WomenMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/lady-line-men05c50011-e4c8-4f79-b3f3-41f2cb7e829a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/lady-line-men05c50011-e4c8-4f79-b3f3-41f2cb7e829a-415x250-IndiaHerald.jpgవిద్యుత్ శాఖలో లైన్ మెన్ ఉద్యోగమంటే అంత సులభం కాదు. కరెంటు స్థంభాలు ఎక్కడం.. అక్కడ ఏ సమస్య ఉందో తెలుసుకుని పరిష్కరించడం వంటివి చకచకా చేసుకుపోవాలి. అందుకే ఈ ఉద్యోగానికి అబ్బాయిలనే ఎంచుకుంటారు. ఇంత కష్టమైన ఉద్యోగానికి అమ్మాయిలను తీసుకోరు. మరి అలాంటి ఉద్యోగాన్ని ఓ 20 ఏళ్ల యువతి సాధించింది.lady line men;sekhar;vidya;district;high court;electricity;job;interview;governor;siddipetఆడపిల్లవు నీకెందుకు అన్నారు.. కానీ పట్టు బట్టి సాధించి నిరూపించుకుందిఆడపిల్లవు నీకెందుకు అన్నారు.. కానీ పట్టు బట్టి సాధించి నిరూపించుకుందిlady line men;sekhar;vidya;district;high court;electricity;job;interview;governor;siddipetWed, 10 Feb 2021 10:03:17 GMTవిద్యుత్ శాఖలో లైన్ మెన్ ఉద్యోగమంటే అంత సులభం కాదు. కరెంటు స్థంభాలు  ఎక్కడం.. అక్కడ ఏ సమస్య ఉందో తెలుసుకుని పరిష్కరించడం వంటివి చకచకా చేసుకుపోవాలి. అందుకే ఈ ఉద్యోగానికి  అబ్బాయిలనే ఎంచుకుంటారు. ఇంత కష్టమైన ఉద్యోగానికి అమ్మాయిలను తీసుకోరు. మరి అలాంటి ఉద్యోగాన్ని ఓ 20 ఏళ్ల యువతి సాధించింది. ఇందుకోసం అష్ట కష్టాలు పడింది. కోర్టు మెట్లెక్కింది. నువ్వు ఈ ఉద్యోగానికి పనికిరావు అన్న చాలా మందికి గట్టిగా సమాధానం చెప్పింది.

సిద్దిపేట జిల్లా గజ్వేల్ కి చెందిన శిరీష ఈ ఘనత సాధించింది. అసలు లైన్ ఉమెన్ జాబ్ కి అప్లై చేయడమే గ్రేట్  అంటే.. ఇది సాధించడం మరో ఎత్తు. శిరీష లైన్ ఉమెన్ జాబ్ కి ధైర్యంగా పరీక్ష రాసింది. ప్రాక్టికల్స్ లోనూ విజయం సాధించింది. ఇదంతా తన మామయ్య ప్రోత్సాహంతోనే జరిగింది.

టీఎస్ఎస్పీడీసీఎల్ లో శిరీష మామయ్య శేఖర్ సబ్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. అతను ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఐటీఐ పూర్తి చేసింది. విద్యుత్ శాఖలో ఉద్యోగాలు పడగానే అప్లై చేసింది. అందులో విజయం సాధించింది. ఇక మిగిలింది స్తంభాలు ఎక్కే ప్రాక్టికల్ ఎగ్జామ్ ను అధిగమించడమే. కానీ ఇంటర్వ్యూలో ఇది మగవాళ్లు చేసే ఉద్యోగంటూ నిరాశపరిచారు.

దీంతో శిరీష హైకోర్టును ఆశ్రయించింది. ఈ ఉద్యోగానికి తనకు అన్ని అర్హతలు ఉన్నాయని తెలిపింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. ప్రాక్టికల్ టెస్టులో పాసయితే.. ఉద్యోగం ఇవ్వాలని విద్యుత్ శాఖకు ఆదేశించింది. శిరీష సులభంగా స్థంభాలు ఎక్కి ఆ పరీక్షలోనూ నెగ్గింది. చివరకు ఉద్యోగం సాధించింది. తనకు చేతకాదని తిరస్కరించిన వాళ్లందరూ ముక్కున వేలేసుకునేలా చేసింది.

ఇదంతా శిరీష అతి తక్కువ కాలంలోనే సాధించింది. రెండు నెలల్లో పోల్స్ ఎక్కడం దిగడం నేర్చుకుంది. అమ్మాయిలకు ఆదర్శంగా నిలిచింది. అంతేకాదు శిరీష ను తెలుగు రాష్ట్రాల ప్రజలు పొగడ్తలతో ముంచెత్తారు. సీఎం, గవర్నర్ ఇలా ఒకరేంటి అందరూ శిరీష సాధించిన ఈ విజయానికి  తెగ సంబరపడిపోతున్నారు.


బీజేపీ పెద్ద‌ల‌తో జ‌న‌సేన భేటీ.. సోముపై సంచ‌ల‌న ఫిర్యాదులు..!

ఎడిటోరియల్: నానా యాగి చేసి ఏపి ఎన్నికల కమీషన్ సాధించేమిటి?

ష‌ర్మిల కొత్త ఛానెల్‌.. ఏర్పాట్ల‌లో బిజీబిజీ..!

గుంటూరు పంచాయ‌తీల్లో వైసీపీ ఎమ్మెల్యేల‌కు షాకులు

జగడ్డ: నెల్లూరు జిల్లాలో నోటా రికార్డు..?

బ్రాహ్మ‌ణ ఘోష‌: ఆ మూడు రాష్ట్రాల్లో బ్రాహ్మ‌ణులకు రిజ‌ర్వేష‌న్లు... ఏపీలో వాళ్లేం ఖ‌ర్మ చేసుకున్నారు ?

షర్మిల వ్యూహకర్తగా పీకే!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>