MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan-sensational-comments-on-uppena-movie0c66b29d-e3a2-411d-9911-11124587d743-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan-sensational-comments-on-uppena-movie0c66b29d-e3a2-411d-9911-11124587d743-415x250-IndiaHerald.jpgక్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపొందిన ఉప్పెన సినిమా ఫిబ్రవరి 12వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాతో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా వెండితెరకు పరిచయం అవుతున్నారు. దీంతో సినిమా విడుదలకై మెగా అభిమానుల చాలా ఆసక్తితో వేచి చూస్తున్నారుhero pawan kalyan;koti;pawan;view;chiranjeevi;kumaar;kalyan;sai dharam tej;sethu;sukumar;varsha;vijay;vijay sethupathi;cinema;youtube;twitter;you tube;event;director;february;husband;heroine;joseph vijay;mythri movie makers;vaishnav tej;romantic;panjaaఉప్పెన సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ఉప్పెన సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్hero pawan kalyan;koti;pawan;view;chiranjeevi;kumaar;kalyan;sai dharam tej;sethu;sukumar;varsha;vijay;vijay sethupathi;cinema;youtube;twitter;you tube;event;director;february;husband;heroine;joseph vijay;mythri movie makers;vaishnav tej;romantic;panjaaThu, 11 Feb 2021 16:00:00 GMTడైరెక్టర్ సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపొందిన ఉప్పెన సినిమా ఫిబ్రవరి 12వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాతో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా వెండితెరకు పరిచయం అవుతున్నారు. దీంతో సినిమా విడుదలకై మెగా అభిమానుల చాలా ఆసక్తితో వేచి చూస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన కృతిక శెట్టి "నీ కళ్ళు నీలి సముద్రం" అనే ఒక్క పాటతోనే పాపులర్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈమె కూడా ఈ సినిమాతోనే వెండితెరకు హీరోయిన్ గా పరిచయం కాబోతున్నారు. ఆరు రోజుల క్రితం యూట్యూబ్ వేదికగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కి కోటి కి పైగా వ్యూస్ వచ్చాయంటే అతిశయోక్తి కాదు. మధురమైన మెలోడీ సాంగ్స్ తో, భిన్నమైన రొమాంటిక్ కథతో.. మెగాహీరో, విజయ్ సేతుపతి వంటి తారాగణం లో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో కొద్ది గంటల్లోనే తేలనుంది.

ఇకపోతే మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై సంయుక్తంగా నిర్మించబడిన ఈ సినిమాని ఇప్పటికే మెగా హీరోలు వీక్షించారు. చిరంజీవి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ.. ఉప్పెన సినిమా క్లైమాక్స్ చాలా సున్నితంగా ఉంటుందని.. ఈ సినిమాని అందరూ కచ్చితంగా గుర్తుంచుకుంటారని చెప్పారు. దీంతో అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు.

'మన చుట్టూ ఉన్న పరిస్థితులను కథగా తెర మీదకు తీసుకువచ్చే చిత్రాలను ప్రేక్షకులు ఎక్కువ కాలం గుర్తుంచుకొంటారు' అని పవన్ కళ్యాణ్ ఉప్పెన సినిమా చూసిన తర్వాత వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. అయితే పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించడంతో మెగా అభిమానుల్లో వైష్ణవ్ తేజ్ సినిమా పై అంచనాలు మరింత పెరిగాయి.


జగడ్డ : బాబుకు షాకుల మీద షాకులు ?

'అలా రికార్డుల పురములో '.. బన్నీ ఖాతాలో మరో సరికొత్త రికార్డ్..!!

రష్మిక 2 కోట్ల కల.. మీడియా వాళ్లు రాస్తున్నారు కాని..!

రవితేజ తన రూమ్ మేట్స్ తో కలిసి తీసిన సినిమా ఏంటో తెలుసా..?

జగడ్డ: పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ-టీడీపీ మధ్య అగ్రిమెంట్.. చివర్లో ఊహించని ట్విస్ట్...?

సినిమా మొదటి రోజు హిట్ టాక్ అందుకొని,తరువాత ఫ్లాప్ అయిన సినిమాలు ఏంటో తెలుసా..?

భూమిక చేసిన పనికి తలెత్తుకోలేకపోయా.. ఖుషి హీరోయిన్ పై రవిబాబు సంచలన వ్యాఖ్యలు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>