Historykalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/history/123/sandadi-chestunna-manchu-gudlaguba21bd0893-c471-420e-b5df-5cf9044d95b2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/history/123/sandadi-chestunna-manchu-gudlaguba21bd0893-c471-420e-b5df-5cf9044d95b2-415x250-IndiaHerald.jpgసాధారణంగా కొన్ని రకాల జాతికి చెందిన పక్షులు జంతువులు అరుదుగా కనిపిస్తుంటాయి. కాలక్రమేణా కొన్ని అంతరించిపోవడం వల్ల ప్రస్తుతం ఎన్నో రకాల జాతికి చెందిన జీవులు అంతమైపోయాయి. ప్రస్తుతం అలాంటి అంతరించిపోయే దశలో ఉన్నటువంటి ఓ మంచు గుడ్లగూబ తాజాగా అమెరికాలో కనిపించి సందడి చేసింది. ఈ గుడ్లగూబను చూడటానికి పెద్ద ఎత్తున పర్యటకులు క్యూ కడుతున్నారు.అంతేకాకుండా ఈ గుడ్లగూబతో ఫోటోలు దిగి సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. gudlaguba;media;twitter;newyorkసందడి చేస్తున్న మంచు గుడ్లగూబ..!సందడి చేస్తున్న మంచు గుడ్లగూబ..!gudlaguba;media;twitter;newyorkWed, 10 Feb 2021 08:00:00 GMTమీడియా ద్వారా షేర్ చేయడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.                  

దాదాపు 130 సంవత్సరాల క్రితం అమెరికాలో సందడి చేస్తున్న మంచు గుడ్లగూబ తిరిగి ఇప్పుడు న్యూయార్క్ సిటీలోని సెంట్రల్ జూ పార్కులో కనిపించడంతో ఎంతో మంది పక్షి ప్రేమికులు ఈ గుడ్లగూబను చూడటానికి పార్కు చేరుకుంటున్నారు. అయితే 1890 సంవత్సరం లో మంచి గుడ్లగూబలు ఎక్కువగా సందడి చేసేవి. కాలక్రమేణా వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడం వల్ల ఈ గుడ్లగూబలు అంతరించిపోతున్నాయని నేచురల్ హిస్టరీ మ్యూజియం పక్షి శాస్త్ర విభాగం కలెక్షన్ మేనేజర్ పాల్ స్వీట్ తెలిపారు

ఈ మంచు గుడ్లగూబలు ఎక్కువగా టండ్రాల్లో కనిపిస్తుంటాయి. కేవలం శీతాకాలంలో మాత్రమే దక్షిణ దిశగా ప్రయాణిస్తాయని పాల్ స్వీట్ తెలిపారు. ఈ పక్షిని చూడటానికి అధిక సంఖ్యలో పర్యాటకులు రావడంతో గుడ్లగూబ ఆందోళనకు గురి అవుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అయితే ఈ పక్షికి సంబంధించిన వీడియోను మన్హటన్ బర్డ్ అలర్ట్ అనే ట్విట్టర్ ఖాతా నుంచి పోస్ట్ చేయడంతో పాటు,''సెంట్రల్ పార్కు నార్త్ మెడో ప్రాంతంలో మంచు గుడ్లగూబ కనిపించింది". ఈ పక్షిని చూడటానికి పెద్ద ఎత్తున పర్యాటకులు ఇక్కడికి వస్తున్నారని కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ పక్షికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి అందరినీ ఆకట్టుకుంది.


చక్కగా క్యాష్ చేసుకుంటున్న రేవంత్

ఉప్పెనకు ఊహించని రీతిలో ప్రీ రిలీజ్ బిజినెస్

హెరాల్డ్ సెటైర్ : జగన్, చంద్రబాబు వల్లే ఇదంతా జరిగిందా ?

చిన్నమ్మకు రజనీ ఫోన్.. అదే కారణమా ?

అమరావతికి జగన్ వరాలు.. అసలు మతలబు ఇదేనా..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఎన్నికల్లో శశికళ వ్యూహం ఏమిటో తెలుసా ?

"వకీల్ సాబ్ "ను ప్రమోట్ చేస్తున్న రాజకీయ నేతలు ..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>