PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-amaravtic9fe9455-b893-4aec-b1a7-006a7a950b82-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-amaravtic9fe9455-b893-4aec-b1a7-006a7a950b82-415x250-IndiaHerald.jpgజీతాలు పెంచాలని రోడ్డెక్కిన ఏపీ వాలంటీర్లకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న ఒక లేఖ రాశారు. వాలంటీర్లను అందరినీ ఉద్దేశిస్తూ ఆయన ఒక బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో ఉన్న అంశాలు గతంలో ఆయన చెప్పిన మాటలకు భిన్నంగా ఉన్నాయని వాలంటీర్లు చెబుతున్నారు. వాలంటీర్లకు జగన్మోహన్ రెడ్డి రాసిన బహిరంగ లేఖలో చాలా స్పష్టంగా మీవి ఉద్యోగాలు కాదు మీరు కేవలం స్వచ్ఛంద సేవకులు మాత్రమే అని తేల్చి చెప్పారు. అంతేకాక మీకు ఇస్తుంది జీతం కూడా కాదని గౌరవవేతనం మాత్రమే ఇస్తున్నామని ఆయన లేఖలో పేర్కొన్నారు. అంతే కాjagan elections;jagan;andhra pradesh;chief minister;interview;letter;ycp;reddyజగడ్డ : వాలంటీర్లకి షాకిచ్చిన జగనోరు..ఇక వారివ్వడమే బాకీ !జగడ్డ : వాలంటీర్లకి షాకిచ్చిన జగనోరు..ఇక వారివ్వడమే బాకీ !jagan elections;jagan;andhra pradesh;chief minister;interview;letter;ycp;reddyWed, 10 Feb 2021 12:00:00 GMTజీతాలు పెంచాలని రోడ్డెక్కిన ఏపీ వాలంటీర్లకు  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న ఒక లేఖ రాశారు. వాలంటీర్లను అందరినీ ఉద్దేశిస్తూ ఆయన ఒక బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో ఉన్న అంశాలు గతంలో ఆయన చెప్పిన మాటలకు భిన్నంగా ఉన్నాయని వాలంటీర్లు చెబుతున్నారు. వాలంటీర్లకు జగన్మోహన్ రెడ్డి రాసిన బహిరంగ లేఖలో చాలా స్పష్టంగా మీవి ఉద్యోగాలు కాదు మీరు కేవలం స్వచ్ఛంద సేవకులు మాత్రమే అని తేల్చి చెప్పారు. అంతేకాక మీకు ఇస్తుంది జీతం కూడా కాదని గౌరవవేతనం మాత్రమే ఇస్తున్నామని ఆయన లేఖలో పేర్కొన్నారు. అంతే కాక ప్రతి రోజూ పని చేయాల్సిన అవసరం లేదని మీకు ఉన్న ఖాళీ సమయంలో ఆ సమయాన్ని  ప్రజలకు ఉపయోగపడేలా ఇలా ఒక వ్యవస్థ రూపొందించామని ఆయన లేఖలో చెప్పుకొచ్చారు. 

కానీ వైయస్ జగన్ ఏ ఇంటర్వ్యూలో చూసినా తాము అధికారంలోకి రాగానే నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని ఈ వాలంటీర్ల గురించి పరోక్షంగా చెబుతూ ఉండేవారు. ఇప్పుడు వారు జీతాలు పెంచమని అడిగే సమయానికి అసలు మీవి జీతాలే కాదు మీరు ఉద్యోగులే కాదనే విధంగా మాట మార్చేసి మడం తిప్పేశారు. వాలంటీర్లకు ముందే హ్యాండ్ బుక్ ఇచ్చామని అందులోనే మీది ఉద్యోగం కాదు మీరు స్వచ్ఛంద సేవకులు మాత్రమేనని చెప్పామని అందుకు వారు కూడా ఒప్పుకున్నారని జగన్ లేఖలో ప్రస్తావించారు. అంతేకాక వీరు ఎక్కడ అవినీతికి పాల్పడకుండా ఈ ఐదు వేలు కూడా గౌరవ బృతిగా ఇస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. 

అంతే కాక వాలంటీర్లకు 5000 మాత్రమే ఇస్తూ దాన్ని సమర్థించుకోవడానికి జగన్ వాలంటీర్లు చేసే పని వారానికి మూడు రోజులు అది కూడా వారికి వీలున్న సమయంలో అందుబాటులో ఉన్నాము అని చెప్పడానికి వస్తున్నారని ఇంకేమీ పనులు చేసే అవకాశం లేదని కూడా చెప్పుకొచ్చారు. కానీ వాలంటీర్ల వాదన మాత్రం వేరేలా ఉంది ప్రతి విషయానికి అధికారులు వాలంటీర్ల మీదే ఆధారపడుతున్నారు. పెన్షన్ల పంపిణీ మొదలు పధకాల దాకా అన్నీ వారే చేస్తున్నారు. ఈ పనులు కాక వైకాపా పనులు అదనం. ఈ లెక్కన ఆ సాధారణ ఉద్యోగుల లాగే ఉదయం ఎప్పుడు బయటికి వస్తే తిరిగి రాత్రికి గాని ఇంటికి వెళ్ళ లేని పరిస్థితి. ఒక రకంగా అందుకేనేమో వాలంటీర్లు అందరూ తమకు జీతం పెంచాలని ముందు నుంచి అడుగుతూ వస్తున్నారు. 

వారికి గతంలోనే 8000 చేస్తున్నామని మీడియాకి లీకులు ఇచ్చిన ప్రభుత్వం ఎందుకు మళ్ళీ ఆలోచన విరమించుకుంది..ఇప్పుడు ఏకంగా ఐదు వేలు ఇవ్వడం ఎక్కువ అన్నట్లుగా జగన్ లేఖ రాయడంతో వాలంటీర్లకు షాక్ తగిలినట్లయింది. ఒక రకంగా ఇప్పటికీ తమకు వాలంటీర్లు ప్లస్ అని భావిస్తున్న వైసిపి వర్గాలు ఇప్పుడు టెన్షన్ పడుతున్నాయి. జగన్ ఇచ్చిన షాక్ తో ఈ ఎన్నికల సమయం లో వాలంటీర్ల తమకు వ్యతిరేకంగా పని చేస్తే తమ పరిస్థితి ఏమిటని వైసిపి వర్గాలు మాత్రం భయ పడుతున్నాయి. ఇంకా మూడు విడతల ఎన్నికలు ఉండడంతో వారిలో టెన్షన్ నెలకొంది. చూడాలి మరి ఏమవుతుందో ?




గులాబి తోట కథ చెబుతా అంటున్న అఖిల్.. అక్కినేని హీరో మనసుని గుచ్చే గులాబి ఎవరు..?

కథను కనులకు చూపించేదే నాట్యం.. టీజర్ మాత్రం మాములుగా లేదు..!

తమ్ముడి కొడుకు మీద దిల్ రాజు భారీ పెట్టుబడి

మళ్ళి రిస్క్ తీసుకుంటున్న రవితేజ..!?

బిగ్ బాస్ 5 కి డేట్ టైం ఫిక్స్...?

ఆ సింగర్ పాడితే మిలియన్ వ్యూస్ రావాల్సిందే.. సిద్ శ్రీరాం ఒక్కపాటకి ఎంత డిమాండ్ చేస్తున్నాడంటే..!

బీజేపీ పెద్ద‌ల‌తో జ‌న‌సేన భేటీ.. సోముపై సంచ‌ల‌న ఫిర్యాదులు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>