PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kshudrapujaed609226-1b69-438e-9370-d64df4477ad7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kshudrapujaed609226-1b69-438e-9370-d64df4477ad7-415x250-IndiaHerald.jpgఏపీలో గత కొద్దీరోజుల నుండి క్షుద్రపూజల ఘటనలు కలకలం రేపుతున్నాయి. చిత్తూరు జిల్లా మదనపల్లి ఘటన మరవక ముందే ఏపీలో మరో ఘటన చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లాలో క్షుద్రపూజల కలకలం రేగింది. బొమ్మనహళ్ మండలం ఉంతకల్లు గ్రామం సమీపంలోని తుంగభద్ర హైలెవల్ కాలువలో స్థానికులు గుర్తుతెలియని మృతదేహాన్ని గుర్తించారు. అయితే కాలువ గట్టుపై దృశ్యాలను చూసి బెంబేలెత్తిపోయారు. kshudrapuja;pooja hegde;tungabhadra river;district;police;mandalam;aqua;murder.;local language;madanapalliఅనంతపురం జిల్లాలో క్షుద్రపూజల కలకలం..!?అనంతపురం జిల్లాలో క్షుద్రపూజల కలకలం..!?kshudrapuja;pooja hegde;tungabhadra river;district;police;mandalam;aqua;murder.;local language;madanapalliThu, 11 Feb 2021 21:00:00 GMTజిల్లా మదనపల్లి ఘటన మరవక ముందే ఏపీలో మరో ఘటన చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లాలో క్షుద్రపూజల కలకలం రేగింది. బొమ్మనహళ్ మండలం ఉంతకల్లు గ్రామం సమీపంలోని తుంగభద్ర హైలెవల్ కాలువలో స్థానికులు గుర్తుతెలియని మృతదేహాన్ని గుర్తించారు. అయితే కాలువ గట్టుపై దృశ్యాలను చూసి బెంబేలెత్తిపోయారు. ఇక ఘటన  రక్తపు మరకలతో పాటు నిమ్మకాయలు, పూజలు చేసిన ఆకులను గుర్తించారు. దీన్నిబట్టి చూస్తే అక్కడ క్షుద్రపూజలు జరిగినట్లు అనుమానిస్తున్నారు.

ఇక అమవాస్య కావడంతో గురువారం తెల్లవారుజామున యువకుడ్ని నరబలి ఇచ్చిఉంటారని భావిస్తున్నారు. తొలుత యువకుడ్ని బండరాయితో కొట్టి చందిన దుండగులు, ఆ తర్వాత మృతదేహానికి నిప్పంటించారు. మృతదేహంపై దుస్తులు కూడా లేకపోవడంతో క్షుద్రపూజల అనుమానాలు బలపడుతున్నాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి నిమ్మకాయలు, ఆకులు, ఇతర పూజా సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

ఇక కాలువ గట్టుపై పాదాల ముద్రలతో పాటు ఇతర ఆధారాలను సేకరించినట్లు తెలుస్తోంది. ఇక యువకుడి గురించి ఎలాంటి అనవాళ్లు లేకపోవడం, స్థానికులు గుర్తింలేకపోవడంతో పోలీసులకు సవాల్ గా మారింది. దీంతో డాగ్ స్క్వాండ్ ను రంగంలోకి దించారు. అలాగే ఉంతకల్లితో పాటు బొమ్మనహళ్ మండలంలో క్షుద్రపూజలు, తాయత్తులు కట్టేవారి వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే మిస్సింగ్ కేసులను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ఇక మృతుడు యువకుడు కావడం. .మృతదేహంపై దుస్తులు లేకపోవడం, అమవాస్య ఘడియలు కావడంతో ఖచ్చితంగా నరబలి జరిగి ఉంటుందన్న అనుమానాలు బలపడుతున్నాయి. మరోవైపు మదనపల్లి జంట హత్యల కేసు ఘటన నేపథ్యంలో పోలీసులు అదే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. అమవాస్య ఘడియల్లో నరబలి ఇస్తే శక్తులు వస్తాయని, నిధులు దొరుకుతాయన్న నమ్మకాలు చాలా మందిలో ఉన్నారు.




ఈసారి రౌడీతో కూడా పూరి మాస్ హిట్ కొట్టేటట్లు ఉన్నాడుగా....

మూడు భారీ డిజాస్టర్ల తరువాత బాలయ్య మార్కెట్ కు షాక్...?

టీచర్ల వెతలు : జగనోరు.. మా సమస్యలను పరిష్కరించండి..!!

సుస్మితా సేన్ అతనికి ఇచ్చేదంతా ఇచ్చేసి.. ఇపుడు మాత్రం..!

"న్యూ బ్రూం స్వీప్స్ వెల్ అంటారు" చూద్ధాం! అవినీతి కంపు కొడుతున్న జిహెచ్ఎంసీ ని ఎంత బాగా ఊడ్చేస్తుందో? ఈ కొత్త మేయరమ్మ!

సోషల్ మీడియాలో వైరలవుతున్న మరొక వైసీపీ ఎమ్మెల్యే బెదిరింపుల వీడియో....

శ్రీముఖి, విష్ణు ప్రియాలని దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్....




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>