EditorialVijayaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/gulamnabi-azad-congress-bjp-nda-upa-modi-sonia5420f882-26ce-4385-8442-9d60c0ab6179-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/gulamnabi-azad-congress-bjp-nda-upa-modi-sonia5420f882-26ce-4385-8442-9d60c0ab6179-415x250-IndiaHerald.jpgఒకవేళ కాంగ్రెస్ ఆజాద్ సేవలను ఉపయోగించుకోలేకపోతే ఎన్డీయే తరపున రాజ్యసభకు ఆజాద్ ను నామినేట్ చేస్తామంటు చెప్పటం ఆశ్చర్యంగా ఉంది. నిజానికి ఆజాద్ ను రాజ్యసభకు పంపే అవకాశాలు కాంగ్రెస్ పార్టీకి దాదాపు లేదనే చెప్పాలి. ఎందుకంటే పెద్ద రాష్ట్రాల్లో రాజస్ధాన్ లో తప్ప కాంగ్రెస్ మరెక్కడా అధికారంలో లేదు. ఉన్న అరాకొరా చోట్ల రాజ్యసభకు పంపే అవకాశాలు లేవు. మరి ఈ పరిస్ధితుల్లో 71 ఏళ్ళ వయస్సున్న ఆజాద్ సేవలను పార్టీ ఏ విధంగా ఉపయోగించుకుంటదనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పరిస్దితి దారుణంగా తయారైంది. తgulamnabi azad congress bjp nda upa modi sonia;ram pothineni;ramdoss;kerala;bharatiya janata party;congress;ram madhav;rajya sabha;mp;research and analysis wing;parliament;party;manadesamహెరాల్డ్ ఎడిటోరియల్ : కాంగ్రెస్ నేతకు ఎన్డీయే బంపర్ ఆఫర్హెరాల్డ్ ఎడిటోరియల్ : కాంగ్రెస్ నేతకు ఎన్డీయే బంపర్ ఆఫర్gulamnabi azad congress bjp nda upa modi sonia;ram pothineni;ramdoss;kerala;bharatiya janata party;congress;ram madhav;rajya sabha;mp;research and analysis wing;parliament;party;manadesamThu, 11 Feb 2021 03:00:00 GMTచాలా అరుదుగా మాత్రమే జరుగుతుంటుంది. మనదేశంలో అయితే ఇప్పటివరకు ఇటువంటి ఆఫర్ ఎవరు ఇఛ్చినట్లు కూడా రికార్డు కాలేదు. అలాంటి బంపర్ ఆఫర్ ను ఎన్డీయే నుండి కాంగ్రెస్ నేతకు అందటం ఆశ్చర్యంగానే ఉంది. ఇంతకీ విషయం ఏమిటంటే కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపి గులామ్ నబీ ఆజాద్ పదవీకాలం మరో వారంరోజుల్లో ముగిస్తోంది. ఇదే విషయాన్ని బుధవారం రాజ్యసభలో కేంద్రమంత్రి రామ్ దాస్ అథవాలే ప్రస్తావిస్తు ఆజాద్ లాంటి సీనియర్ సేవలు పార్లమెంటుకు, దేశానికి చాలా అవసరమన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆజాద్ లాంటి నేతల సేవలను కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఉపయోగించుకునేది లేనిదీ ఇంకా స్పష్టం కాలేదన్నారు.




ఒకవేళ కాంగ్రెస్ ఆజాద్ సేవలను ఉపయోగించుకోలేకపోతే ఎన్డీయే తరపున రాజ్యసభకు ఆజాద్ ను నామినేట్ చేస్తామంటు చెప్పటం ఆశ్చర్యంగా ఉంది. నిజానికి ఆజాద్ ను రాజ్యసభకు పంపే అవకాశాలు కాంగ్రెస్ పార్టీకి దాదాపు లేదనే చెప్పాలి. ఎందుకంటే పెద్ద రాష్ట్రాల్లో రాజస్ధాన్ లో తప్ప కాంగ్రెస్ మరెక్కడా అధికారంలో లేదు. ఉన్న అరాకొరా చోట్ల రాజ్యసభకు పంపే అవకాశాలు లేవు. మరి ఈ పరిస్ధితుల్లో 71 ఏళ్ళ వయస్సున్న ఆజాద్ సేవలను పార్టీ ఏ విధంగా ఉపయోగించుకుంటదనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పరిస్దితి దారుణంగా తయారైంది. తొందరలోనే ఎన్నికలు జరగనున్న పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ సింగిల్ డిజిట్ దాటుతుందనే నమ్మకం కూడా ఎవరిలోను లేదు. మిగిలిన కేరళ ఎన్నికలపైన మాత్రమే కాస్త ఆశలు పెట్టుకుంది.




ఇవన్నీ లెక్కలు వేసుకున్న తర్వాతే ఎన్డీయేలో కీలక సభ్యుడైన రాందాస్ కాంగ్రెస్ అగ్రనేతల్లో ఒకరైన ఆజాద్ కు బంపర్ ఆఫర్ ఇచ్చినట్లున్నారు. మరి రాందాస్ బంపర్ ఆఫర్ ను ఆజాద్ అంగీకరిస్తారా ? ఇదే ఇపుడు సస్పెన్సుగా మారిపోయింది.  ఎందుకంటే దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీతో ముడిపడున్న అనుబంధాన్ని ఒక్కసారిగా వదులుకుని బీజేపీలో చేరిపోతారని ఎవరు అనుకోవటం లేదు. ఇదే సమయంలో ఒకపుడు రాజ్యసభ డిప్యుటి ఛైర్ పర్సన్ గా కాంగ్రెస్ తరపున పనిచేసిన నజ్మా హెఫ్తుల్లా ఇపుడు బీజేపీలో ఉన్నారు. ఆమెకు కూడా దశాబ్దాల అనుబంధం ఉంది కాంగ్రెస్ తో. కానీ బీజేపీ నుండి ఆఫర్ రావటం, కాంగ్రెస్ డౌన్ ఫాల్ మొదల్లవటంతో ఆమె వెంటనే బీజేపీలోకి వెళ్ళిపోయారు. కాబట్టి ఎప్పుడేమి జరుగుతుందో ఎవరు చెప్పలేరు.




పుష్ప కొండపై 500 మందితో ఫైట్.. డిఎస్పి సీన్ లీక్ చేసేశాడు బాబోయ్..!

ఉప్పెన మొదటి షెడ్యూల్ అయ్యాక హీరోయిన్ ను మార్చారా..?

మెగా ఫ్యాన్స్ కు బిగ్ న్యూస్.. శంకర్ డైరక్షన్ లో రాం చరణ్ అఫీషియల్..!

విజయ్ సేతుపతిని బెదిరించి ఉప్పెనకు ఒప్పించారా..?

తెలుగు స్టార్లు అంత సాహసం కూడా చేస్తారా..?

గెలుపోటముల విషయం వదిలేసి మేయర్, డిప్యూటి మేయర్ పీఠం కోసం బిజేపి కూడా పోటీ పడనుంది

మెగాస్టార్ సరసన రకుల్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>