MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ravi-teja9aa71729-674c-4241-a1be-1466bafb1ca4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ravi-teja9aa71729-674c-4241-a1be-1466bafb1ca4-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో మాస్ మహారాజ్ రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. రాజాదిగ్రేట్ సినిమా తరువాత వచ్చిన సినిమాలు అన్ని ప్లాప్ లో నిలిచాయి. క్రాక్ సినిమా మంచి విజయం సాధించడంతో రవితేజ మళ్ళి బరిలోకి వచ్చారు. ఇక సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా 50 శాతం ఆక్యుపెన్సీతోనే 38 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ravi teja;ravi;gopichand;ram gopal varma;boyapati srinu;harish shankar;raja;ramesh varma;ravi teja;shankar;srinu vytla;cinema;gabbar singh;bobby;mass;krackమళ్ళి రిస్క్ తీసుకుంటున్న రవితేజ..!?మళ్ళి రిస్క్ తీసుకుంటున్న రవితేజ..!?ravi teja;ravi;gopichand;ram gopal varma;boyapati srinu;harish shankar;raja;ramesh varma;ravi teja;shankar;srinu vytla;cinema;gabbar singh;bobby;mass;krackWed, 10 Feb 2021 11:00:00 GMTమాస్ మహారాజ్ రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. రాజాదిగ్రేట్ సినిమా తరువాత వచ్చిన సినిమాలు అన్ని ప్లాప్ లో నిలిచాయి. క్రాక్ సినిమా మంచి విజయం సాధించడంతో రవితేజ మళ్ళి బరిలోకి వచ్చారు. ఇక సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా 50 శాతం ఆక్యుపెన్సీతోనే 38 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది.

ఇక ప్రస్తుతం రవితేజ ఖిలాడి సినిమాలో నటిస్తున్నాడు. రమేష్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. మే 28న సినిమా విడుదల కానుంది. ఇదిలా ఉంటే ఖిలాడి తర్వాత మాస్ రాజా ఓ కొత్త దర్శకుడితో సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది. కెరీర్‌లో చాలా మంది కొత్త వాళ్లకు ఛాన్సులు ఇచ్చాడు రవితేజ. ఆయన చేతుల మీదుగానే శ్రీను వైట్ల, గోపీచంద్ మలినేని, బాబీ, హరీష్ శంకర్, బోయపాటి శ్రీను లాంటి దర్శకులు పరిచయం అయ్యారు.

ఇప్పుడు వాళ్లంతా స్టార్ డైరెక్టర్స్ అయిపోయారు. ఇక తాజాగా గులాబీ శ్రీను అనే దర్శకుడిని పరిచయం చేయబోతున్నాడు రవితేజ. ఈయన చెప్పిన కథ నచ్చడంతో మాస్ రాజా ఓకే చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. కాటమ రాయుడు, సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసాడు గులాబీ శ్రీను. అలాగే క్రాక్ సినిమాకు కూడా గోపీచంద్ మలినేని దగ్గర అసిస్టెంట్‌గా చేసాడు ఈయన.

ఇక ఏడాది కిందే మాస్ రాజాకు కథ చెప్పడం.. గతేడాది నుంచి రవితేజ కూడా కథలో కొన్ని మార్పులు చేర్పులు చెప్పడం అన్నీ జరుగుతున్నాయి. ఈ మధ్యే దర్శకుడు ఫైనల్ నెరేషన్ ఇవ్వడంతో రవితేజ కూడా ఖిలాడి తర్వాత ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నాడు. ఏదేమైనా కూడా క్రాక్ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఇప్పుడు కొత్త దర్శకుడితో సినిమా అంటే కాస్త రిస్క్‌తో కూడుకున్న పనే.




తమ్ముడి కొడుకు మీద దిల్ రాజు భారీ పెట్టుబడి

ఆ సింగర్ పాడితే మిలియన్ వ్యూస్ రావాల్సిందే.. సిద్ శ్రీరాం ఒక్కపాటకి ఎంత డిమాండ్ చేస్తున్నాడంటే..!

బీజేపీ పెద్ద‌ల‌తో జ‌న‌సేన భేటీ.. సోముపై సంచ‌ల‌న ఫిర్యాదులు..!

ఎడిటోరియల్: నానా యాగి చేసి ఏపి ఎన్నికల కమీషన్ సాధించేమిటి?

ష‌ర్మిల కొత్త ఛానెల్‌.. ఏర్పాట్ల‌లో బిజీబిజీ..!

గుంటూరు పంచాయ‌తీల్లో వైసీపీ ఎమ్మెల్యేల‌కు షాకులు

జగడ్డ: నెల్లూరు జిల్లాలో నోటా రికార్డు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>