PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/pregnancy1ab5436a-1921-401d-8c90-fcd3c9d39a22-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/pregnancy1ab5436a-1921-401d-8c90-fcd3c9d39a22-415x250-IndiaHerald.jpgప్రపంచంలో అప్పుడప్పుడు వింత సంఘటనలు జరుగుతుంటాయి. మనకు తెలిసినంత వరకు గర్భం దాల్చినప్పుడు రెండు పిండాలు ఉంటె కవలలు అంటాము. కానీ ఒక్క పిండం ఏర్పడిన కొద్దిరోజుల తర్వాత మరో పిండం ఏర్పడటాన్ని ఏం అంటారు. ఇంతకీ అలాంటి సంఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకుందామా. తాజాగా ఓ మహిళ గర్భం దాల్చిన కొద్ది రోజులకే రెండోసారి గర్భవతి కావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అయితే ఆమె అప్పటికే కడుపులో ఒక బిడ్డను మోస్తుండగా మరోబిడ్డ గర్భంలో తయారవుతుంది. ఈ అరుదైన ఘటన ఇంగ్లాండ్‌లోని ట్రౌబ్రిడ్జ్‌లో చోటు చేసుకుంది. pregnancy;women;deva;mandula;2020;woman;vదేవుడా: కడుపులో బిడ్డ ఉండగానే మళ్లీ గర్భం.. ఎక్కడంటే..!?దేవుడా: కడుపులో బిడ్డ ఉండగానే మళ్లీ గర్భం.. ఎక్కడంటే..!?pregnancy;women;deva;mandula;2020;woman;vWed, 10 Feb 2021 07:00:00 GMT మహిళ గర్భం దాల్చిన కొద్ది రోజులకే రెండోసారి గర్భవతి కావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అయితే ఆమె అప్పటికే కడుపులో ఒక బిడ్డను మోస్తుండగా మరోబిడ్డ గర్భంలో తయారవుతుంది. ఈ అరుదైన ఘటన ఇంగ్లాండ్‌లోని ట్రౌబ్రిడ్జ్‌లో చోటు చేసుకుంది.

ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రెబక్కాకు ఇప్పటికే 14 ఏళ్ల కూతురు ఉంది. ఇటీవల ఆమె మళ్లీ గర్భం దాల్చింది. ఇక మూడు వారాల గర్భంతో ఉన్నప్పుడు ఆమె కడుపులో ఇంకో బిడ్డ పుడుతున్నట్లు తెలిసి ఆశ్చర్యపోయింది. అయితే, గతంలో చేయించుకున్న రెండు స్కాన్లలో ఒక బిడ్డ మాత్రమే పెరుగుతున్నట్లు వైద్యులు తెలిపారు. మూడు వారాల తర్వాత కవలలు అని ఎలా చెబుతున్నారని ఆశ్చర్యపోయింది. ఈ అరుదైన పరిస్థితిని వైద్య పరిభాషలో ‘డబుల్ ప్రెగ్నెన్సీ’ లేదా ‘సూపర్ఫెటేషన్’ అని అంటారు.
 
ఈ సందర్భంగా ఆమె పలు పరీక్షలు చేయించుకుంది. ఆమె గర్భం దాల్చడం కోసం వాడిన మందుల వల్లే ఆమెకు ‘డబుల్ ప్రెగ్నెన్సీ’ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. ఆమె తీసుకున్న మందుల ఫలితంగా ఆమె గర్భంతో ఉన్నప్పుడు మరో అండం విడుదలై ఉంటుదని, అందుకే ఆమె మళ్లీ గర్భం దాల్చిందని పేర్కొన్నారు.

అయితే, ఇప్పటికీ వైద్య నిపుణులు ‘సూపర్ఫెటేషన్’కు కారణమయ్యే పరిస్థితుల గురించి పూర్తిగా అంచనా వేయలేకపోతున్నారు. రెబక్కా... 33 వారాల తర్వాత 2020, సెప్టెంబరు నెలలో కవల పిల్లలకు జన్మనిచ్చింది. వీరిలో మగ బిడ్డ 4lb 10oz బరువుండగా, ఆడ బిడ్డ 2lb 7oz బరువు ఉంది. దీంతో ఆడ బిడ్డను కొద్దిరోజులు హాస్పిటల్‌లో ఉంచారు. చిన్నారి పూర్తిగా ఆరోగ్యంతో కొలుకొనే వరకు సుమారు మూడు నెలలు వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఎట్టకేలకు డిసెంబరు 25న చిన్నారిని డిశ్చార్జ్ చేశారు.




ప్రజల్లో కనుమరుగైన వైసీపీ నేతలు... ఇదే కొంప ముంచుతుంది...?

ఉప్పెనకు ఊహించని రీతిలో ప్రీ రిలీజ్ బిజినెస్

హెరాల్డ్ సెటైర్ : జగన్, చంద్రబాబు వల్లే ఇదంతా జరిగిందా ?

చిన్నమ్మకు రజనీ ఫోన్.. అదే కారణమా ?

అమరావతికి జగన్ వరాలు.. అసలు మతలబు ఇదేనా..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఎన్నికల్లో శశికళ వ్యూహం ఏమిటో తెలుసా ?

"వకీల్ సాబ్ "ను ప్రమోట్ చేస్తున్న రాజకీయ నేతలు ..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>