PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/nimmagadda-wins-over-jagan-in-first-phase-elections26ae3ff8-f380-4660-9c4c-5b815f61db77-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/nimmagadda-wins-over-jagan-in-first-phase-elections26ae3ff8-f380-4660-9c4c-5b815f61db77-415x250-IndiaHerald.jpg"ఎన్నికలు వద్దు, కరోనా భయం ఉంది, ప్రజలు ఓటింగ్ కి దూరంగా ఉంటారు, అధికారులెవరూ విధులకు హాజరయ్యే పరిస్థితి లేదు, దయచేసి ఎన్నికలు వాయిదా వేయండి." ఇదీ ఇంతకాలం ప్రభుత్వం చేసిన వాదన, చివరకు సుప్రీంకోర్టు తీర్పుతో ఎట్టకేలకు ఎన్నికల ప్రక్రియసు సహకరించేందుకు ముందుకొచ్చింది. మరోవైపు నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రం ఎన్నికలు జరిపి తీరాల్సిందేనంటూ పట్టుబడ్డారు. jagan-nimmagadda-elections;kumaar;jagan;district;panchayatiజగడ్డ: జగన్ పై నిమ్మగడ్డ పైచేయి సాధించినట్టే..జగడ్డ: జగన్ పై నిమ్మగడ్డ పైచేయి సాధించినట్టే..jagan-nimmagadda-elections;kumaar;jagan;district;panchayatiWed, 10 Feb 2021 08:00:00 GMTకుమార్ మాత్రం ఎన్నికలు జరిపి తీరాల్సిందేనంటూ పట్టుబడ్డారు.

తొలి విడత ఎన్నికల సరళిని చూస్తే జగన్ పై నిమ్మగడ్డ పైచేయి సాధించినట్టు స్పష్టంగా తెలుస్తోంది. తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో భారీగా 81.42% పోలింగ్ నమోదైంది. కరోనా భయాన్ని పక్కన పెట్టి పోలింగు కేంద్రాలకు ఓటర్లు తరలివచ్చారు. విజయనగరం మినహా మిగతా 12 జిల్లాల్లో 2,723 సర్పంచి, 20,157 వార్డు సభ్యుల స్థానాలకు 29,732 కేంద్రాల్లో ఉదయం 6.30 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. ఓటర్లు ఉదయాన్నుంచే పోలింగ్ కేంద్రాలముందు బారులు తీరారు. మొదటి రెండు గంటలు కాస్త మందకొడిగా ఓటింగ్ ప్రక్రియ సాగినా.. క్రమంగా జోరందుకుంది. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2.30 వరకు 75.55% మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. పోలింగు ముగిసే సమయానికి కృష్ణాజిల్లాలో గరిష్ఠంగా 85.06%, శ్రీకాకుళం జిల్లాలో కనిష్ఠంగా 75.77% పోలింగు నమోదైంది.

పోలింగ్ సరళినిబట్టి చూస్తే ప్రజలెక్కడా కరోనాకి భయపడినట్టు తేలలేదు. అటు అధికారులు కూడా కరోనా భయాలను పక్కనపెట్టి తమ విధులు నిర్వర్తించారు. మొత్తమ్మీద ఎన్నికలు వాయిదా వేయాలంటూ ప్రభుత్వం చేసిన వాదనలో పసలేదని తేలిపోయింది. పరోక్షంగా ఈ విషయంలో జగన్ పై నిమ్మగడ్డ పైచేయి సాధించినట్టు తేలిపోయింది. కరోనా సోకిన దాదాపు వెయ్యిమంది ఓటుహక్కు వినియోగించుకున్నారని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 3.30 గంటల మధ్య వీరికి ప్రత్యేక సమయం కేటాయించి ఓట్లు వేయించారు.

తొలి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ పై ఎస్‌ఈసీ రమేష్ కుమార్ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలు ఎంతో ఉత్సాహంగా పోలింగులో పాల్గొని ఓటు హక్కును వినియోగించుకున్నారని, ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని చెప్పారు. గత ఎన్నికలతో పోల్చిచూస్తే కొన్ని ఘటనలు మినహా పోలింగు ప్రశాంతంగా జరిగిందని ఆయన వివరించారు. కలెక్టర్లు, జిల్లా ఎన్నికల యంత్రాంగం, ఎస్పీలు, పోలింగు సిబ్బందిని ఆయన అభినందించారు. ఇది శుభారంభమని, మిగతా మూడు దశల ఎన్నికలు కూడా ఇలాగే ప్రశాంత వాతావరణంలో జరగాలని ఆకాంక్షించారు. 


చక్కగా క్యాష్ చేసుకుంటున్న రేవంత్

ఉప్పెనకు ఊహించని రీతిలో ప్రీ రిలీజ్ బిజినెస్

హెరాల్డ్ సెటైర్ : జగన్, చంద్రబాబు వల్లే ఇదంతా జరిగిందా ?

చిన్నమ్మకు రజనీ ఫోన్.. అదే కారణమా ?

అమరావతికి జగన్ వరాలు.. అసలు మతలబు ఇదేనా..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఎన్నికల్లో శశికళ వ్యూహం ఏమిటో తెలుసా ?

"వకీల్ సాబ్ "ను ప్రమోట్ చేస్తున్న రాజకీయ నేతలు ..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>