PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/nota-sets-new-record-in-panchayat-pollse8224b4a-68f5-476d-a543-2580cf33d8a3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/nota-sets-new-record-in-panchayat-pollse8224b4a-68f5-476d-a543-2580cf33d8a3-415x250-IndiaHerald.jpgనెల్లూరు జిల్లాలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో నోటాకు రికార్డు స్థాయిలో ఓట్లు పడినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక సమాచారం బయటకు రాలేదు. గతంలో పంచాయతీ ఎన్నికల్లో నోటాకు అవకాశమే లేదు. ఈ దఫా అభ్యర్థి గుర్తులతోపాటు నోటాని కూడా కూడా బ్యాలెట్ పేపర్లో ముద్రించారు. అయితే అభ్యర్థులకు పడిన ఓట్లను మాత్రమే లెక్కిస్తామని, నోటాకు ఎన్ని ఓట్లు వచ్చాయో లెక్కించబోమని ముందుగానే స్పష్టం చేశారు. అంటే నోటాకు ఓటు వేసినా కూడా.. గ్రామంలో ఎంతమంది అలా నోటాకు ఓటు వేశారనే విషయం అధికారికంగా తేలదన్నమాట. jagan-nimmagadda-elections;district;police;panchayati;village;assembly;local languageజగడ్డ: నెల్లూరు జిల్లాలో నోటా రికార్డు..?జగడ్డ: నెల్లూరు జిల్లాలో నోటా రికార్డు..?jagan-nimmagadda-elections;district;police;panchayati;village;assembly;local languageWed, 10 Feb 2021 09:00:00 GMTపంచాయతీ ఎన్నికల్లో నోటాకు రికార్డు స్థాయిలో ఓట్లు పడినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక సమాచారం బయటకు రాలేదు. గతంలో పంచాయతీ ఎన్నికల్లో నోటాకు అవకాశమే లేదు. ఈ దఫా అభ్యర్థి గుర్తులతోపాటు నోటాని కూడా కూడా బ్యాలెట్ పేపర్లో ముద్రించారు. అయితే అభ్యర్థులకు పడిన ఓట్లను మాత్రమే లెక్కిస్తామని, నోటాకు ఎన్ని ఓట్లు వచ్చాయో లెక్కించబోమని ముందుగానే స్పష్టం చేశారు. అంటే నోటాకు ఓటు వేసినా కూడా.. గ్రామంలో ఎంతమంది అలా నోటాకు ఓటు వేశారనే విషయం అధికారికంగా తేలదన్నమాట.

ఇక నెల్లూరు జిల్లాకు వస్తే.. తొలివిడత కావలి రెవెన్యూ డివిజన్ ‌లోని 9 మండలాలకు సంబంధించి ఎన్నికలు జరిగాయి. నామినేషన్ల పర్వంలో 25 పంచాయతీలు ఏకగ్రీవం కాగా.. మొత్తం 137 సర్పంచి, 1024 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్‌ జరిగింది. ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ సజావుగా సాగింది. గత ఎన్నికలతో పోల్చి చూస్తే ఈసారి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా పోలీసులు, అధికారులు పటిష్ఠ చర్యలు తీసుకున్నారు. కావలి మండలం లక్ష్మీపురంలో అత్యధికంగా ఓటింగ్ నమోదైంది. ఇక్కడ పోల్ పర్సంటేజీ 95.34.

అయితే పంచాయతీ ఎన్నికల్లో ఈసారి ప్రవేశ పెట్టిన నోటాకి అధిక ప్రాధాన్యం దక్కింది. గ్రామాల్లో ఎక్కువమంది నోటా గురించి మాట్లాడుకున్నారు. అభ్యర్థులెవరూ నచ్చకపోతే నోటాకి ఓటు వేసే అవకాశం ఉండటంతో ఎన్నికలు మనకెందుకులే అనుకున్నవారు కూడా పోలింగ్ కేంద్రాలకు వచ్చి నోటాకి ఓటు వేసి వెళ్లిపోయారు. వాస్తవానికి అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు మాత్రమే నోటాని ఉపయోగించేవారు. ఈ దఫా స్థానిక ఎన్నికల్లో కూడా నోటాని ప్రవేశ పెట్టారు. స్థానిక ఎన్నికల్లో నోటాని ఎవరూ పట్టించుకోరు అనుకున్నా కూడా నెల్లూరు జిల్లా విషయానికొస్తే అది తప్పు అని తేలింది. అధికారిక సమాచారం లేదు కాబట్టి.. ఇతర జిల్లాల్లో కూడా నోటాకి పెద్ద ఎత్తున ఓట్లు పోలయి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఎన్నికల కౌంటింగ్ లో పాల్గొన్న సిబ్బంది ఇచ్చిన సమాచారం ప్రకారం నోటాకి కూడా మద్దతు బాగానే ఉందని తేలుతోంది. 


ఫలితాలు తేలాయి..పదవులు వచ్చాయి.. !!

బ్రాహ్మ‌ణ ఘోష‌: ఆ మూడు రాష్ట్రాల్లో బ్రాహ్మ‌ణులకు రిజ‌ర్వేష‌న్లు... ఏపీలో వాళ్లేం ఖ‌ర్మ చేసుకున్నారు ?

షర్మిల వ్యూహకర్తగా పీకే!

ఉప్పెనకు ఊహించని రీతిలో ప్రీ రిలీజ్ బిజినెస్

హెరాల్డ్ సెటైర్ : జగన్, చంద్రబాబు వల్లే ఇదంతా జరిగిందా ?

చిన్నమ్మకు రజనీ ఫోన్.. అదే కారణమా ?

అమరావతికి జగన్ వరాలు.. అసలు మతలబు ఇదేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>