PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-bandi-sanjay849ce8e5-551c-40fe-aced-c0bf7e8f06c8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-bandi-sanjay849ce8e5-551c-40fe-aced-c0bf7e8f06c8-415x250-IndiaHerald.jpgబండి సంజయ్.. మాటలతోనే మంటలు పుట్టిస్తున్న నాయకుడు.. ఇటీవల కాలంలో తెలుగు నేలపై ఈ స్థాయిలో ఎవరూ మాటలతో మంటలు పుట్టించ లేదు. చూడటానికి మనిషి సాత్వికంగా కనిపించినా.. నోరు తెరిచాడంటే డైనమెట్లు పేలాల్సిందే.. బండి సంజయ్.. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా వినిపిస్తున్న పేరు.. ఆయన తెలంగాణ బీజేపీ పగ్గాలు చేపట్టిన తర్వాతే ఆపార్టీకి మంచి జోష్ వచ్చింది. దుబ్బాక ఎన్నికలు గెలిచారు.. జీహెచ్‌ఎంసీలో టీఆర్‌ఎస్‌కు వణుకు పుట్టించారు. ఇప్పుడు అదే జోష్ అటు ఖమ్మం, వరంగల్ మున్సిపల్, నాగార్జునసాగర్ ఎన్నికల్లోనూ కంkcr-bandi-sanjay;kcr;amala akkineni;bharatiya janata party;warangal;telangana;huzur nagar;police;mandalam;chief minister;survey;josh;petta;party;devarakondaబండి సంజయ్‌ అడిగుతున్న ఈ ప్రశ్నలకు.. కేసీఆర్ దగ్గర సమాధానం ఉందా..?బండి సంజయ్‌ అడిగుతున్న ఈ ప్రశ్నలకు.. కేసీఆర్ దగ్గర సమాధానం ఉందా..?kcr-bandi-sanjay;kcr;amala akkineni;bharatiya janata party;warangal;telangana;huzur nagar;police;mandalam;chief minister;survey;josh;petta;party;devarakondaWed, 10 Feb 2021 05:00:00 GMTతెలంగాణ బీజేపీ పగ్గాలు చేపట్టిన తర్వాతే  ఆపార్టీకి మంచి జోష్ వచ్చింది. దుబ్బాక ఎన్నికలు గెలిచారు.. జీహెచ్‌ఎంసీలో టీఆర్‌ఎస్‌కు వణుకు పుట్టించారు. ఇప్పుడు అదే జోష్ అటు ఖమ్మం, వరంగల్ మున్సిపల్, నాగార్జునసాగర్ ఎన్నికల్లోనూ కంటిన్యూ చేయాలని ప్రయత్నిస్తున్నారు.

అందుకే.. ముఖ్యమంత్రి కేసీఆర్  నాగార్జునసాగర్ పర్యటనకు వెళ్తున్న సందర్భంగా ఆయన కొన్ని అంశాలపై స్పష్టత కోరారు. గిరిజనులు, లంబాడీలు ఎక్కువ సంఖ్యలో ఉన్న నాగార్జునసాగర్ పర్యటనకు ముందు తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల హక్కులను కాలరాస్తున్న కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హరితహారం ప్రాజెక్టులో గిరిజనులు సాగు చేసుకుంటున్న అసైన్డ్ భూముల్లో మొక్కలు నాటే పేరుతో నిర్వాసితులను చేసి ప్రశ్నించిన వారిని పోలీసులతో లాఠీచార్జ్ చేయించడం, కేసులు పెట్టి జైళ్లో పెట్టడం... జరుగుతున్న విషయం వాస్తవం కాదా..? ముఖ్యమంత్రి గారు స్పష్టం చేయాలని ప్రశ్నించారు.

నాగార్జునసాగర్ పక్కనే ఉన్న దేవరకొండ నియోజకవర్గంలోని చందంపేట మండలంలో గిరిజన భూములను హరితహారం పేరుమీద గుంజుకున్న విషయాన్ని గుర్తుచేస్తున్నానన్న సంజయ్..హుజూర్ నగర్ నియోజకవర్గంలో 6వేల ఎకరాల ప్రభుత్వ భూమిని నాగార్జునసాగర్ ముంపునకు గురైన రైతులకు కేటాయిస్తే ఆ భూములను అధికార పార్టీ నాయకులు కబ్జా చేసి అక్రమ డాక్యుమెంట్లు తయారుచేసి గిరిజనుల నుంచి గుంజుకున్న విషయం వాస్తవం కాదా..? అని నిలదీశారు.

తెలంగాణ హైకోర్టు కూడా దీన్ని ధృవీకరిస్తూ ఈ భూమి గిరిజనులకు అసైన్డ్ భూమిగా గుర్తించి తీర్పునిచ్చినా .. ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని విషయం వాస్తవం కాదా..? అని బండి సంజయ్ ప్రశ్నించారు. 6,200 ఎకరాల ఫారెస్ట్ భూములను ఇప్పటివరకు సర్వే చేయకుండా అడ్డుకున్న ప్రభుత్వ అధికారులపైన, రెవెన్యూ యంత్రాంగంపైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 


హెరాల్డ్ ఎడిటోరియల్ : ఎన్నికల్లో శశికళ వ్యూహం ఏమిటో తెలుసా ?

సర్కారు వారి పాట నుండి సూపర్ స్టార్ లుక్.. అరుపులు కేకలే..!

మూడు నెలల్లోనే మెగా మేనల్లుడి పెళ్లి.. అంతా సీక్రెట్ నడిపిస్తున్నారా..?

దివి పాప క్యాబ్ స్టోరీస్.. ప్రోమోనే పిచ్చెక్కించేసిందిగా..!

పుష్ప అల్లు అర్జున్ ఎంట్రీ సీన్.. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనేట్టుగా..!

జూనియర్ సత్యదేవ్ ని చూసారా..? భార్య కొడుకు ని పరిచయం చేసిన హీరో సత్య దేవ్

జగడ్డ : కడపలో ఫ్యాన్ స్పీడ్ కు సైకిల్ గల్లంతు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>