PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/lokeshb5bfc021-b884-4e8c-aebf-cf6728787d89-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/lokeshb5bfc021-b884-4e8c-aebf-cf6728787d89-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవలే ముగిసిన తొలివిడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు‌లో జోష్ తెచ్చినట్లు తెలుస్తోంది.‘కదలిరండి తెలుగు దేశం కార్యకర్తలారా’ డీజే సాంగ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ పాటలో టీడీపీ కార్యకర్తలు పూనకాలు వచ్చినట్లు ఎంజాయ్ చేస్తున్నారు. పంచాయతీ తొలి దశ ఎన్నికల్లో సాధించిన విజయం.. కార్యకర్తల పోరాట ఫలితమని నారా లోకేష్ అన్నారు. పార్టీకి ఇంతటి విజయాన్ని సాధించిపెట్టిన కార్యకర్తలకు, యోధులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా అని అన్నారు nara lokesh;cbn;lokesh;editor mohan;telugu desam party;jagan;nara lokesh;andhra pradesh;y. s. rajasekhara reddy;congress;telugu;police;media;panchayati;chief minister;twitter;air;tdp;local language;ycp;lokesh kanagaraj;duvvada jagannadham;sv mohan reddy;reddy;josh;partyజగన్ ఇంట్లోంచి పుట్టిన వైసీపీకి, జనం గుండెల్లోంచి పుట్టిన టీడీపీకి పోలికా ? - నారా లోకేష్జగన్ ఇంట్లోంచి పుట్టిన వైసీపీకి, జనం గుండెల్లోంచి పుట్టిన టీడీపీకి పోలికా ? - నారా లోకేష్nara lokesh;cbn;lokesh;editor mohan;telugu desam party;jagan;nara lokesh;andhra pradesh;y. s. rajasekhara reddy;congress;telugu;police;media;panchayati;chief minister;twitter;air;tdp;local language;ycp;lokesh kanagaraj;duvvada jagannadham;sv mohan reddy;reddy;josh;partyWed, 10 Feb 2021 23:10:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవలే ముగిసిన తొలివిడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు‌లో జోష్ తెచ్చినట్లు తెలుస్తోంది. ఓవైపు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 82 శాతం సీట్లు తమ పార్టీకే వచ్చాయంటే, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మాత్రం తమకు 38 శాతం సీట్లు వచ్చాయని ప్రకటించారు. మరోవైపు చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ అయితే ఏకంగా సంబరాలు షురూ చేశారు. ‘కదలిరండి తెలుగు దేశం కార్యకర్తలారా’ డీజే సాంగ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ పాటలో టీడీపీ కార్యకర్తలు పూనకాలు వచ్చినట్లు ఎంజాయ్ చేస్తున్నారు. పంచాయతీ తొలి దశ ఎన్నికల్లో సాధించిన విజయం.. కార్యకర్తల పోరాట ఫలితమని నారా లోకేష్ అన్నారు. పార్టీకి ఇంతటి విజయాన్ని సాధించిపెట్టిన కార్యకర్తలకు, యోధులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు బుధవారం ఆయన ట్వీట్ చేశారు.

‘‘స్వేచ్ఛగా ఎన్నిక‌లు జ‌రిగితే జ‌నం వ్యతిరేక‌త బ‌య‌ట‌ ప‌డుతుంద‌ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగ‌ వ్యవ‌స్థల‌పై దాడికి కూడా తెగ‌బ‌డ్డారు. న్యాయ‌స్థానాల చొర‌వ‌తో స్థానిక ఎన్నిక‌లు జ‌రిగాయి. ఇక్కడా అధికార‌ యంత్రాంగం‌, పోలీసుల్ని వాడుకుని వైసీపీ వాళ్లు హ‌త్యలు చేశారు, కిడ్నాప్‌ల‌కు పాల్పడ్డారు, నామినేష‌న్ ప‌త్రాలు చించేశారు, ఆస్తులు త‌గుల‌బెట్టారు, ప్రలోభాల‌తో ఏక‌గ్రీవాలు చేసుకున్నారు. ఇన్ని చేసినా ఎదురొడ్డి నిలిచి గెలిచిన తెలుగుదేశం యోధుల‌కు శిర‌సువంచి న‌మ‌స్కరిస్తున్నాను. గాలి హామీలిచ్చి అధికారంలోకొచ్చిన ఫేక్ పార్టీకి ఒక్క చాన్స్ చివ‌రి చాన్స్ అని ప్రజ‌లు స్థానిక ఎన్నిక‌ల ద్వారా తీర్పునిచ్చారు. వైఎస్ జ‌గ‌న్‌ మోహన్ రెడ్డి ఇంట్లో పుట్టిన వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీకి, జ‌నం గుండెల్లోంచి పుట్టిన తెలుగుదేశం పార్టీతో పోలికా?’’ అంటూ లోకేష్ తన సోషల్ మీడియా అకౌంట్ ట్విట్టర్ లో కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.



" style="height: 569px;">




బ్రహ్మ జెముడు జ్యూస్ తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసుకోండి...

పుష్ప కొండపై 500 మందితో ఫైట్.. డిఎస్పి సీన్ లీక్ చేసేశాడు బాబోయ్..!

ఉప్పెన మొదటి షెడ్యూల్ అయ్యాక హీరోయిన్ ను మార్చారా..?

మెగా ఫ్యాన్స్ కు బిగ్ న్యూస్.. శంకర్ డైరక్షన్ లో రాం చరణ్ అఫీషియల్..!

విజయ్ సేతుపతిని బెదిరించి ఉప్పెనకు ఒప్పించారా..?

తెలుగు స్టార్లు అంత సాహసం కూడా చేస్తారా..?

గెలుపోటముల విషయం వదిలేసి మేయర్, డిప్యూటి మేయర్ పీఠం కోసం బిజేపి కూడా పోటీ పడనుంది




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>