Movieskurapati Dileep Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgటాలీవుడ్ నూతన దర్శకుడు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన తన ఫస్ట్ సినిమాతోనే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాడు. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరి దర్శకత్వంలో పాఠాలు నేర్చుకొని తాజాగా ఉప్పెన అనే లవ్ స్టోరీని తెరకెక్కించాడు. ఈ నెల 12న ఉప్పెన సినిమా థియేటర్లలో విడుదల కాబోతుంది. ప్రస్తుతం ఉప్పెన ప్రమోషన్స్ భారీగానే జరుగుతున్నాయి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ బుచ్చిబాబు పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు.ఉప్పెన సినిమాకు వైష్ణవ్ తేజ్ ఫస్ట్ ఛాయస్.. అంటారా? నిజానికి కథ పూర్తయ్యాక హీరో గురిబుచ్చి బాబు;ntr;kumaar;sukumar;tara;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;india;spain;indiaherald group;tollywood;cinema;love;interview;director;hero;mythri movie makers;nandamuri taraka rama rao;vaishnav tej;love story;chitramబుచ్చిబాబు : నెక్స్ట్ మూవీ స్టార్ హీరో తో చేస్తున్న....!!!బుచ్చిబాబు : నెక్స్ట్ మూవీ స్టార్ హీరో తో చేస్తున్న....!!!బుచ్చి బాబు;ntr;kumaar;sukumar;tara;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;india;spain;indiaherald group;tollywood;cinema;love;interview;director;hero;mythri movie makers;nandamuri taraka rama rao;vaishnav tej;love story;chitramWed, 10 Feb 2021 23:01:32 GMTబుచ్చిబాబు :  నెక్స్ట్ మూవీ స్టార్ హీరో తో  చేస్తున్నా ....!!!

ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..

టాలీవుడ్ నూతన దర్శకుడు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన తన ఫస్ట్ సినిమాతోనే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాడు. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరి దర్శకత్వంలో పాఠాలు నేర్చుకొని తాజాగా ఉప్పెన అనే లవ్ స్టోరీని తెరకెక్కించాడు. ఈ నెల 12న ఉప్పెన సినిమా థియేటర్లలో విడుదల కాబోతుంది. ప్రస్తుతం ఉప్పెన ప్రమోషన్స్ భారీగానే జరుగుతున్నాయి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ బుచ్చిబాబు పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు.ఉప్పెన సినిమాకు వైష్ణవ్ తేజ్ ఫస్ట్ ఛాయస్.. అంటారా?
నిజానికి కథ పూర్తయ్యాక హీరో గురించి వెతుకుతున్నాను. నేను ఎంబీఏ గ్రాడ్యుయేట్ కదా.. నా మార్కెటింగ్ నైపుణ్యాలను ఇక్కడ ఉపయోగించాను.కథకు మంచి బడ్జెట్ కావాలి. అందుకే ఫిల్మ్ బ్యాగ్రౌండ్ ఉన్న వైష్ణవ్ తేజ్ ని ఎంచుకున్నాను. హీరోకు ఫిల్మ్ బ్యాగ్రౌండ్ ఉన్నప్పుడు అవసరమైన బడ్జెట్ పెట్టడానికి నిర్మాతలు కాదనరు.

అసలు ఉప్పెన కథకు ప్రేరణ ఏమిటి?
గ్రామీణ నేపథ్యంలో ఉండే కథలు నాకు చాలా ఇష్టం. నేను నా ఇల్లు గ్రామం మండలం అలాగే జిల్లాస్థాయిలో కథల కోసం వెతుకుతున్నాను. సుకుమార్ సార్తో కలిసి పనిచేస్తున్నప్పుడు కొన్ని వెరైటీ కథలు రాసుకున్నాను. అయితే రంగస్థలం సమయంలో సుకుమార్ కథ విన్నారు.

కాలేజీలో మీ మ్యాథ్స్ లెక్చరర్ గా ఉన్నప్పుడు సుకుమార్ డైరెక్టర్ అవుతారని మీకు తెలుసా?
సుకుమార్ సార్ తన సినిమా దర్శకత్వం పట్ల ఉన్న ఇష్టం గురించి స్టూడెంట్స్ లో కొద్దిమందికి మాత్రమే చెప్పేవాడు. అందులో నేను ఒకడిని. అలా సుక్కు సార్ నాకు కథలు చెప్పేవాడు. ఒక్కోసారి మేమిద్దరం కలిసి సినిమాలకు వెళ్లేవాళ్ళం.

ఉప్పెన క్లైమాక్స్ గురించి భారీ చర్చ జరుగుతోంది. దాని గురించి ఏమైనా చెబుతారా?
ఉప్పెన అనేది గ్రామీణ నేపథ్యంలో విభిన్నమైన లవ్ స్టోరీ. మీరు సినిమా సెకండ్ హాఫ్ లో రెగ్యులర్ కథలకు డిఫరెంట్ ఏంటో చూస్తారు. ఎమోషనల్ కూడా అవుతారు.

మొత్తంగా సినిమా అవుట్ ఫుట్ గురించి సంతృప్తిగానే ఉన్నారా?
చాలా సంతృప్తిగా ఉంది. దాదాపు వందమంది వరకు ఉప్పెనను చూసేసారు. ప్రతి ఒక్కరి నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.మీకు బాగా ఇష్టమైన ఎన్టీఆర్ కు ఈ స్టోరీ వినిపించారా?
నాన్నకు ప్రేమతో సమయంలో మేము స్పెయిన్ లో ఉన్నప్పుడు నేను ఎన్టీఆర్ గారికి వేరే కథ చెప్పాను.

మీ తదుపరి చిత్రం ఏమిటి?
నా తదుపరి చిత్రంలో పెద్ద హీరోతో ఉండబోతుంది. ఆ సినిమాకు మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తారు

ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి. 




మంత్రులే మొత్తం నాశనం చేసారా...?

పుష్ప కొండపై 500 మందితో ఫైట్.. డిఎస్పి సీన్ లీక్ చేసేశాడు బాబోయ్..!

ఉప్పెన మొదటి షెడ్యూల్ అయ్యాక హీరోయిన్ ను మార్చారా..?

మెగా ఫ్యాన్స్ కు బిగ్ న్యూస్.. శంకర్ డైరక్షన్ లో రాం చరణ్ అఫీషియల్..!

విజయ్ సేతుపతిని బెదిరించి ఉప్పెనకు ఒప్పించారా..?

తెలుగు స్టార్లు అంత సాహసం కూడా చేస్తారా..?

గెలుపోటముల విషయం వదిలేసి మేయర్, డిప్యూటి మేయర్ పీఠం కోసం బిజేపి కూడా పోటీ పడనుంది




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kurapati Dileep Kumar]]>