PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/sivalayam54b41a51-01ea-4903-97ac-b3840848fc4e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/sivalayam54b41a51-01ea-4903-97ac-b3840848fc4e-415x250-IndiaHerald.jpgతాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతంలో 10వ శతాబ్దానికి చెందిన ఒక పురాతన శివాలయం బయటపడింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే... కడప జిల్లాలో జమ్మలమడుగు మండలం సుగుమంచిపల్లెలో ఈ పురాతన శివాలయం బయటపడింది. ఇక ఆలయంతో పాటూ అరుదైన శిలాశాసనాలను కూడా తవ్వకాల్లో గుర్తించారు. ఇసుకలో కూరుకుపోయిన రాతి స్తంభం కూడా ఉందిsivalayam;krishna;andhra pradesh;kadapa;rayalaseema;mandalam;king;sanskrit;local language;central governmentతవ్వకాల్లో బయటపడ్డ పదవ శతాబ్దం నాటి పురాతన శివాలయంతవ్వకాల్లో బయటపడ్డ పదవ శతాబ్దం నాటి పురాతన శివాలయంsivalayam;krishna;andhra pradesh;kadapa;rayalaseema;mandalam;king;sanskrit;local language;central governmentWed, 10 Feb 2021 13:35:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతంలో 10వ శతాబ్దానికి చెందిన ఒక పురాతన శివాలయం బయటపడింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే... కడప జిల్లాలో జమ్మలమడుగు మండలం సుగుమంచిపల్లెలో ఈ పురాతన శివాలయం బయటపడింది.  ఇక ఆలయంతో పాటూ అరుదైన శిలాశాసనాలను కూడా తవ్వకాల్లో గుర్తించారు. ఇసుకలో కూరుకుపోయిన రాతి స్తంభం కూడా ఉంది. ప్రొద్దుటూరు మండలం పెద్దశెట్టిపల్లెకు చెందిన పరిశోధకుడు పురుషోత్తం తన స్నేహితులతో కలిసి ఈ తవ్వకాలు జరిపారు. ఆలయంతో పాటు అందులోని శిలాశాసనం, విగ్రహాలు, ధ్వజస్తంభాన్ని గుర్తించారు. ఆలయ శిథిలాల మధ్యన ఇసుకలో కూరుకుపోయిన ఈ శాసనంపై దేవతామూర్తుల బొమ్మలు, మూడు వైపులా సంస్కృతం, కన్నడభాషకు సంబంధించి లిపి ఉంది. ఇవి రాష్ట్ర కూట రాజులకు సంబంధించి పదో శతాబ్దం నాటివి అయి ఉండొచ్చని కేంద్ర పురావస్తుశాఖ అధికారులు అంటున్నారు.



పూర్వం ఈ గ్రామాన్ని సుకుమంచిపల్లెగా పిలిచినట్లు శాసనం ద్వారా తెలుస్తోంది. ఈ తవ్వకాల్లో ఇసుక తిన్నెల్లో కూరుకుపోయిన పెద్ద రాతిస్తంభాన్ని స్థానికుల సాయంతో వెలికితీశారు.. ఆ వివరాలను కేంద్ర పురావస్తుశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రకూట రాజు మూడో కృష్ణుడు ఈ శాసనాన్ని వేయించి ఉంటారని పురావస్తు శాఖ అధికారులు చెబుతున్నారు. జమ్మలమడుగు మండలంలో దానవులపాడు, పెద్దదండ్లూరు, చిన్నదండ్లూరు, సిరిగేపల్లె తదితర ప్రాంతాల్లో చారిత్రక ఆనవాళ్లు ఉన్నాయని జాగ్రత్తగా పరిశీలిస్తే మరిన్ని పురాతన శాసనాలు బయటపడే అవకాశం ఉందని భావిస్తున్నారు పురావస్తు శాఖ అధికారులు. ఇటీవలి తవ్వకాల్లో గుర్తించిన రాతి స్తంభంపై రాష్ట్రకూట రాజుల వంశవృక్షం వివరాలు కూడా వివరంగా ఉన్నాయి. అప్పటి రామేశ్వరాలయానికి సంబంధించిన భూముల దానం, పన్నులకు సంబంధించిన వివరాలు ఉన్నట్లు గుర్తించారు. ఆ స్తంభంపై రాష్ట్రకూట మహారాజు మూడో కృష్ణుడిపై వివిధ రకాల పొగడ్తలతో సంస్కృతంలో అక్షరాలు ఉన్నాయి. వీటిని మైలవరం పురావస్తు ప్రదర్శనశాలకు తరలించి భద్రపరచాలని అధికారులు నిర్ణయించారు.


వేసవికాలంలో సన్ స్క్రీన్ లోషన్ లను వాడవచ్చా..? ఒకవేళ వాడితే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసా..?

టిక్ టాక్ స్టార్ దుర్గా రావు...బిగ్ బాస్ ఎంట్రీ...?

హమ్మ ..చమ్మక్ చంద్ర..ఇన్ని కోట్ల ఆస్తి ఎలా కూడబెట్టడబ్బా..?

అక్కినేని హీరోను పెట్టి సినిమా తీస్తున్న వంటలక్క..ఫాన్స్ కి క్రేజీ న్యూస్

మీకు సొంత కారుందా..? అయితే మీ పని గోవిందా..

రాధేశ్యామ్ కోసం పూజా అతి పెద్ద ఫీట్ ?

కథను కనులకు చూపించేదే నాట్యం.. టీజర్ మాత్రం మాములుగా లేదు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>