MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/actress-hema-sensational-comments-on-tollywood-directorsf430704c-5fc5-4ba8-9542-aa97c57b543d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/actress-hema-sensational-comments-on-tollywood-directorsf430704c-5fc5-4ba8-9542-aa97c57b543d-415x250-IndiaHerald.jpgప్రముఖ యాంకర్ ప్రదీప్ మాచిరాజు నటించిన '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టింది. దీంతో తాజాగా చిత్రబృందం మూవీ సక్సెస్ మీట్ ని నిర్వహించింది. ఈ సక్సెస్ మీట్ లో హీరో హీరోయిన్లతో పాటు ప్రముఖ నటీనటులు, దర్శకనిర్మాతలు పాల్గొన్నారు. ఈ చిత్రంలో ప్రదీప్ తల్లి పాత్రలో ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ నటించారు. hema;kumaar;annapurna;hema;munna producer;nirmalamma;pradeep;puri jagannadh;sukumar;cinema;director;hero;success;chitramతెలుగు దర్శకులు నాకు అన్యాయం చేస్తున్నారు: నటి హేమ..తెలుగు దర్శకులు నాకు అన్యాయం చేస్తున్నారు: నటి హేమ..hema;kumaar;annapurna;hema;munna producer;nirmalamma;pradeep;puri jagannadh;sukumar;cinema;director;hero;success;chitramWed, 10 Feb 2021 16:00:00 GMTప్రదీప్ మాచిరాజు నటించిన '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టింది. దీంతో తాజాగా చిత్రబృందం మూవీ సక్సెస్ మీట్ ని నిర్వహించింది. ఈ సక్సెస్ మీట్ లో హీరో హీరోయిన్లతో పాటు ప్రముఖ నటీనటులు, దర్శకనిర్మాతలు పాల్గొన్నారు. ఈ చిత్రంలో ప్రదీప్ తల్లి పాత్రలో ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ నటించారు. కొడుకుని అమితంగా ప్రేమించే తల్లి పాత్రలో నటించినందుకు గాను ఆమెకు నూటికి నూరు శాతం మార్కులు పడ్డాయి. అయితే సక్సెస్ మీట్ సందర్భంగా హేమ ఈ సినిమాలోని తన పాత్ర గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు.

తాను ఎంతో కాలం నుంచి ఓ తల్లి పాత్ర కోసం ఎదురు చూస్తున్నానని.. ప్రదీప్ సినిమాతో తన కోరిక తీరిపోయిందని ఆమె అన్నారు. తల్లి పాత్ర కోసం తాను పూరి జగన్నాథ్ తో కూడా గొడవ పడ్డానని చెప్పి షాక్ కి గురి చేశారు. తాను సుకుమార్ తో ఎంతో గొడవపడితేనే కుమారి 21ఎఫ్ లో మదర్ రోల్ ఇచ్చారని ఆమె గుర్తుకు తెచ్చుకున్నారు. ఇక ఆ తర్వాత ఏ దర్శకుడు కూడా తనకు తల్లి పాత్ర ఇవ్వలేదని ఆమె ఒకింత బాధను వ్యక్తం చేశారు. తెలుగు దర్శకులంతా తనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారనే అర్ధం వచ్చేలాగా ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

డైరెక్టర్ మున్నా తనకు మదర్ రోల్ ఇచ్చినందుకు ఆమె ధన్యవాదాలు తెలుపుకున్నారు. ప్రదీప్ తో కూడా తనకు మంచి అనుబంధం ఉందని.. తాను తల్లి పాత్ర చేస్తుంటే అతను ఎటువంటి అభ్యంతరం చెప్పలేదని ఆమె అన్నారు. ప్రదీప్ ని తానెప్పుడూ సొంత తమ్ముడు లాగా భావిస్తానని ఆమె ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అయితే హేమ కంటతడి పెట్టుకొని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి. స్టార్ హీరోల తల్లి పాత్రల్లో నటించి ఒక అన్నపూర్ణ, ఒక నిర్మలమ్మ లాగా ఆమె చిత్ర పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకోవాలని కుతూహల పడుతున్నట్టు తెలుస్తోంది కానీ ఏ స్టార్ డైరెక్టర్ కూడా ఆమెకు అవకాశాలు ఇవ్వడం లేదు.


బిగ్ బ్రేకింగ్ న్యూస్ : మహేష్ బాబు తో రాజమౌళి మూవీ స్టోరీ ఫిక్స్ ....నెట్టింట న్యూస్ వైరల్ ....??

హీరోయిన్ దీక్షా సేత్ మీకు గుర్తుందా.. ఆమె ఇప్పుడు పెద్ద స్టార్ ప్రొడ్యూసర్ అట.

జగడ్డ : టీడీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం.. మరో పక్క హై టెన్షన్ ?

జగడ్డ: గిరా గిరా తిరిగింది ఫ్యాను...చంద్రబాబు సైకిల్ ఏమో గాన్...!

టిక్ టాక్ స్టార్ దుర్గా రావు...బిగ్ బాస్ ఎంట్రీ...?

హమ్మ ..చమ్మక్ చంద్ర..ఇన్ని కోట్ల ఆస్తి ఎలా కూడబెట్టడబ్బా..?

అక్కినేని హీరోను పెట్టి సినిమా తీస్తున్న వంటలక్క..ఫాన్స్ కి క్రేజీ న్యూస్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>