MoviesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kajal-agarwaal2d0dcd21-5e5a-435f-a17d-ff739e06f522-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kajal-agarwaal2d0dcd21-5e5a-435f-a17d-ff739e06f522-415x250-IndiaHerald.jpgనటి కాజల్ అగర్వాల్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లో దశాబ్దకాలంగా హీరోయిన్ గా దూసుకుపోతోన్న విషయం తెలిసిందే. ఈ మధ్య కాలంలో తరచూ వార్తల్లో ఉంటూనే, ఎప్పటికప్పుడు ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రేక్షకులతోపాటు,అభిమానులకు కూడా టచ్ లో ఉంటూ వస్తోంది. ఇటీవల ముంబైకి చెందిన ఇంటీరియర్ డిజైనర్ గౌతమ్ కిచ్లు ని పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఒక ఇంటీరియర్ బిజినెస్ కూడా స్టార్ట్ చేశారు. kajal agarwaal;business;gautham new;gautham;kajal aggarwal;madhura sridhar reddy;tollywood;media;marriage;february;instagram;heroine;postersదానిని ఎప్పుడూ నా వెంట ఉంచుకుంటా : కాజల్దానిని ఎప్పుడూ నా వెంట ఉంచుకుంటా : కాజల్kajal agarwaal;business;gautham new;gautham;kajal aggarwal;madhura sridhar reddy;tollywood;media;marriage;february;instagram;heroine;postersWed, 10 Feb 2021 12:04:38 GMTనటి కాజల్ అగర్వాల్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లో దశాబ్దకాలంగా హీరోయిన్ గా దూసుకుపోతోన్న విషయం తెలిసిందే. ఈ మధ్య కాలంలో తరచూ వార్తల్లో ఉంటూనే, ఎప్పటికప్పుడు ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రేక్షకులతోపాటు,అభిమానులకు కూడా టచ్ లో ఉంటూ వస్తోంది. ఇటీవల ముంబైకి చెందిన ఇంటీరియర్ డిజైనర్ గౌతమ్ కిచ్లు ని పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఒక ఇంటీరియర్ బిజినెస్ కూడా స్టార్ట్ చేశారు.

అంతేకాక వీరిద్దరూ హనీమూన్ కి వెళ్లి, అక్కడ సందర్శించిన ప్రదేశాలు అన్నింటిని, వారు గడిపిన మధుర క్షణాలను  అభిమానుల కోసం సోషల్ మీడియా ద్వారా  కాజల్  పంచుకోగా , అవి కొద్ది రోజుల పాటు బాగా వైరల్ కూడా అయ్యాయి. అయితే  ఈ మధ్యకాలంలో  కాజల్ సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ బాగా వైరల్ అవుతోంది . ఆ పోస్టులో తన వ్యక్తిగత చిన్నప్పటి విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది. అది ఏమిటంటే ఇక ఆ పోస్టర్ కి సంబంధించి కాజల్ మాట్లాడుతూ  "నాకు ఐదు ఏళ్ల వయసు ఉన్నప్పుడు, బ్రాంకియల్ ఆస్తమా ఉందని తెలిసింది . ఇక  ఆ వయసులో ఆహారం విషయంలో నా తల్లిదండ్రులు ఆంక్షలు విధించిన సంగతి ఇంకా నాకు గుర్తు ఉంది. అంత చిన్న వయసులోనే నాకు ఆస్తమా రావడం చాలా బాధకు గురి చేసింది  " అని చెప్పింది.

ఇక  చిన్న వయసులోనే, ఆస్తమాతో తను పడిన ఇబ్బందులను అభిమానులతో పంచుకుంది . ప్రస్తుతం కూడా శీతాకాలం వచ్చిందంటే చాలు ఆస్తమా లక్షణాలు కనబడడం అలాగే దుమ్ము,ధూళి లో కి వెళ్ళినప్పుడు కూడా ఈ లక్షణాలు ఎదురవడం  కారణం గా మరింత ఎక్కువ ఇబ్బంది పడేది అంట. అందుకే ఇన్హేలర్ వాడడం వల్ల కొంత ఉపశమనం కలుగుతుందని ఆమె చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ప్రైవేట్ గా అయినా, పబ్లిక్ గా అయినా ఇన్హేలర్ ఉపయోగించడంలో  సిగ్గు పడాల్సిన అవసరం లేదని కాజల్ చెప్పుకొచ్చింది.


చాలామంది ఇన్హేలర్ లను వాడాలి అనుకుంటున్నప్పటికీ సమాజంలో ఎవరు ఏమనుకుంటారో అన్న భయంతో పబ్లిక్ గా వాడలేకపోతున్నారు. ఈ పరిస్థితి మారాలి ఈ విషయం అందరికీ అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేయాలని # say yes to in healer # అని తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఇదిలా ఉండగా కాజల్ వెబ్ సిరీస్ లో "లైవ్ టెలికాస్ట్"  పేరిట ఒక దెయ్యం పాత్రలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఫిబ్రవరి 12న ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ కానుంది. అంతే కాకుండా కాజల్ ప్రస్తుతం ఆచార్య సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.




గులాబి తోట కథ చెబుతా అంటున్న అఖిల్.. అక్కినేని హీరో మనసుని గుచ్చే గులాబి ఎవరు..?

కథను కనులకు చూపించేదే నాట్యం.. టీజర్ మాత్రం మాములుగా లేదు..!

తమ్ముడి కొడుకు మీద దిల్ రాజు భారీ పెట్టుబడి

మళ్ళి రిస్క్ తీసుకుంటున్న రవితేజ..!?

బిగ్ బాస్ 5 కి డేట్ టైం ఫిక్స్...?

ఆ సింగర్ పాడితే మిలియన్ వ్యూస్ రావాల్సిందే.. సిద్ శ్రీరాం ఒక్కపాటకి ఎంత డిమాండ్ చేస్తున్నాడంటే..!

బీజేపీ పెద్ద‌ల‌తో జ‌న‌సేన భేటీ.. సోముపై సంచ‌ల‌న ఫిర్యాదులు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>