SportsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-newsd4e77ac1-6a0f-4aa3-8548-0a74946fb0c5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-newsd4e77ac1-6a0f-4aa3-8548-0a74946fb0c5-415x250-IndiaHerald.jpgఆస్ట్రేలియా పర్యటనలో అద్బుత విజయం.. యువ క్రికెటర్ల సంచలన ప్రదర్శన.. గబ్బాలో 32 ఏళ్లనుండి ఓటమి ఎరుగని ఆసీస్ జట్టుకు ఓటమిని రుచిచూపించిన ఘనత.. ఇంత బలమైన ఆత్మ విశ్వాసంతో ఉన్న టీమిండియా కు ఇంగ్లాండ్ పెద్ద షాక్ ఇచ్చింది. చెన్నై లో చేపాక్ స్టేడియంలో జరిగిన మొదటి టెస్ట్ లో ఊహించని విధంగా ఓటమి పలు అయ్యింది. స్వదేశం లో భారత్ కు తిరుగుండదు అని అనుకున్న అభిమానులకు అసంతృప్తి ని మిగిల్చింది. స్వదేశంలో 2017 (పుణేలో)లో ఆసీస్‌ చేతిలో పరాజయం తర్వాత మళ్లీ టీమిండియాను ఒక జట్టు ఓడించగలిగింది.sports news;tiru;virat kohli;india;australia;england;new zealand;media;chennai;letter;yuva;adelaide;nijamభారత్ vs ఇంగ్లాండ్ : ఓటమికి బాద్యత వహించేది అతనేనా..?భారత్ vs ఇంగ్లాండ్ : ఓటమికి బాద్యత వహించేది అతనేనా..?sports news;tiru;virat kohli;india;australia;england;new zealand;media;chennai;letter;yuva;adelaide;nijamWed, 10 Feb 2021 17:00:00 GMTఆస్ట్రేలియా పర్యటనలో అద్బుత విజయం.. యువ క్రికెటర్ల సంచలన ప్రదర్శన.. గబ్బాలో 32 ఏళ్లనుండి ఓటమి ఎరుగని ఆసీస్ జట్టుకు ఓటమిని రుచిచూపించిన ఘనత.. ఇంత బలమైన ఆత్మ విశ్వాసంతో ఉన్న టీమిండియా కు ఇంగ్లాండ్ పెద్ద షాక్ ఇచ్చింది. చెన్నై లో చేపాక్ స్టేడియంలో జరిగిన మొదటి టెస్ట్ లో ఊహించని విధంగా ఓటమి పలు అయ్యింది. స్వదేశం లో భారత్ కు తిరుగుండదు అని అనుకున్న అభిమానులకు అసంతృప్తి ని మిగిల్చింది.  స్వదేశంలో 2017 (పుణేలో)లో ఆసీస్‌ చేతిలో పరాజయం తర్వాత మళ్లీ టీమిండియాను ఒక జట్టు ఓడించగలిగింది.

 ఇటీవల ఆస్ట్రేలియా లో అద్బుత విజయం సాధించిన టీమిండియా స్వదేశం లో ఎందుకు చతికిలపడింది అనే దానిపై బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు గెలుపు-ఓటమి అనేది సహజం అని అంటే, మరి కొందరు జట్టు నాయకత్వం పై నెపం మోపుతున్నారు. కెప్టెన్సీ లో కోహ్లీ విఫలమయ్యడాని దాని ప్రభావం జట్టుపై పడిందని కొందరు మాజీలు తమ వాదనను వినిపిస్తున్నారు. మరి నిజంగానే కోహ్లీ కెప్టెన్సీ లో విఫలం అవుతున్నాడా అంటే అవుననే వ్యాఖ్యలూ బలంగా వినిపిస్తున్నాయి.నిజానికి టెస్ట్ ఫార్మట్‌  లో కెప్టెన్ గా  విరాట్‌ కోహ్లీ ఎన్నో ఘనతలు సాధించాడు.

ఆసీస్‌ దిగ్గజ క్రికెటర్‌ రికీ పాంటింగ్ (62.33%) తర్వాత అత్యధిక గెలుపు శాతం సాధించిన సారథి కోహ్లీ (57.89%)నే. అయితే విరాట్‌ వరుసగా గత నాలుగు టెస్టుల్లో ఓటమిపాలయ్యాడు. న్యూజిలాండ్ పర్యటనలో రెండు టెస్టులు, ఆస్ట్రేలియా పర్యటనలో అడిలైడ్ టెస్టు, చెన్నై వేదికగా జరిగిన ఇంగ్లాండ్ టెస్టులో జరాజయాన్నిఅతనితో వేయించారు చవి చూశాడు. ఈ నేపథ్యంలో. కోహ్లీ  ఓటమికి పూర్తి నైతిక బాద్యత తనదే అంటూ మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో తెలిపాడు. ఈ ఓటమి మాకు పాఠాలను నేర్పిందని వ్యాఖ్యానించాడు. కాగా జట్టును నడిపించడంలో కోహ్లీ కంటే రహనే సరైన కెప్టెన్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో 13 వ తేదీ నుండి జరిగే రెండవ టెస్ట్ పై ఆసక్తి నెలకొంది. ఒకవేళ రెండవ టెస్ట్ లో టీమిండియా ఓటమిపాలు అయితే కోహ్లీ పై మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. 


దారుణం.. తొమ్మిదేళ్ల చిన్నారికి బిర్యానీ ఆశ చూపి గ్యాంగ్‌ రేప్‌.. దారుణ హత్య !

త్వరలో మగధీర 2 కూడా రాబోతోందా..?

బిగ్ బ్రేకింగ్ న్యూస్ : మహేష్ బాబు తో రాజమౌళి మూవీ స్టోరీ ఫిక్స్ ....నెట్టింట న్యూస్ వైరల్ ....??

తెలుగు దర్శకులు నాకు అన్యాయం చేస్తున్నారు: నటి హేమ..

హీరోయిన్ దీక్షా సేత్ మీకు గుర్తుందా.. ఆమె ఇప్పుడు పెద్ద స్టార్ ప్రొడ్యూసర్ అట.

జగడ్డ : టీడీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం.. మరో పక్క హై టెన్షన్ ?

జగడ్డ: గిరా గిరా తిరిగింది ఫ్యాను...చంద్రబాబు సైకిల్ ఏమో గాన్...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>