EditorialVijayaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/ysr-sharmila-telangana-kcr-jagan-ycp-amaravatie35e6c1e-02d6-4739-bf75-f7a6532bd47b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/ysr-sharmila-telangana-kcr-jagan-ycp-amaravatie35e6c1e-02d6-4739-bf75-f7a6532bd47b-415x250-IndiaHerald.jpgతెలంగాణ జిల్లాల్లోని రాజన్న మద్దతుదారులు, అభిమానుల ద్వారా గ్రౌండ్ లెవల్లో ఉన్న ప్రజాభిప్రాయాలు వినేందుకే తాను సమావేశమవుతున్నట్లు చెప్పారు. ఇదే విషయాన్ని సమావేశంలో చెబుతు తాను మాట్లాడటానికి సమావేశం పెట్టలేదని, కేవలం వినటానికి మాత్రమే సమావేశం పెట్టినట్లు చెప్పారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం మార్చిలో కొత్త పార్టీని షర్మిల ప్రకటించే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ కోసం ఓ న్యాయనిపుడితో ఇప్పటికే మాట్లాడినట్లు సమాచారం. సమావేశానికి సంబంధించి ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. షర్మిల ఇంysr sharmila telangana kcr jagan ycp amaravati;jagan;telangana;y. s. rajasekhara reddy;mp;district;nalgonda;chief minister;ycp;khammam;reddy;zero;party;sajjala ramakrishna reddyహెరాల్డ్ ఎడిటోరియల్ : తెలంగాణాపై షర్మిల క్లారిటి ఇచ్చేసినట్లేనా ?హెరాల్డ్ ఎడిటోరియల్ : తెలంగాణాపై షర్మిల క్లారిటి ఇచ్చేసినట్లేనా ?ysr sharmila telangana kcr jagan ycp amaravati;jagan;telangana;y. s. rajasekhara reddy;mp;district;nalgonda;chief minister;ycp;khammam;reddy;zero;party;sajjala ramakrishna reddyWed, 10 Feb 2021 03:00:00 GMTతెలంగాణాలో మరో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు రంగం రెడీ అయ్యిందా ? వైఎస్ షర్మిల మాటలు చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. దివంగత ముఖ్యమంత్రి వైస్సార్ మద్దతుదారులు, అభిమానులతో మంగళవారం షర్మిల సమావేశం నల్గొండ జిల్లా నేతలతో మొదలైంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతు తెలంగాణాలో రాజన్న రాజ్యం తీసుకొస్తానని చెప్పారు. రాజన్న రాజ్యం తెలంగాణాలో ఎందుకు లేదు ? ఎందుకు తీసుకురాకూడదనే సందేహాలు తనకున్నట్లు చెప్పారు. ఈ విషయాలపై స్పష్టత కోసమే తాను రాజన్న మద్దతుదారులు, అభిమానులతో సమావేశాలు పెడుతున్నట్లు చెప్పారు. వైఎస్సార్ రాజ్యం తీసుకు వచ్చేందుకు గ్రౌండ్ లెవల్లో ఉన్న పరిస్ధితులు తెలుసుకునేందుకే తాను సమావేశాలు నిర్వహిస్తున్నట్లు స్పష్టంగా చెప్పేశారు. తొందరలోనే 100 నియోజకవర్గాల్లో పాతయాత్ర చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.




తెలంగాణ జిల్లాల్లోని రాజన్న మద్దతుదారులు, అభిమానుల ద్వారా గ్రౌండ్ లెవల్లో ఉన్న ప్రజాభిప్రాయాలు వినేందుకే తాను సమావేశమవుతున్నట్లు చెప్పారు. ఇదే విషయాన్ని సమావేశంలో చెబుతు తాను మాట్లాడటానికి సమావేశం పెట్టలేదని, కేవలం వినటానికి మాత్రమే  సమావేశం పెట్టినట్లు చెప్పారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం మార్చిలో కొత్త పార్టీని షర్మిల ప్రకటించే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ కోసం ఓ న్యాయనిపుడితో ఇప్పటికే మాట్లాడినట్లు సమాచారం. సమావేశానికి సంబంధించి ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. షర్మిల ఇంటి ముందు పెద్ద ఎత్తున భారీ ఫ్లెక్సీలు వెలిశాయి. ఆ ఫ్లెక్సీల్లో షర్మిల, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఫొటోలు మాత్రమే ఉన్నాయి. ఏ ఫ్లెక్సీలో కూడా ఎక్కడా జగన్మోహన్ రెడ్డి ఫొటో లేకపోవటమే ఆశ్చర్యంగా ఉంది.




నిజానికి జగన్ మైనస్ విజయమ్మ, షర్మిల=జీరో అన్న విషయం అందరికీ తెలిసిందే. మరలాంటిది జగన్ ఫొటో లేకుండానే షర్మిల, వైఎస్సార్ ఫొటోలతో భారీ ఫ్లెక్సీలు వెలిశాయంటే అర్ధం ఏమిటి ? ఇంకో పాయింట్ ఏమిటంటే షర్మిల ఆత్మీయ సమావేశానికి సంబంధించిన ప్రచారం జగన్ మీడియాలో కనబడకపోవటమే. దినపత్రికలో కానీ టీవీలో కానీ ఎక్కడా సమావేశానికి సంబంధించిన చిన్న వార్త కానీ విజువల్స్ కానీ కనబడలేదు. దీన్నిబట్టి జగన్ కు సంబంధం లేకుండానే షర్మిల సమావేశం జరుగుతోందనే ప్రచారం ఊపందుకుంది. ఇదే విషయాన్ని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణాలో వైసీపీని విస్తరించే విషయంలో జగన్ వ్యతిరేకమన్నారు. వైసీపీని తెలంగాణాలో కూడా విస్తరించాలని అనుకుంటే ఏపిలో నమ్ముకున్న జనాలకు పూర్తి న్యాయం చేయలేనని జగన్ భావించినట్లు చెప్పారు. ఇదే సమయంలో తెలంగాణాలో పార్టీ పెట్టి రాజన్న రాజ్యం తేవాలన్నది షర్మిల ఆలోచనగా సజ్జల చెప్పారు.




వైసీపీ నేతల సమాచారం ప్రకారం తెలంగాణాలో వైఎస్సార్ ఓటుబ్యాంకు సుమారుగా 20 శాతం ఉందట. 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున ఖమ్మంలో ఒక ఎంపి, ముగ్గురు ఎంఎల్ఏలు గెలిచిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. నిజానికి ఆ ఎన్నికల్లో జగన్ అసలు తెలంగాణాలో కొన్ని నియోజకవర్గాల్లో టికెట్లు వరకు ఇచ్చి మిగిలింది పట్టించుకోలేదు. ఈమాత్రం దానికే పార్టీ తరపున నలుగురు గెలిచారు. నిజానికి వైఎస్సార్ కు తెలంగాణాలో బలమైన మద్దతుదారులున్న విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి మంగళవారం మొదలైన సమావేశాలు రెండు రోజులకు ఒక జిల్లా చొప్పున జరుగుతుంది. ఇదంతా అయ్యేటప్పటికి కనీసం నెలరోజులు పడుతుంది. సో ఆ తర్వాత షర్మిల పార్టీ ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.  




సర్కారు వారి పాట నుండి సూపర్ స్టార్ లుక్.. అరుపులు కేకలే..!

మూడు నెలల్లోనే మెగా మేనల్లుడి పెళ్లి.. అంతా సీక్రెట్ నడిపిస్తున్నారా..?

దివి పాప క్యాబ్ స్టోరీస్.. ప్రోమోనే పిచ్చెక్కించేసిందిగా..!

పుష్ప అల్లు అర్జున్ ఎంట్రీ సీన్.. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనేట్టుగా..!

జూనియర్ సత్యదేవ్ ని చూసారా..? భార్య కొడుకు ని పరిచయం చేసిన హీరో సత్య దేవ్

జగడ్డ : కడపలో ఫ్యాన్ స్పీడ్ కు సైకిల్ గల్లంతు..!

కృతికి షాకింగ్ డిమాండ్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>