PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagadda-vijayanagaram-lo-gelupu-kosam-botsa-planb2f1876a-28aa-4064-a918-8debaef2fcf8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagadda-vijayanagaram-lo-gelupu-kosam-botsa-planb2f1876a-28aa-4064-a918-8debaef2fcf8-415x250-IndiaHerald.jpgగత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన స్థానిక (పంచాయతీ) ఎన్నికల్లో భాగంగా మంగళవారం మొదటి విడతగా జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు అఖండ విజయం సాధించారని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక ప్రకటన చేశారు. చంద్రబాబు చెప్పేవి కాకి లెక్కలని, మొదటి విడత ఎన్నికల్లో వైసీపీదే అఖండ విజయం అని అన్నారుbotsa;amala akkineni;assam;andhra pradesh;y. s. rajasekhara reddy;congress;botcha satyanarayana;media;panchayati;chief minister;minister;tdp;reddy;partyచంద్రబాబు చెప్పేవి కాకి లెక్కలు, వైసీపీదే అఖండ విజయం - మంత్రి బొత్సచంద్రబాబు చెప్పేవి కాకి లెక్కలు, వైసీపీదే అఖండ విజయం - మంత్రి బొత్సbotsa;amala akkineni;assam;andhra pradesh;y. s. rajasekhara reddy;congress;botcha satyanarayana;media;panchayati;chief minister;minister;tdp;reddy;partyWed, 10 Feb 2021 23:55:00 GMTగత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన స్థానిక  (పంచాయతీ) ఎన్నికల్లో భాగంగా మంగళవారం మొదటి విడతగా జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు అఖండ విజయం సాధించారని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక ప్రకటన చేశారు. ఎన్నికల ఫలితాలపై రాజకీయ నేతల నుంచి మీడియా వరకు పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తున్న తరుణంలో మంత్రి బొత్స గణాంకాలు వివరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోన్న అభివృద్ధి, సంక్షేమానికి పంచాయతీ మొదటి దశ ఎన్నికల్లో ప్రజలు పట్టం కట్టారని వెల్లడించారు. ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులైన 82 శాతం మంది విజయం సాధించగా, ప్రతిపక్ష తెలుగు దేశం అభ్యర్థులు 15 శాతం, ఇత‌రులు 3 శాతం గెలుచుకున్నారని చెప్పారు.




38.74 శాతం సీట్లు గెలిచానని చెబుతున్న చంద్రబాబు.. ఎక్కడ గెలిచారు, ఏ ఊరులో గెలిచారో కూడా చెబితే బాగుండేదని మంత్రి బొత్స సవాల్ విసిరారు. చంద్రబాబు మాటలు చూస్తుంటే.. ఆయన గెలిచింది ఆంధ్రప్రదేశ్ లో కాదు, అస్సాంలో ఏమైనా ఆ పార్టీలకు వచ్చిన సీట్లను కలుపుకుని గెలిచారేమో అనిపిస్తుందని మంత్రి బొత్స ఎద్దేవా చేశారు. చంద్రబాబు మాదిరిగా పచ్చ అంకెల గారడీ లెక్కలు మేం చెప్పమని మంత్రి బొత్స వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ప‌ట్ల, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయ‌క‌త్వం ప‌ట్ల 80 శాతానికి పైగా ప్రజలు మొగ్గు చూపారన్నది ఈ ఎన్నికలు రుజువు చేస్తున్నాయని తెలిపారు. పంచాయతీ ఎన్నికల మొద‌టి విడ‌త‌లో ఇంత గొప్ప విజ‌యాన్ని చేకూర్చినందుకు రాష్ట్ర ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ప్రత్యేక‌మైన కృత‌జ్ఞత‌లు, అభినందనలు తెలిపారు.



* పంచాయితీ తొలి విడత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న సర్పంచ్ స్థానాలు: 2,637


* తొలి విడతలో మొత్తం 3,244 పంచాయ‌తీల‌కు ఎన్నిక‌లు జ‌రిగితే, ఏక‌గ్రీవాలు కూడా క‌లుపుకుని 2,637 స్థానాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు, టీడీపీ దాని మిత్రపక్షాల మద్దతుదారులు 508, త‌ట‌స్తులు 99 మంది గెలిచారు. ఇండిపెండెంట్లు గెలిచిన 99లో కూడా అత్యధికులు వైసీపీకి చెందిన రెబ‌ల్స్ ఉన్నారు.




బ్రహ్మ జెముడు జ్యూస్ తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసుకోండి...

పుష్ప కొండపై 500 మందితో ఫైట్.. డిఎస్పి సీన్ లీక్ చేసేశాడు బాబోయ్..!

ఉప్పెన మొదటి షెడ్యూల్ అయ్యాక హీరోయిన్ ను మార్చారా..?

మెగా ఫ్యాన్స్ కు బిగ్ న్యూస్.. శంకర్ డైరక్షన్ లో రాం చరణ్ అఫీషియల్..!

విజయ్ సేతుపతిని బెదిరించి ఉప్పెనకు ఒప్పించారా..?

తెలుగు స్టార్లు అంత సాహసం కూడా చేస్తారా..?

గెలుపోటముల విషయం వదిలేసి మేయర్, డిప్యూటి మేయర్ పీఠం కోసం బిజేపి కూడా పోటీ పడనుంది




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>