PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/azad-modif3525d7f-1a48-427d-a7a9-c596f95d5d5a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/azad-modif3525d7f-1a48-427d-a7a9-c596f95d5d5a-415x250-IndiaHerald.jpgముందు దేశం.. ఆ తర్వాతే కులం.. ముందు దేశం ఆ తర్వాతే మతం.. ముందు దేశం.. ఆ తర్వాతే ప్రాంతం.. ముందు దేశం.. ఆ తర్వాతే భాష.. ముందు దేశం.. ఆ తర్వాతే సంస్కృతి.. ఇదే ప్రతి భారతీయుడు గర్వించాల్సిన మన వారసత్వం.. ఇదే ప్రతి భారతీయుడు గుర్తించాల్సిన భారత ఔన్నత్యం.. ఇదే ప్రతి భారతీయుడు నేర్చుకోవాల్సిన గొప్ప విషయం. నిన్న రాజ్యసభలో కాంగ్రెస్ నేత ఆజాద్‌, ప్రధాని మోడీల సంభాషణ.. ప్రతి ఒక్కరూ తప్పక చూసి తీరాల్సిన దృశ్యం. ముఖ్యంగా కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్‌ ప్రసంగం అద్వితీయం.. గులాం నబీ ఆజాద్‌ ఓ ముస్లిం నేత.. azad-modi;modi;kirti;prema;pakistan;narendra modi;congress;prime minister;love;culture;hindus;nijam;narendraవారెవా..! ఆజాద్‌- మోడీ సంభాషణ.. ప్రతి ఇండియన్‌ గర్వపడేలా..?వారెవా..! ఆజాద్‌- మోడీ సంభాషణ.. ప్రతి ఇండియన్‌ గర్వపడేలా..?azad-modi;modi;kirti;prema;pakistan;narendra modi;congress;prime minister;love;culture;hindus;nijam;narendraWed, 10 Feb 2021 05:30:00 GMTకాంగ్రెస్ నేత ఆజాద్‌, ప్రధాని మోడీల సంభాషణ.. ప్రతి ఒక్కరూ తప్పక చూసి తీరాల్సిన దృశ్యం.

ముఖ్యంగా కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్‌ ప్రసంగం అద్వితీయం.. గులాం నబీ ఆజాద్‌ ఓ ముస్లిం నేత.. అందులోనూ కాశ్మీరీ ముస్లిం నేత. అయినా ఆయన తన దేశం పట్ల ఎంత గర్వంగా నిబద్దతతో ఉన్నారో.. ఆయన మాటలను బట్టి చూస్తే అర్థమవుతోంది. ఆయన ప్రసంగంలో దేశం పట్ల ప్రేమ ఉట్టిపడింది. హిందుస్థానీ ముస్లింగా గర్వపడుతున్నానని ఆయన అన్నారు. హిందుస్థానీ ముస్లింగా తాను గర్వపడుతున్నానని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, రాజ్యసభలో విపక్షనేత గులాం నబీ ఆజాద్‌ పేర్కొన్నారు.

ఇప్పటివరకు తాను పాకిస్థాన్ వెళ్లలేదు, నిజంగా తాను అదృష్టవంతుడిని అని భావిస్తున్నానన్నారు ఆజాద్. పాకిస్థాన్‌ వెళ్లని అదృష్టవంతులలో తానూ ఒకడిని అన్నారు. పాక్ పరిస్థితుల గురించి చదివినప్పుడు, హిందుస్థానీ ముస్లింగా గర్వపడుతానని రాజ్యసభలో తన పదవీ విరమణ ప్రసంగంలో గులాం నబీ ఆజాద్‌ అన్నారు. కీలకమైన సమయాల్లో సభను ఎలా నడపాలి అనే విషయాలతో పాటు మరెన్నో అంశాలను మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ‌ నుంచి నేర్చుకున్నానని ఆజాద్‌ స్పష్టంచేశారు. మాజీ ప్రధాని వాజ్‌పేయీ‌కు నివాళులు అర్పించారు.

వీడ్కోలు సందర్భంగా సభ్యులందరితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న ఆజాద్‌, వారందరి సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. తన పదవీ విరమణ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రసంగానికి ఆజాద్ ధన్యవాదాలు తెలిపారు. అంతకుముందు.. ఆజాద్‌ సేవలను కీర్తించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఒకానొక సమయంలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. దేశం కోసం ఆందోళన చెందే వ్యక్తి ఆజాద్‌ అని ప్రధానమంత్రి కొనియాడారు. కన్నీరు పెట్టుకున్నారు.




సర్కారు వారి పాట నుండి సూపర్ స్టార్ లుక్.. అరుపులు కేకలే..!

మూడు నెలల్లోనే మెగా మేనల్లుడి పెళ్లి.. అంతా సీక్రెట్ నడిపిస్తున్నారా..?

దివి పాప క్యాబ్ స్టోరీస్.. ప్రోమోనే పిచ్చెక్కించేసిందిగా..!

పుష్ప అల్లు అర్జున్ ఎంట్రీ సీన్.. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనేట్టుగా..!

జూనియర్ సత్యదేవ్ ని చూసారా..? భార్య కొడుకు ని పరిచయం చేసిన హీరో సత్య దేవ్

జగడ్డ : కడపలో ఫ్యాన్ స్పీడ్ కు సైకిల్ గల్లంతు..!

కృతికి షాకింగ్ డిమాండ్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>