PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/lady-problem88605c93-d747-4514-b9e7-7f62b712dcf1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/lady-problem88605c93-d747-4514-b9e7-7f62b712dcf1-415x250-IndiaHerald.jpgకొన్ని జీవితాలు అచ్చం సినిమా కథల్లాగానే ఉంటాయి.. సినిమాలను మించిన మలుపులు ఉంటాయి. అలాంటిదే ఈ కథ.. ఓ మహిళకు పెళ్లై ఇరవై ఏళ్లు అవుతోంది. ఐదేళ్లు కాపురం చేసి ఓ బాబు పుట్టాక వదిలేసి వెళ్లిపోయాడు. ఇంకో ఐదేళ్లు అత్తింట్లోనే ఉండి అతని కోసం ఎదురుచూసింది. తర్వాత పుట్టింట్లో ఉండి చదువుకుని ప్రభుత్వోద్యోగం సంపాదించుకుంది. ఆపై ఇంట్లోవాళ్లు ఇంకో సంబంధం చూసి పెళ్లి చేశారు. ఆ దంపతులకు ఓ పాప పుట్టింది. అంతా బావుందనుకునే సమయంలో మరో ఘోరం జరిగింది. ఏడాది క్రితం రెండో భర్త ఓ ప్రమాదంలో చనిపోయారు. ఇప్పుడు అనుకోకుంlady-problem;cinema;marriage;husband;wife;nijamఎప్పుడో వదిలేసిన మొగుడు.. మళ్లీ పెళ్లి చేసుకున్నాక తిరిగొస్తే..?ఎప్పుడో వదిలేసిన మొగుడు.. మళ్లీ పెళ్లి చేసుకున్నాక తిరిగొస్తే..?lady-problem;cinema;marriage;husband;wife;nijamWed, 10 Feb 2021 09:00:00 GMTసినిమా కథల్లాగానే ఉంటాయి.. సినిమాలను మించిన మలుపులు ఉంటాయి. అలాంటిదే ఈ కథ.. ఓ మహిళకు  పెళ్లై ఇరవై ఏళ్లు అవుతోంది. ఐదేళ్లు కాపురం చేసి ఓ బాబు పుట్టాక వదిలేసి వెళ్లిపోయాడు. ఇంకో ఐదేళ్లు అత్తింట్లోనే ఉండి అతని కోసం ఎదురుచూసింది. తర్వాత పుట్టింట్లో ఉండి చదువుకుని ప్రభుత్వోద్యోగం సంపాదించుకుంది. ఆపై ఇంట్లోవాళ్లు ఇంకో సంబంధం చూసి పెళ్లి చేశారు. ఆ దంపతులకు ఓ పాప పుట్టింది. అంతా బావుందనుకునే సమయంలో మరో ఘోరం జరిగింది.

ఏడాది క్రితం రెండో భర్త ఓ ప్రమాదంలో చనిపోయారు. ఇప్పుడు అనుకోకుండా మొదటి భర్త తిరిగి వచ్చాడు. భార్య ఉద్యోగం చూసి.. తనతో కాపురం చేయమంటున్నాడు. ఆమె చేసుకున్న  రెండో పెళ్లి చెల్లదని తనతో కాపురం చేయమని వేధిస్తున్నాడు. చట్టప్రకారం విడాకులు తీసుకోలేదు కాబట్టి తనతో నే కాపురం చేయాలని డిమాండ్ చేస్తున్నాడు. ఇప్పుడు మొదటి భర్త నుంచి తనను ఎలా కాపాడుకోవాలో అర్థం కాని పరిస్థితి.

దీనిపై ఆమె లాయర్ ను సంప్రదించింది.. ఇప్పటికయినా విడాకుల కోసం ప్రయత్నించాలని లాయర్ సలహా ఇచ్చారు. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్‌ 13 (8)ప్రకారం భార్యాభర్తలుగా  ఇద్దరూ  రెండేళ్లు కలవకుండా విడివిడిగా ఉన్నారు కాబట్టి దాన్నే విడాకులకు కారణంగా చూపించవచ్చని సలహా ఇచ్చారు. ఏడేళ్లు కనిపించకుండా పోతే ఆ కారణం చూపించి కూడా మీరు డైవోర్స్‌ తీసుకోవచ్చని సలహా ఇచ్చారు.

అంతే కాదు.. రెండో పెళ్లి చెల్లదనే కారణంతో మీ భర్తతో కాపురం చేయాలనే నియమం ఏమీ లేదని చెప్పారు.  ఇష్టం లేనప్పుడు బలవంతం చేయడానికి ఎవరికీ హక్కు లేదని తెలిపారు. ఇంకా వేధిస్తే..  పోలీసు ఫిర్యాదు ఇవ్వాలని.. ఉమెన్‌ ప్రొటెక్షన్‌ సెల్‌, మానవహక్కుల కమిషన్‌, మహిళాకమిషన్‌లకు ఫిర్యాదు చేయాలని సూచించారు. నిజంగానే సినిమా కథలా ఉంది కదూ.. ఏదేమైనా ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కోవడమే ఇప్పుడు ఆమె చేయాల్సింది.




ఫలితాలు తేలాయి..పదవులు వచ్చాయి.. !!

జగడ్డ: నెల్లూరు జిల్లాలో నోటా రికార్డు..?

బ్రాహ్మ‌ణ ఘోష‌: ఆ మూడు రాష్ట్రాల్లో బ్రాహ్మ‌ణులకు రిజ‌ర్వేష‌న్లు... ఏపీలో వాళ్లేం ఖ‌ర్మ చేసుకున్నారు ?

షర్మిల వ్యూహకర్తగా పీకే!

ఉప్పెనకు ఊహించని రీతిలో ప్రీ రిలీజ్ బిజినెస్

హెరాల్డ్ సెటైర్ : జగన్, చంద్రబాబు వల్లే ఇదంతా జరిగిందా ?

చిన్నమ్మకు రజనీ ఫోన్.. అదే కారణమా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>