PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu90cce641-9308-490b-b0cf-8fcd303b12be-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu90cce641-9308-490b-b0cf-8fcd303b12be-415x250-IndiaHerald.jpgటీడీపీ అధినేత చంద్రబాబు తీరును పరిశీలించారా.. ఇటీవల వచ్చిన మార్పును గమనించారా.. చంద్రబాబు .. పార్టీ విషయాలపై బాగా దృష్టి పెడుతున్నారు. ఎంతగా అంటే.. చివరకు పంచాయతీ ఎన్నికల విషయంలో కూడా ఆయన కాన్ఫరెన్సులు పెడుతున్నారు.. పార్టీ విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు.. ఇవాళ కూడా పంచాయతీ తొలిదశ ఎన్నికలపై ఆయన సమీక్ష నిర్వహించారు. కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో టీడీపీ అభ్యర్థులు గెలిచినప్పటికీ ఫలితాలు ప్రకటించకుండా వైసీపీ నాయకులు అరాచకం చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల ఫలితాలను అన్ని జిల్లాల chandrababu;cbn;chalam;jagan;chanakya-movie-2019;chanakya;panchayati;assembly;mla;tdp;local language;ycp;party;mantraఈ చంద్రబాబుకు ఏమైంది.. ఏంటి.. మరీ ఇలా చేస్తున్నారు..?ఈ చంద్రబాబుకు ఏమైంది.. ఏంటి.. మరీ ఇలా చేస్తున్నారు..?chandrababu;cbn;chalam;jagan;chanakya-movie-2019;chanakya;panchayati;assembly;mla;tdp;local language;ycp;party;mantraWed, 10 Feb 2021 00:00:00 GMTటీడీపీ అధినేత చంద్రబాబు తీరును పరిశీలించారా.. ఇటీవల వచ్చిన మార్పును గమనించారా.. చంద్రబాబు .. పార్టీ విషయాలపై బాగా దృష్టి పెడుతున్నారు. ఎంతగా అంటే.. చివరకు పంచాయతీ ఎన్నికల విషయంలో కూడా ఆయన కాన్ఫరెన్సులు పెడుతున్నారు.. పార్టీ విషయాలను ఎప్పటికప్పుడు  తెలుసుకుంటున్నారు.. ఇవాళ కూడా పంచాయతీ తొలిదశ ఎన్నికలపై ఆయన సమీక్ష నిర్వహించారు. కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో  టీడీపీ అభ్యర్థులు గెలిచినప్పటికీ ఫలితాలు ప్రకటించకుండా  వైసీపీ నాయకులు అరాచకం చేస్తున్నారని విమర్శించారు.  


ఎన్నికల ఫలితాలను  అన్ని జిల్లాల నేతలతో నేరుగా మాట్లాడుతూ మానిటరింగ్ చేస్తున్నారు చంద్రబాబు. అసెంబ్లీ ఎన్నికల తరహాలో ఈ సమీక్ష జరుగుతోంది. కావలి రూరల్ మండలం చలంచర్లలో టీడీపీ గెలిచినప్పటికీ ప్రకటించకుండా కావలి ఎమ్మెల్యే వెళ్లి రుబాబు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. వెంటనే ఎస్సీలు, కలెక్టర్లు స్పందించి గెలిచిన చోట డిక్లేర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దాడులకు పాల్పడ్డ అధికార పార్టీ వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.


మరో విషయం ఏంటంటే..  సీఎం జగన్ వైఖరి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఆయన అస్సలు ఈ పంచాయతీ ఎన్నికల జోలికి వచ్చినట్టే కనిపించడం లేదు. ఎన్నికల వ్యవహారం మొత్తం పార్టీ నేతలకు వదిలేసినట్టు కనిపించింది. ఎక్కడికక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక నేతలకే పంచాయతీ ఎన్నికల వ్యవహారాన్ని జగన్ వదిలేసినట్టు కనిపిస్తోంది. అసలు ఎన్నికల పై ఆయన సమీక్షించడం కానీ.. నేతలతో మాట్లాడటం కానీ.. ఎక్కడా జరిగినట్టు కనిపించడం లేదు.


మరి చంద్రబాబు కష్టం ఫలిస్తుందా.. తెలుగు దేశం మెరుగైన ఫలితాలు సాధిస్తుందా.. అసలు చంద్రబాబు వ్యూహాలు ఇప్పుడు పని చేస్తున్నాయా.. అవి ఔట్ డేటెడ్ అయిపోయాయా అన్న విషయాలు తెలియాలంటే.. పంచాయతీ ఎన్నికల ఫలితాలు వచ్చే వరకూ చూడాల్సిందే. మరి చూడాలి చంద్రబాబు చాణక్యం పనిచేస్తుందా.. ఒకవేళ ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష తెలుగు దేశం కాస్తో కూస్తో పుంజుకుంటే.. అందుకు చంద్రబాబే కారణమన్నది నిర్వివాదాంశం. 


సర్కారు వారి పాట నుండి సూపర్ స్టార్ లుక్.. అరుపులు కేకలే..!

మూడు నెలల్లోనే మెగా మేనల్లుడి పెళ్లి.. అంతా సీక్రెట్ నడిపిస్తున్నారా..?

దివి పాప క్యాబ్ స్టోరీస్.. ప్రోమోనే పిచ్చెక్కించేసిందిగా..!

పుష్ప అల్లు అర్జున్ ఎంట్రీ సీన్.. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనేట్టుగా..!

జూనియర్ సత్యదేవ్ ని చూసారా..? భార్య కొడుకు ని పరిచయం చేసిన హీరో సత్య దేవ్

జగడ్డ : కడపలో ఫ్యాన్ స్పీడ్ కు సైకిల్ గల్లంతు..!

కృతికి షాకింగ్ డిమాండ్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>