Politicskurapati Dileep Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/categories/politics-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/categories/politics-IndiaHerald.jpgసామాజిక మాధ్యమాలకు కావల్సినంత స్వేచ్ఛ నిచ్చాం కానీ, అవి దేశంలోని చట్టాలకు ఖచ్చితంగా కట్టుబడి ఉండాల్సిందేనని కేంద్ర సమాచార, సాంకేతిక వ్యవహారాల (ఐటి) మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. కట్టుబాట్లను పాటించకపోతే గట్టి చర్యలు తప్పవని హెచ్చరించారు. సామాజిక మాధ్యమాలలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఉంటే, వాటిని అరికట్టడంలో సంబంధిత సంస్థలు విఫలం అయితే తగు విధంగా తాము ప్రతిస్పందించాల్సి ఉంటుందని మంత్రి గురువారం రాజ్యసభలో తెలిపారు. దేశంలోని చట్టాలకు ఎవరైనా పూర్తి స్థాయిలో కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. వివravi shankar prasad;shruti;prasad;sruthi;bharatiya janata party;india;ravi shankar prasad.;media;capital;twitter;minister;press;central government;gharshana;jandhyala ravishankar;shatru1సోషల్ మీడియాకు కేంద్రం చురక.....!!!సోషల్ మీడియాకు కేంద్రం చురక.....!!!ravi shankar prasad;shruti;prasad;sruthi;bharatiya janata party;india;ravi shankar prasad.;media;capital;twitter;minister;press;central government;gharshana;jandhyala ravishankar;shatru1Thu, 11 Feb 2021 22:37:14 GMTసోషల్ మీడియాకు కేంద్రం చురక.....!!!

ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..

సామాజిక మాధ్యమాలకు కావల్సినంత స్వేచ్ఛ నిచ్చాం కానీ, అవి దేశంలోని చట్టాలకు ఖచ్చితంగా కట్టుబడి ఉండాల్సిందేనని కేంద్ర సమాచార, సాంకేతిక వ్యవహారాల (ఐటి) మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. కట్టుబాట్లను పాటించకపోతే గట్టి చర్యలు తప్పవని హెచ్చరించారు. సామాజిక మాధ్యమాలలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఉంటే, వాటిని అరికట్టడంలో సంబంధిత సంస్థలు విఫలం అయితే తగు విధంగా తాము ప్రతిస్పందించాల్సి ఉంటుందని మంత్రి గురువారం రాజ్యసభలో తెలిపారు. దేశంలోని చట్టాలకు ఎవరైనా పూర్తి స్థాయిలో కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. వివాదాస్పద వ్యాఖ్యల ట్విట్టర్‌పై తీవ్ర స్థాయి హెచ్చరికలకు దిగిన మరుసటిరోజే ఐటి మంత్రి సోషల్ మీడియాకు హెచ్చరికలు వెలువరించారు.క్యాపిటల్ హిల్స్ కానివ్వండి, ఇటు ఎర్రకోట ఘటనలు కానివ్వండి సోషల్ మీడియా వేదికలు వేర్వేరు వైఖరులనుఉ ప్రదర్శించడం కుదరదని తెలిపారు.

మీడియా స్వేచ్ఛ, వ్యక్తుల స్వాతంత్య్రానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. అయితే ఇదే సమయంలో రక్షణ, భద్రత, చట్టం , దేశంలోని వ్యవస్థను ప్రభుత్వం పట్టించుకుంటుంది. 'దయచేసి శత్రుత్వాన్ని, ఘర్షణ, హింస, తప్పుడు సమాచారం వంటివి దయచేసి వ్యాపింపచేయకండి. భారత రాజ్యాంగాన్ని పాటించండి. ఈ నేలకు సంబంధించిన వ్యవస్థకు కట్టుబడి ఉండండి. లేకపోతే కఠిన చర్యలు తప్పవు' అని సంబంధిత విషయంపై ఎగువ సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. రైతుల నిరసనలకు సంబంధించి సామాజిక మాధ్యమం ట్విట్టర్ ద్వారా తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతోందని ప్రభుత్వం ఆగ్రహిస్తోంది. 1100కు పైగా అభ్యంతరకర ట్విట్టర్ ఖాతాల తొలగింపు గురించి ప్రస్తావించినా పట్టించుకోవడం లేదని కేంద్రం తెలిపింది.

అక్కడ అట్లా ఇక్కడిట్లానా?
అమెరికాలో ఇటీవల అరాచక ఘటనలు జరిగినప్పుడు స్పందించినట్లుగా ఇక్కడ ఎందుకు వ్యవహరించడం లేదని ట్విట్టర్‌ను కేంద్రం సూటిగా ప్రశ్నించింది. ఎర్రకోట వద్ద ఘటనల సమాచారం వక్రీకరణ జరిగినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ద్వంద్వ ప్రమాణాల పాటింపు అని విమర్శించింది. క్యాపిటల్ హిల్స్ వద్ద హింసాత్మక ఘటనలు జరిగినప్పుడు సోషల్ మీడియా కంపెనీలు తక్షణ చర్యలకు దిగాయని, అయితే ఎర్రకోట విషయానికి వస్తే రెచ్చగొట్టే వ్యాఖ్యలపై మీనమేషాలు పాటిస్తున్నారని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. ఇటువంటి రెండు తోకల పద్ధతి ఇక్కడ నడవదని గుర్తుంచుకోవాలన్నారు. మోడీకి వ్యతిరేకంగా తీవ్ర పదజాలంతో ట్వీట్లు వెలువరించడం, తప్పుడు సమాచారాన్ని అడ్డులేకుండా సాగనివ్వడం ఇదంతా ఏమిటీ? ఏ క్యా మజాక్ హై ( ఏం తమాషాగా ఉందా) అని మంత్రి ట్విట్టర్‌కు చురకలు పెట్టారు.

ప్రెస్ కౌన్సిల్ పరిధిలోకి వస్తాయా?
సోషల్ మీడియాల వ్యవహార శైలి శృతి మించుతున్న దశలో అవి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పరిధిలోకి వస్తాయా? రావా? అని బిజెపి సభ్యులు వినయ్ సహస్రబుద్దిన్ ప్రశ్నించారు. ప్రెస్ కౌన్సిల్ నిబంధనలను ఇవి పాటించాల్సి ఉంటుందా? విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల చట్టాల పరిధిలోకి వీటిని తీసుకువచ్చారా? అనేవి తాను తెలుసుకోగోరుతున్నట్లు తెలిపారు. సోషల్ మీడియాకు వీటిని వర్తింపచేయాలని ఇప్పటికే ఐటి సంబంధిత స్థాయీసంఘం సిఫార్సు చేసిన విషయం తనకు తెలుసునని అన్నారు. దీనికి మంత్రి జవాబిచ్చారు. సదరు స్థాయీ సంఘం సిఫార్సుల గురించి తనకు తెలుసునని, తానూ ,సమాచార ప్రసారాల మంత్రి ప్రకాశ్ జవదేకర్ కలిసి ఈ కమిటీ మార్గదర్శకాలను పరిశీలిస్తున్నామని మంత్రి రవిశంకర్ ప్రసాద్ జవాబిచ్చారు. అన్నింటిని సమీక్షించుకుని, తుది రూపంవచ్చినతరువాత సభకు తెలియచేస్తామని తెలిపారు.

ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి. 



మూడు భారీ డిజాస్టర్ల తరువాత బాలయ్య మార్కెట్ కు షాక్...?

టీచర్ల వెతలు : జగనోరు.. మా సమస్యలను పరిష్కరించండి..!!

సుస్మితా సేన్ అతనికి ఇచ్చేదంతా ఇచ్చేసి.. ఇపుడు మాత్రం..!

"న్యూ బ్రూం స్వీప్స్ వెల్ అంటారు" చూద్ధాం! అవినీతి కంపు కొడుతున్న జిహెచ్ఎంసీ ని ఎంత బాగా ఊడ్చేస్తుందో? ఈ కొత్త మేయరమ్మ!

సోషల్ మీడియాలో వైరలవుతున్న మరొక వైసీపీ ఎమ్మెల్యే బెదిరింపుల వీడియో....

శ్రీముఖి, విష్ణు ప్రియాలని దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్....

రెండు రోజుల్లో అతి పెద్ద ఎన్నికకు నోటిఫికేషన్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kurapati Dileep Kumar]]>