Moviesyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ramcharan-is-going-to-work-with-director-sankar-after-rrr3a3dcb7e-5975-4aeb-8e1d-e26d6c63bec7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ramcharan-is-going-to-work-with-director-sankar-after-rrr3a3dcb7e-5975-4aeb-8e1d-e26d6c63bec7-415x250-IndiaHerald.jpgఆర్ఆర్ఆర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ఏ సినిమాలో నటిస్తాడు..? ఆ సినిమా ఏ స్థాయిలో ఉంటుంది..? ఇలాంటి ప్రశ్నలు ప్రస్తుతం ప్రతి మెగా అభిమాని మనసులో ఉన్నాయి. అయితే ఈ ప్రశ్నలకు సమాధానంగా ఓ వార్త ఇప్పుడు తెగ వైరల్..ram charan;ntr;pawan kalyan;rajamouli;shankar;alluri sitarama raju;rrr movie;cinema;tamil;producer;jersey;director;producer1;nandamuri taraka rama rao;magadheera;dilచరణ్ నెక్స్ట్ సినిమా స్టార్ డైరెక్టర్ తో.. ఈ సారి అన్నింటికీ మించి..చరణ్ నెక్స్ట్ సినిమా స్టార్ డైరెక్టర్ తో.. ఈ సారి అన్నింటికీ మించి..ram charan;ntr;pawan kalyan;rajamouli;shankar;alluri sitarama raju;rrr movie;cinema;tamil;producer;jersey;director;producer1;nandamuri taraka rama rao;magadheera;dilWed, 10 Feb 2021 22:24:25 GMTఆర్ఆర్ఆర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ఏ సినిమాలో నటిస్తాడు..? ఆ సినిమా ఏ స్థాయిలో ఉంటుంది..? ఇలాంటి ప్రశ్నలు ప్రస్తుతం ప్రతి మెగా అభిమాని మనసులో ఉన్నాయి. అయితే ఈ ప్రశ్నలకు సమాధానంగా ఓ వార్త ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్ నెక్స్ట్ మూవీ ఉండబోతోందట. ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కథలతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే రామ్‌చరణ్.. ఇప్పుడు శంకర్ తో సినిమా చేయనున్నాడని వార్త ఇప్పుడు సంచలనంగా మారింది.

జక్కన్న దర్శకత్వంలో మగధీర సినిమాతో స్టార్ హీరోగా మారిపోయాడు రామ్‌చరణ్. ఆ తరువాత వచ్చిన సినిమాలతో కూడా అభిమానులు తనపై పెట్టుకున్న అంచనాలను అందుకున్నాడు. అయితే ప్రస్తుతం జక్కన్నతోనే రెండో సినిమా చేస్తున్న రామ్‌చరణ్.. హిస్టారికల్ క్యారెక్టర్ అల్లూరి సీతారామరాజు పాత్రను పోషిస్తున్నాడు. ఈ పాత్ర కోసం చరణ్ ఎంతో కష్టపడి మరీ కండలు పెంచాడు.

ఈ సినిమాలో చెర్రీతో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటిస్తున్నారు. అయితే ఎన్టీఆర్ తన తరువాతి చిత్రాన్ని త్రివిక్రమ్‌తో లాక్ చేశాడు. చెర్రీ మాత్రం తన తదుపరి చిత్రం విషయంలో ఇప్పటి వరకు ఏ క్లారిటీ ఇవ్వలేదు. దీంతో చెర్రీ నెక్స్ట్ మూవీ విషయంలో అనేక రూమర్లు వచ్చాయి. చెర్రీ తన తదుపరి సినిమా కోసం కొత్త దర్శకులతో చర్చలు జరిపారని, జెర్సీ దర్శకుడితో చేయనున్నాడని, అనేక వార్తలు వినిపించాయి. తాజాగా మరో దర్శకుడి పేరు తెరమీదకొచ్చింది. అది కూడా సాదా సీదా డైరెక్టర్ కాదు. ఏకంగా తమిళ స్టార్ డైరెక్టర్, రోబో వంటి అద్భుత సినిమాను తెరకెక్కించిన శంకర్ ఇప్పుడు చెర్రీతో సినిమా చేయబోతున్నాడట.

చరణ్ తన తరువాతి చిత్రాన్ని శంకర్‌తో ప్లాన్ చేశాడని, ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారిన వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ విషయంలో ఇటీవల చెర్రీ చేసిన పోస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతి త్వరలోనే తన తర్వాతి సినిమా అప్‌డేట్ రానుందని చరణ్ చెప్పడంతో ఇలాంటి వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఇప్పటి వరకు ఈ విషయంలో ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. మరి చెర్రీ ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.




ఉప్పెన బుచ్చి బాబు నెక్స్ట్ ఆ స్టార్ తోనా..?

తెలుగు స్టార్లు అంత సాహసం కూడా చేస్తారా..?

గెలుపోటముల విషయం వదిలేసి మేయర్, డిప్యూటి మేయర్ పీఠం కోసం బిజేపి కూడా పోటీ పడనుంది

మెగాస్టార్ సరసన రకుల్...?

ఉప్పెన హిట్ అవ్వాలంటే ఎంత కలెక్ట్ చేయాలి.. వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాకే భారీ టార్గెట్..!

ఉప్పెన కథ కొట్టేశాడా.. ఎన్.టి.ఆర్ కు ఆ డౌట్ ఎందుకొచ్చింది..!

జగడ్డ : విశాఖ మేయర్ కి పొగ పెట్టనున్న ఉక్కు సెగ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>