SportsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-newsd50c856d-34ca-4ddb-bf60-ada25b5452be-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-newsd50c856d-34ca-4ddb-bf60-ada25b5452be-415x250-IndiaHerald.jpgయువ సంచలనం రిషబ్ పంత్ టీమిండియాలో మెల్లమెల్లగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నాడు. కీలక ఆ సమయంలో జట్టును ఆదుకుంటూ తన సత్తా ఏంటో ఇప్పటికే నిరూపించుకున్నాడు. అయినప్పటికీ రిషబ్ పంత్ పై కామెంట్స్ మాత్రం ఆగడం లేదు. తన బ్యాటింగ్ పై ఎవరికి అనుమానాలు లేకపోయినప్పటికీ వికెట్ కీపింగ్ లో మాత్రం విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నాడు. తాజాగా రిషబ్ పంత్ పై మాజీ ఆటగాడు సయ్యద్ కిర్మాణి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బ్యాట్స్‌మన్‌గా రిషభ్‌పంత్‌ సహజ ప్రతిభాశాలి అని, వికెట్‌కీపింగ్‌లో మాత్రం ఇంకా శైశవ దశలోనే ఉన్నాడని sports news;rishabh pant;yuva;dookudu;paruguపంత్ బ్యాటింగ్ లో టాప్.. కీపింగ్ లో ఫ్లాప్..!!పంత్ బ్యాటింగ్ లో టాప్.. కీపింగ్ లో ఫ్లాప్..!!sports news;rishabh pant;yuva;dookudu;paruguWed, 10 Feb 2021 07:08:31 GMTయువ సంచలనం రిషబ్ పంత్ టీమిండియాలో మెల్లమెల్లగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నాడు. కీలక ఆ సమయంలో జట్టును ఆదుకుంటూ తన సత్తా ఏంటో ఇప్పటికే నిరూపించుకున్నాడు. అయినప్పటికీ రిషబ్ పంత్ పై కామెంట్స్ మాత్రం ఆగడం లేదు. తన బ్యాటింగ్ పై ఎవరికి అనుమానాలు లేకపోయినప్పటికీ వికెట్ కీపింగ్ లో మాత్రం విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నాడు. తాజాగా రిషబ్ పంత్ పై మాజీ ఆటగాడు  సయ్యద్ కిర్మాణి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బ్యాట్స్‌మన్‌గా రిషభ్‌పంత్‌ సహజ ప్రతిభాశాలి అని, వికెట్‌కీపింగ్‌లో మాత్రం ఇంకా శైశవ దశలోనే ఉన్నాడని ఆయన పేర్కొన్నాడు. వికెట్ల వెనకాల ప్రాథమిక అంశాల్లో పంత్ ఇంకా తడబడుతూనే ఉన్నాడని, కీపింగ్ పై ప్రత్యేక దృష్టి సాధించి మెరుగవ్వాలని సూచించాడు.

తక్కువ వయసే కాబట్టి కాలం గడిచే కొద్దీ పరిణతి సాధిస్తాడని వెల్లడించాడు. రిషభ్‌ పంత్‌ ప్రతిభావంతుడు. సహజసిద్ధ స్ట్రోక్‌ ప్లేయర్‌. అయినప్పటికీ సమయానుకూలంగా ఆడడంలో అతడెంతో నేర్చుకోవాల్సి ఉంది అని కిర్మాణి అభిప్రాయపడ్డాడు. ఎప్పుడు రక్షణాత్మకంగా ఆడాలి, ఎప్పుడు దూకుడుగా ఆడాలో తెలుసుకోవాలి. క్రీజులో నిలవాల్సిన సమయంలో వికెట్ సమర్పించుకుంటూ నిరాశ పరుస్తున్నాడు పంత్ గతంలో జట్టును గెలిపించే అవకాశాలు వచ్చినా అతడు వికెట్‌ పారేసుకున్నాడు. చెన్నైలోనూ అంతే. బ్యాట్స్‌మన్‌ 80 పరుగుల వద్ద ఉన్నప్పుడు శతకంపై దృష్టిపెట్టాలి. సాహసం చేయకూడదు. దూకుడుగా ఆడడం కాస్త తగ్గించి మెల్లగా పరుగులు రాబట్టడం పై దృష్టి పెట్టాలి.

ఆ విషయంలో పంత్ వెనుకబడ్డాడు అని  కిర్మాణి అభిప్రాయపడ్డాడు. పరిస్థితులను బట్టి ఆడడం పంత్ ఇంకా నేర్చుకోవాలని సూచించాడు. ఆస్ట్రేలియాలో అతడు చక్కగా ఆడాడు. బ్రిస్బేన్‌లో రిషభ్ ఇన్నింగ్స్‌ సాధికారికంగా ఉంది. తొలిసారి అతడు జట్టును గెలిపించాడు. అడ్డుకోవాల్సిన సమయంలో బంతిని డిఫెండ్‌ చేశాడు. అవసరమైనప్పుడు షాట్లు ఆడాడు. ఇదంతా అనుభవం ద్వారా వస్తుంది. అతడింకా 20ల్లోనే ఉన్నాడు. పరిణతి రావాలంటే కనీసం 30 ఏళ్లు పడుతుంది. ఈ క్రమంలో అతడు అన్నింటా పరిణతి సాధించగలడు’ అని కిర్మాణి వెల్లడించాడు.


అమరావతికి జగన్ వరాలు.. అసలు మతలబు ఇదేనా..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఎన్నికల్లో శశికళ వ్యూహం ఏమిటో తెలుసా ?

"వకీల్ సాబ్ "ను ప్రమోట్ చేస్తున్న రాజకీయ నేతలు ..!!

హెరాల్డ్ ఎడిటోరియల్ : తెలంగాణాపై షర్మిల క్లారిటి ఇచ్చేసినట్లేనా ?

సర్కారు వారి పాట నుండి సూపర్ స్టార్ లుక్.. అరుపులు కేకలే..!

మూడు నెలల్లోనే మెగా మేనల్లుడి పెళ్లి.. అంతా సీక్రెట్ నడిపిస్తున్నారా..?

దివి పాప క్యాబ్ స్టోరీస్.. ప్రోమోనే పిచ్చెక్కించేసిందిగా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>