PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/note-for-vote-case3d1269ab-45a2-499f-802b-6a7f1c0985b0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/note-for-vote-case3d1269ab-45a2-499f-802b-6a7f1c0985b0-415x250-IndiaHerald.jpgరేవంత్ రెడ్డి ఓ కీలక అంశాన్ని కోర్టు ముందుంచి అందరికీ షాక్ ఇచ్చారు. ఏసీబీ కోర్టులో విచారణలో పాల్గొన్న ఆయన అసలు ఓటుకు నోటు కేసు ఏసీబీ పరిధిలోకి రాదని... దీన్ని గమనించాలి అంటూ విజ్ఞప్తి చేస్తూనే.. హైకోర్టుకు వెళ్తామని వెల్లడించారు. note for vote case;revanth;tiru;uday kiran;revanth reddy;congress;mp;high court;court;february;audio;anti-corruption bureau;reddy;simhaఓటుకు నోటు కేసులో కోర్టు కీలక నిర్ణయం...?ఓటుకు నోటు కేసులో కోర్టు కీలక నిర్ణయం...?note for vote case;revanth;tiru;uday kiran;revanth reddy;congress;mp;high court;court;february;audio;anti-corruption bureau;reddy;simhaWed, 10 Feb 2021 12:00:00 GMTఏసీబీ కోర్టులో విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆడియో టేపుల స్వర నమూనా ఎఫ్ ఎస్ ఎల్ రిపోర్టు కీలకమైన ఈ కేసు ఎన్నో మలుపులు తిరుగుతోంది. కాంగ్రెస్ నేత, ఎంపీ రేవంత్ రెడ్డి ఈ కేసులో ఏ 1 నిందితుడిగా ఉన్నారు. దేశంలోని మాజీ మరియు ప్రస్తుత ప్రజా ప్రతినిధులకు సంబంధించి కేసులు ఏవైతే  ఉన్నాయో వాటన్నిటినీ వెంటనే వీలైనంత త్వరగా పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో... ఈ మేరకు ఓటుకు నోటు కేసు వేగం పుంజుకుంది. ఈ కేసు అవినీతి నిరోధక శాఖ పరిధిలోకి వస్తుందని స్పష్టం చేసి... రేవంత్ రెడ్డి పిటిషన్ ను తోసిపుచ్చి, ఫిబ్రవరి 8 కి వాయిదా వేయగా తాజాగా ఓటుకు నోటు కేసు విషయమై విచారణ చేపట్టింది ఏసీబీ కోర్టు.

అయితే ఈ కేసులో ఏ 1 నిందితుడైన రేవంత్ రెడ్డి మరియు ఉదయ్ సింహా సెబాస్టియన్ విచారణ నిమిత్తం ఏసీబీ కోర్టులో హాజరయ్యారు. కాగా రేవంత్ రెడ్డి ఓ కీలక అంశాన్ని కోర్టు ముందుంచి అందరికీ షాక్ ఇచ్చారు. ఏసీబీ కోర్టులో విచారణలో పాల్గొన్న ఆయన అసలు ఓటుకు నోటు కేసు ఏసీబీ పరిధిలోకి రాదని... దీన్ని గమనించాలి అంటూ విజ్ఞప్తి చేస్తూనే.. హైకోర్టుకు వెళ్తామని  వెల్లడించారు. అయితే విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు చివరికి ఈ కేసు తదుపరి విచారణను వచ్చే నెల 16వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో నిందితులు అందరూ 16వ తేదీన తప్పక కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది.
హైకోర్టులో రివిజన్ పిటీషన్ దాఖలు చేయడం కోసం రేవంత్ రెడ్డి  ఒక వారం గడువు ఇవ్వాలని కోర్టును కోరారు. అభియోగాల నమోదు ప్రక్రియను ఆపాలని విజ్ఞప్తి చేశారు. కానీ సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు విచారణ త్వరగా ముగించాలన్న   విషయాన్ని మరోసారి గుర్తు చేసింది ఏసీబీ. మరోవైపు న్యాయవాదులకు  ఈ కేసు నిమిత్తం ఈనెల 16వ తారీఖు తర్వాత రెండు రోజుల్లో వాదోపవాదనలు వినిపించడానికి  సిద్ధంగా ఉండాలని ఏసీబీ కోర్టు సూచించింది. దేశ రాజకీయాల్లో సంచలనంగా మారిన ఓటుకు నోటు కేసు  తదుపరి విచారణలో ఓ కొలిక్కి రానున్నట్లు తెలుస్తోంది.



నిమ్మగడ్డ ఫుల్ హ్యాపీ... పోలీసులకు స్పెషల్ థాంక్స్

కథను కనులకు చూపించేదే నాట్యం.. టీజర్ మాత్రం మాములుగా లేదు..!

తమ్ముడి కొడుకు మీద దిల్ రాజు భారీ పెట్టుబడి

మళ్ళి రిస్క్ తీసుకుంటున్న రవితేజ..!?

బిగ్ బాస్ 5 కి డేట్ టైం ఫిక్స్...?

ఆ సింగర్ పాడితే మిలియన్ వ్యూస్ రావాల్సిందే.. సిద్ శ్రీరాం ఒక్కపాటకి ఎంత డిమాండ్ చేస్తున్నాడంటే..!

బీజేపీ పెద్ద‌ల‌తో జ‌న‌సేన భేటీ.. సోముపై సంచ‌ల‌న ఫిర్యాదులు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>