్చితంగా క్రిష్టియానిటీ వదలిన బాణమే!

హెరాల్డ్ సెటైర్ : పంచాయితి ఎన్నికలతో డౌన్ ఫాల్ స్టార్టయ్యిందట !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>