PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/brahmins-jagane3bb2f55-3254-41f4-99d4-22f0b906f56a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/brahmins-jagane3bb2f55-3254-41f4-99d4-22f0b906f56a-415x250-IndiaHerald.jpgరాష్ట్రాల్లో బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గానికి రాజ‌కీయాల్లో మంచి గుర్తింపు ఇస్తోంది. టికెట్లు కూడా వీరికి ఎక్కువ‌గా ఇస్తోంది. అంతేకాదు.. వీరికి ప‌ద‌వులు ఇవ్వ‌డంలోనూ కేంద్రంలో మంత్రి వ‌ర్గంలో చోటు క‌ల్పించ‌డంలోనూ బీజేపీ ముందుంది. కానీ.. ఏపీ విష‌యానికి వ‌స్తే.. మేధావులుగా బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గాన్ని వాడుకుంటున్న బీజేపీ.. వారికి రాజ‌కీయంగా టికెట్లు ఇవ్వ‌డంలో మాత్రం ముందుకు రావ‌డం లేదు. కేవ‌లం క్ష‌త్రియ సామాజిక వ‌ర్గానికి ప్రాధాన్యం ఇస్తున్నార‌నే వ్యాఖ్య‌లు త‌ర‌చుగా వినిపిస్తున్నాయి. అదే స‌మ‌యంలో brahmins jagan;bharatiya janata party;andhra pradesh;indiaherald group;rbi;smart phone;marriage;minister;central government;party;youthబ్రాహ్మ‌ణ ఘోష‌: ఆ మూడు రాష్ట్రాల్లో బ్రాహ్మ‌ణులకు రిజ‌ర్వేష‌న్లు... ఏపీలో వాళ్లేం ఖ‌ర్మ చేసుకున్నారు ?బ్రాహ్మ‌ణ ఘోష‌: ఆ మూడు రాష్ట్రాల్లో బ్రాహ్మ‌ణులకు రిజ‌ర్వేష‌న్లు... ఏపీలో వాళ్లేం ఖ‌ర్మ చేసుకున్నారు ?brahmins jagan;bharatiya janata party;andhra pradesh;indiaherald group;rbi;smart phone;marriage;minister;central government;party;youthWed, 10 Feb 2021 08:50:00 GMTపార్టీ ల నాయ‌కులు కూడా ఒప్పుకొనే విష‌య‌మే. ఎన్నిక‌ల స‌మ‌యంలో క‌నీసం వీరికి 5% న్యాయ‌మైనా చేయాల‌నే డిమాండ్లు విని పిస్తున్నాయి. కానీ, ఎన్నిక‌ల అనంత‌రం మాత్రం వీరిని ప‌ట్టించుకుంటున్న‌వారు ఎవ‌రూ క‌నిపించ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో ఒక్క ఈ రాష్ట్రంలోనే ఇలా జ‌రుగుతోందా ? ఇత‌ర రాష్ట్రాల్లోనూ ఇలానే ఉందా? అనే చ‌ర్చ తెర‌మీద‌కి వ‌చ్చింది. దీనికి స‌మాధానం ఒక్క‌టే.. ఒక్క మ‌న రాష్ట్రంలోనే బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గానికి పెద్ద‌గా గుర్తింపు లేకుండా పోయింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఇత‌ర రాష్ట్రాల‌ను ప‌రిశీలిస్తే.. కేంద్రంలో చ‌క్రం తిప్పుతున్న బీజేపీ.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, క‌ర్ణాట‌క‌, రాజ‌స్థాన్‌, ఒడిసా వంటి రాష్ట్రాల్లో బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గానికి రాజ‌కీయాల్లో మంచి గుర్తింపు ఇస్తోంది. టికెట్లు కూడా వీరికి ఎక్కువ‌గా ఇస్తోంది. అంతేకాదు.. వీరికి ప‌ద‌వులు ఇవ్వ‌డంలోనూ కేంద్రంలో మంత్రి వ‌ర్గంలో చోటు క‌ల్పించ‌డంలోనూ బీజేపీ ముందుంది. కానీ.. ఏపీ విష‌యానికి వ‌స్తే.. మేధావులుగా బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గాన్ని వాడుకుంటున్న బీజేపీ.. వారికి రాజ‌కీయంగా టికెట్లు ఇవ్వ‌డంలో మాత్రం ముందుకు రావ‌డం లేదు.

కేవ‌లం క్ష‌త్రియ సామాజిక వ‌ర్గానికి ప్రాధాన్యం ఇస్తున్నార‌నే వ్యాఖ్య‌లు త‌ర‌చుగా వినిపిస్తున్నాయి. అదే స‌మ‌యంలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, ఒడిసా, రాజ‌స్థాన్ రాష్ట్రాల్లో అసెంబ్లీలోనూ బ్రాహ్మ‌ణుల‌కు మంచి కీల‌క పాత్ర ల‌భిస్తోంది. మంత్రి వ‌ర్గంలోనూ వారికి స‌ముచిత స్థానం ల‌భిస్తోంది. బ్రాహ్మ‌‌ణుల‌కు రిజ‌ర్వేష‌న్ క‌ల్పిస్తున్న ఏకైక రాష్ట్రాలుగా రాజ‌స్థాన్‌, ఒడిసా, క‌ర్ణాట‌క‌లు నిలుస్తున్నాయి. ఇక్క‌డ బ్రాహ్మ‌ణుల‌కు టికెట్ల విష‌యంలోను, ఇత‌ర ప‌థ‌కాల‌ను అమ‌లు చేయ‌డంలోను వారికి ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించ‌డంలోను ముందున్నారు.

అంతేకాదు.. ఇటీవ‌ల క‌ర్ణాట‌క‌లో బ్రాహ్మ‌ణ యువ‌త‌ను పెళ్లి చేసుకునే యువ‌తుల‌కు రూ.3 ల‌క్ష‌ల పారితోషికం ప్ర‌క‌టించారు. అదే స‌మ‌యంలో యూపీలో అయితే.. పూజారుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించారు. ప్ర‌దాన ఆల‌యాల్లో ప‌నిచేసే పూజారుల‌కు ప్ర‌భుత్వ ఉద్యోగ భ‌ద్ర‌త‌, వంశ‌పారంప‌ర్య ధ‌ర్మ‌క‌త్రుత్వం వంటివి క‌ల్పించారు. ఈ ప‌రిస్థితి ఏపీలో క‌నిపించ‌క‌పోవ‌డం దారుణం.


బ్రాహ్మ‌ణులారా.. జాగృతం కండి

తెలుగు రాష్ట్రాల్లో బ్రాహ్మ‌ణులారా.. జాగృతం కండి. మీ హ‌క్కులు తెలుసుకోండి..! ఓటు బ్యాంకుగా ఉప‌యోగ‌పడుతున్నారే త‌ప్ప‌... మీ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు ఏ రాజ‌కీయ పార్టీ కూడా ముందుకు రావ‌డం లేద‌నే విష‌యాన్ని గుర్తించండి. ప్ర‌భుత్వాలు మారినా.. మీ స‌మ‌స్య‌లు మాత్రం తీర‌డం లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు స‌మ‌స్య‌లు పెరుగుతున్న నేప‌థ్యంలో వాటిని ప‌రిష్క‌రించేందుకు ఏ ఒక్క‌రూ బాధ్య‌త‌లు తీసుకోవ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో మీ గ‌ళాన్ని వినిపించేందుకు https://www.indiaherald.com/ ముందుకు వ‌చ్చింది. బ్రాహ్మ‌ణుల స‌మ‌స్య‌లను ప్ర‌భుత్వానికి చేర‌వేసేందుకు https://www.indiaherald.com/ ప్ర‌య‌త్నిస్తోంది. దీనిలో మీ భాగ‌స్వామ్య‌మే కీల‌కం. మీ స‌మ‌స్య ఏదైనా.. ప్ర‌భుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు మేం ముందుంటాం.


మీరు చేయాల్సింద‌ల్లా.. ఈ ఫోన్ నెంబ‌రు 8919011959
 కు ఫోన్ చేయ‌డ‌మే. లేదా care@indiaherald.com  ఈ మెయిల్‌కు మీ స‌మ‌స్య‌ను క్లుప్తంగా రాసి ఈమెయిల్ చేయడ‌‌మే..!


విశాఖలో టీడీపీకి ఎందుకింత షాక్...?

షర్మిల వ్యూహకర్తగా పీకే!

ఉప్పెనకు ఊహించని రీతిలో ప్రీ రిలీజ్ బిజినెస్

హెరాల్డ్ సెటైర్ : జగన్, చంద్రబాబు వల్లే ఇదంతా జరిగిందా ?

చిన్నమ్మకు రజనీ ఫోన్.. అదే కారణమా ?

అమరావతికి జగన్ వరాలు.. అసలు మతలబు ఇదేనా..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఎన్నికల్లో శశికళ వ్యూహం ఏమిటో తెలుసా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>