MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/sudhir-babu-thinks-one-thing-and-another-happened451c996f-7f59-4f79-9e48-2b9491ed6c21-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/sudhir-babu-thinks-one-thing-and-another-happened451c996f-7f59-4f79-9e48-2b9491ed6c21-415x250-IndiaHerald.jpgసుధీర్‌ బాబు పాన్‌ ఇండియన్ ఆశలకి బ్రేకులు పడుతున్నాయి. ఈ హీరో ఎప్పుడెప్పుడు నేషనల్‌ మార్కెట్‌లో అడుగుపెడదామా అని ఎగ్జయిట్ అవుతోంటే, ఆ దర్శకుడు మాత్రం వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నాడు. సుధీర్‌ బాబు సినిమాని పక్కనపెట్టి మరో ఇద్దరు హీరోలతో సినిమాలు తీస్తున్నాడు. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్‌ బయోపిక్ వస్తుందని, సుధీర్‌ బాబు టైటిల్‌ రోల్ ప్లే చేస్తాడనే మాటలు చాలారోజుల నుంచి వినిపిస్తున్నాయి.sudhir babu thinks one thing and another happened;gopichand;nagarjuna akkineni;sridevi kapoor;nageshwara rao akkineni;praveen;sudigali sudheer;tiru;pullela gopichand;cinema;hero;indianసుధీర్ బాబు ఒకటి అనుకుంటే మరొకటి జరిగింది..!సుధీర్ బాబు ఒకటి అనుకుంటే మరొకటి జరిగింది..!sudhir babu thinks one thing and another happened;gopichand;nagarjuna akkineni;sridevi kapoor;nageshwara rao akkineni;praveen;sudigali sudheer;tiru;pullela gopichand;cinema;hero;indianWed, 10 Feb 2021 20:00:00 GMTఇండియన్ ఆశలకి బ్రేకులు పడుతున్నాయి. ఈ హీరో ఎప్పుడెప్పుడు నేషనల్‌ మార్కెట్‌లో అడుగుపెడదామా అని ఎగ్జయిట్ అవుతోంటే, ఆ దర్శకుడు మాత్రం వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నాడు. సుధీర్‌ బాబు సినిమాని పక్కనపెట్టి మరో ఇద్దరు హీరోలతో సినిమాలు తీస్తున్నాడు.

ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో బ్యాడ్మింటన్ కోచ్  పుల్లెల గోపీచంద్‌ బయోపిక్ వస్తుందని, సుధీర్‌ బాబు టైటిల్‌ రోల్ ప్లే చేస్తాడనే మాటలు చాలారోజుల నుంచి వినిపిస్తున్నాయి. సుధీర్‌ బాబు కూడా బ్యాడ్మింటన్‌ ప్రాక్టీస్‌ చేస్తోన్న వీడియోస్‌ అప్‌లోడ్ చేసి, జనాల్లో బజ్‌ క్రియేట్ చేశాడు. అయితే ప్రవీణ్ సత్తారు మాత్రం ఈ ప్రాజెక్ట్‌ని పక్కనపెట్టేసి, మరో రెండు సినిమాలు స్టార్ట్ చేస్తున్నాడు.

'గరుడవేగ' తర్వాత మూడేళ్లు గ్యాప్‌ తీసుకున్న ప్రవీణ్‌ సత్తారు ఇప్పుడు రెండు సినిమాలని లైన్‌లో పెట్టాడు.  నాగార్జున, వరుణ్‌తేజ్‌తో సినిమాలు ఓకే చేసుకున్నాడు. ఈ మంథ్‌ ఎండింగ్‌కి నాగార్జున మూవీ సెట్స్‌కి వెళ్తుందని సమాచారం. ఇక అక్కినేని సినిమా కంప్లీట్‌ కాగానే, మెగాప్రిన్స్ వరుణ్‌ తేజ్‌తో సినిమా తీస్తాడట  ప్రవీణ్‌ సత్తారు.

ప్రవీణ్‌ సత్తారు రెండేళ్ల క్రితం అనౌన్స్‌ చేసిన గోపీచంద్‌ బయోపిక్‌ని పక్కనపెట్టి, నాగార్జున, వరుణ్‌తేజ్‌ సినిమాలపై ఫోకస్‌ పెట్టాడు. ఇక సుధీర్‌ బాబు ఈ బ్యాడ్మింటన్‌ కథ నుంచి బయటకొచ్చి 'శ్రీదేవి సోడా సెంటర్' లాంటి సినిమాలకి కమిట్ అవుతున్నాడు. దీంతో ఇండస్ట్రీలో బోల్డన్ని డౌట్స్‌ రైజ్ అవుతున్నాయి. పుల్లెల గోపీచంద్‌ బయోపిక్‌ని టెంపరరీగా పక్కనపెట్టారా.. లేకపోతే పర్మినెంట్‌గా సైడ్‌ చేశారా అని మాట్లాడుకుంటున్నారు.

మొత్తానికి సుధీర్ బాబు పాన్ ఇండియన్ ఆశలకు బ్రేకులుపడ్డాయి.  పుల్లెల గోపీచంద్ బయోపిక్ వాయిదాలతోనే సరిపోతోంది. ఆ బయోపిక్ లో సుధీర్ బాబు టైటిల్ రోల్ పోషిస్తుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.  ప్రవీణ్ సత్తారు డైరెక్షన్‌లో బయోపిక్ రావాల్సి ఉంది. చూద్దాం.. ఈ బయోపిక్ ఎన్ని మలుపులు తిరుగుతుందో.




కేసీఆర్ ఆలోచన మారాల్సిందే... ఎందుకంటే

ఉప్పెన హిట్ అవ్వాలంటే ఎంత కలెక్ట్ చేయాలి.. వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాకే భారీ టార్గెట్..!

ఉప్పెన కథ కొట్టేశాడా.. ఎన్.టి.ఆర్ కు ఆ డౌట్ ఎందుకొచ్చింది..!

జగడ్డ : విశాఖ మేయర్ కి పొగ పెట్టనున్న ఉక్కు సెగ ?

రిలీజ్ అవ్వకుండానే రికార్డు సృష్టించిన ఉప్పెన సినిమా...

నీ చుక్కల గౌనుకి కుర్రాళ్లు క్లీన్ బౌల్డ్.. ఢీ దీపికా క్యూట్ ఫోటో షూట్..!

జబర్దస్త్ బ్యూటీ అనసూయకి స్టార్ డం రాకముందు ఎలాంటి పాత్రల్లో నటించిందో తెలిస్తే ఆశ్చర్య పోతారు..??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>