SportsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-newsd84d9cc0-700c-4df4-a307-4a3fd3f1a06e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-newsd84d9cc0-700c-4df4-a307-4a3fd3f1a06e-415x250-IndiaHerald.jpgచెపాక్ స్టేడియంలో పర్యాటక జట్టు ఇంగ్లాండ్.. భారత్ గట్టి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ టెస్టులో టీమిండియా భారీ వ్యత్యాసం తో ఓటమి పాలు కావడం వల్ల జట్టు స్థానం పై తీవ్ర ప్రభావం చూపింది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ పట్టికలో ఇప్పటిదాకా అగ్రస్థానంలో ఉన్న కోహ్లీసేన తాజా పరాజయంతో ఏకంగా నాలుగో స్థానానికి పడిపోయింది. ఇక, ఈ విజయంతో ఇంగ్లండ్‌ ఏకంగా టాప్‌లోకి దూసుకెళ్లింది. టెస్టు చాంపియన్‌ షిప్ లో భాగంగా ఆరో సిరీస్‌ ఆడుతున్న ఇంగ్లండ్‌.. ఇప్పటిదాకా 11 విజయాలు, 4 ఓటములు, 3 డ్రాలతో కలిపి మొత్తం 70.2 శాతం పాయsports news;virat kohli;india;australia;england;qualification;chepaukనాలుగో స్థానానికి పడిపోయిన భారత్.. అగ్రస్థానం లోకి ఇంగ్లాండ్..!!నాలుగో స్థానానికి పడిపోయిన భారత్.. అగ్రస్థానం లోకి ఇంగ్లాండ్..!!sports news;virat kohli;india;australia;england;qualification;chepaukWed, 10 Feb 2021 08:00:00 GMTచెపాక్ స్టేడియంలో పర్యాటక జట్టు ఇంగ్లాండ్.. భారత్ గట్టి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ టెస్టులో టీమిండియా భారీ వ్యత్యాసం తో ఓటమి పాలు కావడం వల్ల జట్టు స్థానం పై తీవ్ర ప్రభావం చూపింది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ పట్టికలో ఇప్పటిదాకా అగ్రస్థానంలో ఉన్న కోహ్లీసేన తాజా పరాజయంతో ఏకంగా నాలుగో స్థానానికి పడిపోయింది. ఇక, ఈ విజయంతో ఇంగ్లండ్‌ ఏకంగా టాప్‌లోకి దూసుకెళ్లింది. టెస్టు చాంపియన్‌ షిప్ లో భాగంగా ఆరో సిరీస్‌ ఆడుతున్న ఇంగ్లండ్‌.. ఇప్పటిదాకా 11 విజయాలు, 4 ఓటములు, 3 డ్రాలతో కలిపి మొత్తం 70.2 శాతం పాయింట్లతో  అగ్రస్థానంలో నిలిచింది.

మరోవైపు ఇంగ్లండ్‌లాగే ఆరో సిరీస్‌ ఆడుతున్న భారత్‌.. 9 విజయాలు, 4 ఓటములు, ఓ డ్రాతో మొత్తంగా 68.3 శాతం పాయింట్లతో నాలుగో స్థానానికి పడిపోయింది. రెండు, మూడు స్థానాల్లో వరుసగా న్యూజిలాండ్‌ (70.0), ఆస్ట్రేలియా ఉన్నాయి. కాగా, దక్షిణాఫ్రికాతో సిరీ్‌సను ఆస్ట్రేలియా రద్దు చేసుకోవడంతో ఇప్పటికే తమ ఖాతాలోని అన్ని సిరీస్ లు ఆడేసిన కివీస్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ లో ఇప్పటికే ఫైనల్ చేరుకున్న సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో మరో మ్యాచ్‌ కోల్పోయినా.. మిగతా అన్ని మ్యాచ్‌లు డ్రాగా ముగిసినా లేదా సిరీస్‌ను డ్రాగా ముగించినా కోహ్లీసేన ఫైనల్‌కు దూరమవుతుంది.

సిరీస్‌ను 2-1 లేదా 3-1తో సొంతం చేసుకుంటేనే ఫైనల్‌ బెర్తు కోహ్లీ సేనకు ఖరారవుతుంది. ఇంగ్లాండ్ తొలి మ్యాచ్‌లో గెలిచి ఛాంపియన్‌షిప్‌ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం చేరినప్పటికీ ఇంగ్లాండ్‌ జట్టు ఫైనల్స్ కు అర్హత పొందడం తేలికేం కాదు. భారత్‌తో నాలుగు టెస్టుల సిరీస్‌ను 3-1 లేదా 3-0 లేదా 4-0తో సొంతం చేసుకుంటేనే ఇంగ్లాండ్‌ ఫైనల్‌ చేరుతుంది. ఇక భారత్-ఇంగ్లాండ్ మధ్య రెండవ టెస్ట్ 13వ తేదీ నుండి ప్రారంభం కానుంది. మరి కీలకంగా మారిన రెండవ టెస్టులో ఇరుజట్లు ఎలాంటి ఫలితాన్ని రాబడతాయో  చూడాలి.




ప్రజల్లో కనుమరుగైన వైసీపీ నేతలు... ఇదే కొంప ముంచుతుంది...?

ఉప్పెనకు ఊహించని రీతిలో ప్రీ రిలీజ్ బిజినెస్

హెరాల్డ్ సెటైర్ : జగన్, చంద్రబాబు వల్లే ఇదంతా జరిగిందా ?

చిన్నమ్మకు రజనీ ఫోన్.. అదే కారణమా ?

అమరావతికి జగన్ వరాలు.. అసలు మతలబు ఇదేనా..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఎన్నికల్లో శశికళ వ్యూహం ఏమిటో తెలుసా ?

"వకీల్ సాబ్ "ను ప్రమోట్ చేస్తున్న రాజకీయ నేతలు ..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>