PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/village-volunteers97eb3f85-1007-486d-852b-b5af5df997d4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/village-volunteers97eb3f85-1007-486d-852b-b5af5df997d4-415x250-IndiaHerald.jpgజీతాల పెంపుకోసం వాలంటీర్లు చేస్తున్న ఆందోళనలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది. జీతాలు పెంచే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. 8వేలు కాదు, 12 వేలు కాదు.. 5వేలనుంచి ఒక్క రూపాయి కూడా పెంచేది లేదని స్పష్టం చేసింది. ఈమేరకు సీఎం జగన్ పేరుతో నేరుగా ప్రభుత్వం వాలంటీర్లకు ఓ లేఖను విడుదల చేసింది. వాలంటీర్లు అంటే జీతం ఆశించకుండా పనిచేసేవారని, ఆ పేరుతో విధులు నిర్వహిస్తూ.. జీతాలకోసం డిమాండ్ చేయడం సరికాదని ఆ లేఖలో సీఎం జగన్ హితవు పలికారు. village volunteers;jagan;letterవాలంటీర్లకు జగన్ షాక్.. జీతాలు పెంచే ప్రసక్తే లేదు..వాలంటీర్లకు జగన్ షాక్.. జీతాలు పెంచే ప్రసక్తే లేదు..village volunteers;jagan;letterWed, 10 Feb 2021 07:00:00 GMTజగన్ పేరుతో నేరుగా ప్రభుత్వం వాలంటీర్లకు ఓ లేఖను విడుదల చేసింది. వాలంటీర్లు అంటే జీతం ఆశించకుండా పనిచేసేవారని, ఆ పేరుతో విధులు నిర్వహిస్తూ.. జీతాలకోసం డిమాండ్ చేయడం సరికాదని ఆ లేఖలో సీఎం జగన్ హితవు పలికారు.
నా ఆత్మీయ చెల్లెమ్మలకు, తమ్ముళ్లకు.. అంటూ లేఖను మొదలు పెట్టిన సీఎం జగన్.. వాలంటీర్లు ప్రతిపక్షాల మాయలో పడొద్దని హితవు పలికారు. జీతం లేకుండా కేవలం 5 వేల రూపాయల గౌరవ భృతితో పనిచేస్తున్నారు కాబట్టే.. వాలంటీర్లపై ప్రజలు గౌరవ భావంతో ఉన్నారని, జీతం తీసుకుని చేసే పని అయితే ఆ గౌరవం ఉండదని హితవు పలికారు. వాలంటీర్ వ్యవస్థకు ఆ గౌరవం దక్కకుండా చేయాలని, అసలు వ్యవస్థే లేకుండా చేయాలని కొంతమంది కుట్రలు పన్నుతున్నారని చెప్పారు జగన్. వారి మాయలో పడొద్దని సూచించారు.

తమకు ఓటు వేశారా లేదా అనేది పట్టించుకోకుండా రాష్ట్రవ్యాప్తంగా 2లక్షల 60వేలమందిని వాలంటీర్లుగా నియమించామని, మీరంతా గౌరవ భృతితో పనిచేసేందుకు ముందుకొచ్చారని మరోసారి గుర్తు చేశారు. వాలంటీర్ వ్యవస్థతో లంచాలకు, పక్షపాతానికి తావులేకుండా పోయిందని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వస్తున్నాయని చెప్పారు. వారంలో మూడు రోజులు మాత్రమే వాలంటీర్ల అటెండెన్స్ నమోదు చేస్తున్నామని, రోజులో ఇన్ని గంటలు పనిచేయాలనే నిబంధన కూడా ఎక్కడా విధించలేదనే విషయాన్ని మరోసారి గుర్తు చేశారు జగన్. 50కుటుంబాల పట్ల బాధ్యతగా పనిచేసే వాలంటీర్ విధిని జీతంతో ముడి పెట్టొద్దని కోరారు.

చివరిగా వాలంటీర్ల జీతాలు పెంచేది లేదని తన లేఖ ద్వారా తేల్చి చెప్పారు జగన్. భవిష్యత్తులో కూడా జీతాల పెంపుకోసం వాలంటీర్లు డిమాండ్ చేసే పరిస్థితి లేకుండా చేశారు. అదే సమయంలో హ్యాండ్ బుక్ లో పాయింట్లు మరోసారి చూడాలని చెప్పిన జగన్, పనితీరులో తేడా వస్తే వాలంటీర్లను తీసేయడానికి అందులోనే నిబంధనలు ఉన్నాయనే విషయాన్ని పరోక్షంగా గుర్తు చేశారు. సీఎం జగన్ రాసిన లేఖపై వాలంటీర్ల స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి. 


పంత్ బ్యాటింగ్ లో టాప్.. కీపింగ్ లో ఫ్లాప్..!!

అమరావతికి జగన్ వరాలు.. అసలు మతలబు ఇదేనా..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఎన్నికల్లో శశికళ వ్యూహం ఏమిటో తెలుసా ?

"వకీల్ సాబ్ "ను ప్రమోట్ చేస్తున్న రాజకీయ నేతలు ..!!

హెరాల్డ్ ఎడిటోరియల్ : తెలంగాణాపై షర్మిల క్లారిటి ఇచ్చేసినట్లేనా ?

సర్కారు వారి పాట నుండి సూపర్ స్టార్ లుక్.. అరుపులు కేకలే..!

మూడు నెలల్లోనే మెగా మేనల్లుడి పెళ్లి.. అంతా సీక్రెట్ నడిపిస్తున్నారా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>