PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sharmila67aebe17-f7d6-4734-bf55-a4c86cae9458-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sharmila67aebe17-f7d6-4734-bf55-a4c86cae9458-415x250-IndiaHerald.jpgతెలంగాణలో షర్మిల పార్టీ అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌ గా మారింది. అనూహ్యంగా తెలంగాణ రాజకీయ తెరపైకి వచ్చి షర్మిల పార్టీ ఏం సాధించబోతోందన్నది ఇప్పుడు ఇంట్రస్టింగ్ టాపిక్. అసలు దీనికి దారి తీసిన పరిస్థితులేంటి.. ఆమె ఎలాంటి ప్రభావం చూపిస్తోంది.. అసలు ఆమె ఎందుకు పార్టీ పెడుతున్నారు.. ఇంతకీ షర్మిల తెలంగాణలో సత్తా చాటుతారా.. షర్మిల పార్టీ వెనుక ఎవరు ఉన్నారు.. ఇలాంటి ప్రశ్నలన్నీ ఇప్పుడు తలెత్తుతున్నాయి. sharmila;jagan;telangana;congress;telugu;media;television;sakshi;partyసత్తా చాటాలంటే.. షర్మిల అర్జంట్‌ చేయాల్సిన పని ఇదే..?సత్తా చాటాలంటే.. షర్మిల అర్జంట్‌ చేయాల్సిన పని ఇదే..?sharmila;jagan;telangana;congress;telugu;media;television;sakshi;partyWed, 10 Feb 2021 08:11:57 GMTపార్టీ అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌ గా మారింది. అనూహ్యంగా  తెలంగాణ రాజకీయ తెరపైకి వచ్చి షర్మిల పార్టీ ఏం సాధించబోతోందన్నది ఇప్పుడు ఇంట్రస్టింగ్ టాపిక్. అసలు  దీనికి దారి తీసిన పరిస్థితులేంటి.. ఆమె ఎలాంటి ప్రభావం చూపిస్తోంది.. అసలు ఆమె ఎందుకు పార్టీ పెడుతున్నారు..  ఇంతకీ షర్మిల తెలంగాణలో సత్తా చాటుతారా.. షర్మిల పార్టీ వెనుక ఎవరు ఉన్నారు.. ఇలాంటి ప్రశ్నలన్నీ ఇప్పుడు తలెత్తుతున్నాయి.

ఇవన్నీ అలా ఉంచితే.. తెలంగాణలో సత్తా చాటాలంటే అర్జంట్‌గా షర్మిల చేయాల్సిన పని ఒకటి ఉంది. అదేమిటంటే.. ఓ ఛానల్‌, ఓ పత్రిక పెట్టడం.. అవును.. ఎందుకంటే  ఆమె వాయిస్‌ను వినిపించే బలమైన మీడియా ఉండాలి. వైఎస్ మరణించన తర్వాత పదేళ్ల తర్వాత కూడా జగన్ అధికారంలోకి రాగలిగాడటంటే.. అందుకు దారి తీసిన అనేక కారణాల్లో మీడియా ఒకటి.. సాక్షి టీవీ, పత్రిక లేకపోతే.. జగన్ విజయం అంత సులభం అయ్యేది కాదు.. అసలు సాధ్యమయ్యేది కూడా కాదు.

చేతిలో మీడియా ఉంటే ఎన్నికల్లో గెలిచేస్తారా అంటే చెప్పలేం.. కానీ.. చేతిలో మీడియా ఉంటే గెలుపు అవకాశాలు చాలావరకూ మెరుగవుతాయి. గతంలో కాంగ్రెస్ పార్టీ ఇదే తప్పు చేసింది. తమకంటూ ఓ మీడియా లేకుండా పోయింది. ఇక తెలుగుదేశం పార్టీకి చేతిలో సొంత మీడియా లేకపోయినా.. ప్రధాన మీడియా అంతా తనవైపే ఉండేలా చంద్రబాబు మేనేజ్‌ చేసుకున్నారు. కొన్నాళ్లు స్టూడియో ఎన్‌ చానల్‌ను కూడా నడిపింది ఆ పార్టీ.

అందుకే తెలంగాణలో సత్తా చాటాలంటే ముందు షర్మిల ఓ మీడియాను ఏర్పాటు చేసుకోవాలి. దాని ద్వారా ఆమె భావజాలం జనంలోకి తీసుకెళ్లే అవకాశం లభిస్తుంది. ఓ పత్రిక, ఓ ఛానల్, ఓ సోషల్ మీడియా సెల్‌.. ఈ హంగులు ఇప్పుడు రాజకీయ పార్టీలకు నిత్యావసరాలుగా మారాయి. మరి షర్మిల కూడా సొంత పత్రిక, ఛానల్ పెట్టుకుంటారా లేదా.. చూడాలి.




జగడ్డ: శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్న ఇంట గెలిచి రచ్చ ఓడారా..?

ఉప్పెనకు ఊహించని రీతిలో ప్రీ రిలీజ్ బిజినెస్

హెరాల్డ్ సెటైర్ : జగన్, చంద్రబాబు వల్లే ఇదంతా జరిగిందా ?

చిన్నమ్మకు రజనీ ఫోన్.. అదే కారణమా ?

అమరావతికి జగన్ వరాలు.. అసలు మతలబు ఇదేనా..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఎన్నికల్లో శశికళ వ్యూహం ఏమిటో తెలుసా ?

"వకీల్ సాబ్ "ను ప్రమోట్ చేస్తున్న రాజకీయ నేతలు ..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>