Moviesyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/live-telecast88de59b4-2441-43c8-849b-cb49bfe08eec-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/live-telecast88de59b4-2441-43c8-849b-cb49bfe08eec-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ అగ్ర హీరోయిన్ కాజల్ అగర్వాల్ వరుస సినిమాలు చేస్తున్నారు. తెలుగులో ప్రస్తుతం ఆచార్య సినిమాలో కథానాయికగా చేస్తున్న ఈ ముద్దుగుమ్మ మరి కొన్ని సినిమాలకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా ఆమె లైవ్ టెలికాస్ట్ అనే ఓ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్..live telecast;kajal aggarwal;tara;venkat;vikranth;tollywood;telugu;television;february;horror;thriller;heroineఆ రోజుల్లో కాజల్ నిద్ర కూడా పోలేదట.. వామ్మో అంతుందా!ఆ రోజుల్లో కాజల్ నిద్ర కూడా పోలేదట.. వామ్మో అంతుందా!live telecast;kajal aggarwal;tara;venkat;vikranth;tollywood;telugu;television;february;horror;thriller;heroineWed, 10 Feb 2021 20:31:49 GMTటాలీవుడ్ అగ్ర హీరోయిన్ కాజల్ అగర్వాల్ వరుస సినిమాలు చేస్తున్నారు. తెలుగులో ప్రస్తుతం ఆచార్య సినిమాలో కథానాయికగా చేస్తున్న ఈ ముద్దుగుమ్మ మరి కొన్ని సినిమాలకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా ఆమె లైవ్ టెలికాస్ట్ అనే ఓ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లో కూడా నటించారు. నటించడమే కాకుండా ఈ వెబ్ సిరీస్ కు నిర్మాణ బాధ్యతలు కూడా తీసుకున్నారు. వెంకట్ ప్రభు తెరకెక్కించిన లైవ్ టెలికాస్ట్ వెబ్ సిరీస్‌లో కాజల్ ప్రధాన పాత్ర పోషించారు. అంతేకాదు ఈ హర్రర్ వెబ్ సిరీస్ కోసం కాజల్ ఎంతో కష్టపడ్డారట.

లైవ్ టెలికాస్ట్ సిరీస్ మొత్తం ఓ టీవీ టీమ్ కథగా తెరకెక్కింది. ఒక షోను చిత్రీకరించేందుకు ఓ ఇంటికి వచ్చిన ఓ టెలివిజన్ బృందం అక్కడ బందీలవుతారు. ఇక వారు బయటకు వెళ్లలేరని, ఆ ఇంటి నిండా మానవాతీత శక్తులు ఉన్నాయని వారికి అర్థం అవుతుంది. ఆ ఇంటి నుంచి వారంతా ఎలా బయట పడ్డారన్నదే మిగతా కథ. అయితే ఈ వెబ్ సిరీస్ చిత్రీకరణలోని కొన్ని విషయాలను కాజల్ తెలిపారు. ఈ వెబ్ సిరీస్ అద్భుతంగా తెరకెక్కుతుందని, ఎంచుకున్న లొకేషన్ కథకు చాలా బాగా సూట్ అయిందని ఆమె అన్నారు.

 ‘ఈ వెబ్ సిరీస్ కోసం దర్శకనిర్మాతలు ఎంతో కృషి చేస్తున్నారు. మేము ప్రస్తుతం షూట్  చేస్తున్న ఇళ్లు విక్రాంత్ సార్ స్నేహితునిది. ఈ ఇళ్లు కొండపైన ఉంది. దగ్గరలో అంతా నిర్మానుష్యంగా ఉంటుంది. ఇది మాకు చిత్రీకరణలో చాలా బాగా ఉపయోగపడింది. అయితే ఈ వెబ్ సిరీస్ చిత్రీకరణ చేస్తున్నంత సేపు నేను నిద్ర కూడా పోలేదు. ఒకవేళ నిద్రపోతే ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచేదాన్ని, ప్యాకప్ చెప్పాక కూడా నాకు చాలా భయం వేసేది. కెమెరా ముందు, వెనుక ఎక్కడైనా నాలో భయం ఒకేలా ఉంది. పాత్రలో పూర్తిగా నిమగ్నం అయిపోయాన’ని కాజల్ చెప్పుకొచ్చారు. ఈ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 12న డిస్నీ హాట్ స్టార్ లో టెలికాస్ట్ చేసేందుకు కాజల్ అండ్ టీమ్ రెడీ అవుతోంది. మరి కాజల్ ను ఎంతగానో భయపెట్టిన ఈ లైవ్ టెలికాస్ట్ మనల్ని ఎంతలా భయపెడుతుందో చూడాలి.




ఉప్పెన హిట్ అవ్వాలంటే ఎంత కలెక్ట్ చేయాలి.. వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాకే భారీ టార్గెట్..!

ఉప్పెన కథ కొట్టేశాడా.. ఎన్.టి.ఆర్ కు ఆ డౌట్ ఎందుకొచ్చింది..!

జగడ్డ : విశాఖ మేయర్ కి పొగ పెట్టనున్న ఉక్కు సెగ ?

రిలీజ్ అవ్వకుండానే రికార్డు సృష్టించిన ఉప్పెన సినిమా...

నీ చుక్కల గౌనుకి కుర్రాళ్లు క్లీన్ బౌల్డ్.. ఢీ దీపికా క్యూట్ ఫోటో షూట్..!

జబర్దస్త్ బ్యూటీ అనసూయకి స్టార్ డం రాకముందు ఎలాంటి పాత్రల్లో నటించిందో తెలిస్తే ఆశ్చర్య పోతారు..??

బాలీవుడ్, ఓవర్ సీస్ లో రాధే శ్యామ్ కి మామూలు డిమాండ్ లేదుగా....




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>