Viralkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/categories/viral-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/categories/viral-IndiaHerald.jpgప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ పోరు జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఎలక్షన్లలో నిలబడినటువంటి అభ్యర్థులు గెలుపొందడం కోసం వినూత్నమైన పద్ధతులలో ప్రజలను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఎన్నికలలో డబ్బు, మద్యం పంచ రాదని నిబంధన ఉండటంతో ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు కొత్తతరహా పద్ధతుల ద్వారా ప్రజలను ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే పశ్చిమగోదావరి జిల్లా, ఉండి మండలంలో ఒక గ్రామంలో వార్డు పదవికి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి తన వార్డు పరిధిలో ఉన్నటువంటి ప్రజలను ఆకట్టుకోవడానికి వినూత్నమైన ఆలbolier kollu;andhra pradesh;district;panchayati;mandalam;villageబాయిలర్ కోళ్లు, పెరుగు ప్యాకెట్లు పంపిణీ చేసిన వార్డ్ అభ్యర్థి!బాయిలర్ కోళ్లు, పెరుగు ప్యాకెట్లు పంపిణీ చేసిన వార్డ్ అభ్యర్థి!bolier kollu;andhra pradesh;district;panchayati;mandalam;villageWed, 10 Feb 2021 10:00:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ పోరు జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఎలక్షన్లలో నిలబడినటువంటి అభ్యర్థులు గెలుపొందడం కోసం వినూత్నమైన పద్ధతులలో ప్రజలను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఎన్నికలలో డబ్బు, మద్యం పంచ రాదని నిబంధన ఉండటంతో ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు కొత్తతరహా పద్ధతుల ద్వారా ప్రజలను ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే పశ్చిమగోదావరి జిల్లా, ఉండి మండలంలో ఒక గ్రామంలో వార్డు పదవికి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి తన వార్డు పరిధిలో ఉన్నటువంటి ప్రజలను ఆకట్టుకోవడానికి వినూత్నమైన ఆలోచన చేశాడు.                                                                                     

ఆదివారం అవార్డు పరిధిలో ఉన్నటువంటి ఓటర్లకు ఆ అభ్యర్థి ఇంటింటికి ఒక బాయిలర్ కోడి, పెరుగు ప్యాకెట్లను పంపిణీ చేశారు. ప్రస్తుత పంచాయతీ ఎలక్షన్లలో పోటీ చేసే అభ్యర్థులు ఈ విధమైన కొత్త ధోరణిలో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. సాధారణంగా ఆదివారం ఎక్కువగా మాంసాహారం తినడానికి ఇష్టపడతారు. ఈ విషయం గ్రహించిన వార్డు అభ్యర్థి ప్రతి ఇంటికి బ్రాయిలర్ కోడిని, పెరుగు ప్యాకెట్లను పంపిణీ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.

వార్డు అభ్యర్థి చేసిన ఈ వినూత్న ప్రయత్నం చూసి సదరు ప్రత్యర్థి అభ్యర్థి కొంతవరకు షాక్ కి గురయ్యాడు. ఇదే తరహాలోనే అదే మండలానికి చెందిన మరో గ్రామంలో వార్డు పదవికి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి ఇంటింటికి నిత్యావసర కిరాణా సరుకులను పంపిస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. ఈ విధంగా పంచాయతీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు డబ్బు, మద్యం పంపిణీ చేయకుండా కొత్త పద్ధతిలో ఓటర్లను ఆకర్షిస్తున్నారు.


ఆడపిల్లవు నీకెందుకు అన్నారు.. కానీ పట్టు బట్టి సాధించి నిరూపించుకుంది

బీజేపీ పెద్ద‌ల‌తో జ‌న‌సేన భేటీ.. సోముపై సంచ‌ల‌న ఫిర్యాదులు..!

ఎడిటోరియల్: నానా యాగి చేసి ఏపి ఎన్నికల కమీషన్ సాధించేమిటి?

ష‌ర్మిల కొత్త ఛానెల్‌.. ఏర్పాట్ల‌లో బిజీబిజీ..!

గుంటూరు పంచాయ‌తీల్లో వైసీపీ ఎమ్మెల్యేల‌కు షాకులు

జగడ్డ: నెల్లూరు జిల్లాలో నోటా రికార్డు..?

బ్రాహ్మ‌ణ ఘోష‌: ఆ మూడు రాష్ట్రాల్లో బ్రాహ్మ‌ణులకు రిజ‌ర్వేష‌న్లు... ఏపీలో వాళ్లేం ఖ‌ర్మ చేసుకున్నారు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>