PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/wife-and-husband-in-panchayat-pollfd1fa293-bcb5-4877-8a3e-5443d5819394-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/wife-and-husband-in-panchayat-pollfd1fa293-bcb5-4877-8a3e-5443d5819394-415x250-IndiaHerald.jpgపంచాయతీ ఎన్నికల బరిలో చాలా సందర్భాల్లో బంధువులో ఒకరితో ఒకరు పోటీ పడుతుంటారు. ఎవరు గెలిచినా అందరికీ సంతోషమే. తోడి కోడళ్లు, అత్త కోడళ్లు, అన్నదమ్ములు.. ఇలా బంధుత్వాలేవయినా రాజకీయాల్లో అవి పనికి రావంటారు. కానీ భార్యా భర్తలు ఒకరితో ఒకరు పోటీ పడటం అరుదు. అలాంటి అరుదైన పోటీకి వేదికగా మారింది కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం అల్లూరు గ్రామ పంచాయతీ. ఈ గ్రామంలో భార్యా భర్తలిద్దరూ సర్పంచ్ అభ్యర్థులుగా బరిలో నిలిచారు. jagan-nimmagadda-elections;radhika;krishna river;district;panchayati;village;mudinepalli;husband;wife;krishna district;reddyభార్యా భర్తల మధ్య చిచ్చు పెట్టిన పంచాయతీ పోరు..భార్యా భర్తల మధ్య చిచ్చు పెట్టిన పంచాయతీ పోరు..jagan-nimmagadda-elections;radhika;krishna river;district;panchayati;village;mudinepalli;husband;wife;krishna district;reddyThu, 11 Feb 2021 12:00:00 GMTపంచాయతీ ఎన్నికల బరిలో చాలా సందర్భాల్లో బంధువులో ఒకరితో ఒకరు పోటీ పడుతుంటారు. ఎవరు గెలిచినా అందరికీ సంతోషమే. తోడి కోడళ్లు, అత్త కోడళ్లు, అన్నదమ్ములు.. ఇలా బంధుత్వాలేవయినా రాజకీయాల్లో అవి పనికి రావంటారు. కానీ భార్యా భర్తలు ఒకరితో ఒకరు పోటీ పడటం అరుదు. అలాంటి అరుదైన పోటీకి వేదికగా మారింది కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం అల్లూరు గ్రామ పంచాయతీ. ఈ గ్రామంలో భార్యా భర్తలిద్దరూ సర్పంచ్ అభ్యర్థులుగా బరిలో నిలిచారు.

భార్యాభర్తలు ఇద్దరూ ఒకే పంచాయతీకి సర్పంచి రేసులో ఉండటం విశేషం. అల్లూరు పంచాయతీ సర్పంచి అభ్యర్థులుగా మొత్తం అయిదుగురు అభ్యర్థులు రంగంలో ఉన్నారు. ఇందులో స్వతంత్ర అభ్యర్థినిగా సోమేశ్వరస్వామి ఆలయ మాజీ ఛైర్‌ పర్సన్‌ రెడ్డి రాధిక బరిలో నిలిచారు. ఆమెకు డమ్మీ అభ్యర్థిగా భర్త రెడ్డి విఠల్ కూడా నామినేషన్ వేశారు. రాధికకు ఉంగరం గుర్తు, ఆమె భర్త విఠల్ ‌కు బుట్ట గుర్తులు కేటాయించారు.
భర్త చేసిన తప్పు..వాస్తవానికి రెడ్డి రాధిక మాత్రమే సర్పంచ్ ఎన్నికల్లో నిలబడాలని అనుకున్నారు. అయితే ఆమెకు డమ్మీ అభ్యర్థిగా భర్త కూడా నామినేషన్ వేశారు. తీరా ఉపసంహరణ విషయంలో భర్త ఆలస్యం చేయడంతో ఇద్దరు నామినేషన్లు ఖరారు అయ్యాయి. దీంతో ఇద్దరికీ గుర్తులు కేటాయించారు అధికారులు.

ఇప్పుడేం చేయాలి..
భార్యా భర్తల మధ్య గొడవలు లేవు. ఇద్దరిలో ఒకరే గెలవాలని వారు అనుకునంటున్నారు. అయితే అనుకోకుండా ఇద్దరికీ గుర్తులు రావడంతో ఇరుకున పడ్డారు. దీంతో భార్య గెలుపుకోసం భర్త కూడా ప్రచారం చేస్తున్నారు. భార్యకు కేటాయించిన ఉంగరం గుర్తుపై ఓటు వేయాలని సూచిస్తూ ప్రచారంలోకి దిగారు. బుట్ట గుర్తుని మరచిపోవాలని కోరుతున్నారు. ఇద్దరు అభ్యర్థులు కలసి ఒకే గుర్తుకి ఓటు వేయాలంటూ ప్రచార పర్వంలో దిగారు.

నామినేషన్ ఉపసంహరణ విషయంలో భర్త ఆలస్యం చేయడం వల్లే ఈ తిప్పలు వచ్చాయని అంటున్నారు భార్య రాధిక. పొరపాటున బుట్ట గుర్తుకి ఎవరైనా ఓటు వేస్తే.. తమ ఓటమిని తామే కొని తెచ్చుకున్నట్టు అవుతుందని ఆమె బాధ పడుతున్నారు.




GHMC మేయ‌ర్ ఎన్నిక: ఎన్నిభాష‌ల్లో ప్ర‌మాణ స్వీకారం అంటే

లైగర్ రిలీజ్ డేట్ పోస్టర్.. విజయ్ డేరింగ్.. పూరీ మార్క్.. విజిల్స్ పక్కా..!

చంద్ర‌బాబు ఇంత ఫ్ర‌స్టేష‌న్‌లోనా... సిగ్గు వ‌దిలేసి మ‌రీ ?

జగడ్డ : ఉత్తరాంధ్రాలో ఏకగ్రీవాల రికార్డు...?

షర్మిల పార్టీ ముహుర్తం ఇదే!

సాయి ధరమ్ తేజ్ కి పెళ్లి.. అమ్మాయి ఎవరో తెలుసా..?

ఏం.. నీ అయ్య సొమ్ముతో పంట కొంటున్నవా..? - రేవంత్‌ రెడ్డి ఫుల్ ఫైర్‌..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>