PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections38055594-43f9-4121-9a97-ad29f886a7df-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections38055594-43f9-4121-9a97-ad29f886a7df-415x250-IndiaHerald.jpgఏపిలో మొదటి విడత ఎన్నికలు ముగిశాయి. నిన్న పోలింగ్ కూడా పూర్తయ్యింది. ఈ ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా పోలింగ్ నమోదు అయ్యింది. పోలింగ్ ముగిసే సమయానికి 80 శాతం నమోదు అయ్యింది. ముఖ్యంగా యువత , వృద్దులు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిన్న సాయంత్రం 4 గంటల నుంచి ఎన్నికల లెక్కింపు మొదలైంది.కాగా, సీఎం సొంత జిల్లాలో వైసీపీ జోరు కొనసాగుతుంది. టీడీపీ కి మాత్రం చుక్కెదురైంది. స్థానిక ఎన్నికల పరిస్థితి కనపడుతుంది. కాగా,జిల్లాలో ఎన్నికల ప్రచారం మొదలైనప్పటి నుంచి నేటి వరకు భారీగా నగదు , చీరలను పోలీసులు jagan-nimmagadda-elections;harini;naga;kadapa;police;naga aswin;panchayati;tdp;local language;ycp;petta;rajampetజగడ్డ: కడపలో మరోసారి భారీగా పట్టుబడిన నగదు, చీరలు..!జగడ్డ: కడపలో మరోసారి భారీగా పట్టుబడిన నగదు, చీరలు..!jagan-nimmagadda-elections;harini;naga;kadapa;police;naga aswin;panchayati;tdp;local language;ycp;petta;rajampetWed, 10 Feb 2021 10:00:00 GMTవైసీపీ జోరు కొనసాగుతుంది. టీడీపీ కి మాత్రం చుక్కెదురైంది. స్థానిక ఎన్నికల పరిస్థితి కనపడుతుంది. కాగా,జిల్లాలో ఎన్నికల ప్రచారం మొదలైనప్పటి నుంచి నేటి వరకు భారీగా నగదు , చీరలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.. 


ఇప్పుడు మరోసారి జిల్లాలో నగదును, భారీ సంఖ్యలో చీరలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే..పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కమలాపురానికి సమీపంలో కడప-తాడిపత్రి ప్రధాన రహదారిలో చెక్‌పోస్టు వద్ద మంగళవారం వాహనాల తనిఖీ చేపట్టారు. కడప నకాష్‌వీధికి చెందిన సయ్యద్‌ఉమర్‌ అనే వ్యక్తి ద్విచక్రవాహనంపై నగదుతో కమలాపురానికి బయలుదేరారు. ఇంతలో చెక్‌పోస్టు వద్దకు రాగానే వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా అందులో రూ.10 లక్షలు నగదు ఉన్నట్లు గుర్తించి స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించి నగదుతో పాటు అతడిని పోలీసులకు అప్పగించారు. నగదుకు సంబంధించి ఎలాంటి బిల్లులు లేకపోవడంతో ఆ వ్యక్తితో పాటు నగదును పోలీస్‌స్టేషన్‌లో అప్పగించామని స్క్వాడ్‌ అధికారులు పేర్కొన్నారు.


ఇకపోతే 45 చీరలను, 60 వేలకు పైగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.రాజంపేట మండలం రామాపురం చెక్‌పోస్ట్‌ వద్ద మంగళవారం వాహనాలను తనిఖీ చేస్తుండగా కడప నుంచి ద్విచక్రవాహనంపై చీరలు తరలిస్తున్న పుల్లంపేటకు చెందిన హరిని ఆపి తనిఖీ చేశామన్నారు. అతనివద్ద ఎలాంటి రశీదులు లేకపోవడంతో చీరలను స్వాధీనం చేసుకున్నామన్నారు. మరో ద్విచక్రవాహనంపై వస్తున్న రాజంపేటకు చెందిన నాగూర్‌ను తనిఖీ చేయగా అతని వద్ద రూ.60వేల నగదు లభించిందన్నారు. దానికి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వారిద్దరినీ అదుపులోకి తీసుకుని మన్నూరు పోలీసులకు అప్పగించారు. వారిపై కేసు నమోదు చేసినట్లు మన్నూరు ఎస్సై రోషన్‌ వెల్లడించారు. జిల్లాలో మొదటి విడత ఎన్నికలు ముగిశాయి..ఫలితాలు వైసీపీకి అనుకూలంగా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.. 





ఆడపిల్లవు నీకెందుకు అన్నారు.. కానీ పట్టు బట్టి సాధించి నిరూపించుకుంది

బీజేపీ పెద్ద‌ల‌తో జ‌న‌సేన భేటీ.. సోముపై సంచ‌ల‌న ఫిర్యాదులు..!

ఎడిటోరియల్: నానా యాగి చేసి ఏపి ఎన్నికల కమీషన్ సాధించేమిటి?

ష‌ర్మిల కొత్త ఛానెల్‌.. ఏర్పాట్ల‌లో బిజీబిజీ..!

గుంటూరు పంచాయ‌తీల్లో వైసీపీ ఎమ్మెల్యేల‌కు షాకులు

జగడ్డ: నెల్లూరు జిల్లాలో నోటా రికార్డు..?

బ్రాహ్మ‌ణ ఘోష‌: ఆ మూడు రాష్ట్రాల్లో బ్రాహ్మ‌ణులకు రిజ‌ర్వేష‌న్లు... ఏపీలో వాళ్లేం ఖ‌ర్మ చేసుకున్నారు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>