PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcre6702b24-7a63-43a1-be98-fcaf4151b5e3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcre6702b24-7a63-43a1-be98-fcaf4151b5e3-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లా హాలియాలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన సీఎం కేసీఆర్.. టీఆర్ఎస్ ప్రభుత్వ ఆరున్నరేళ్ల ప్రొగ్రెస్ రిపోర్టును ప్రజల ముందు ఉంచారు. 2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తామేం చేశామో ప్రజలకు వివరించారు. మా ప్రభుత్వం అభివృద్ధి చేసింది... నేను చెప్పే మాటల్లో ఒక్కటి అబద్ధం ఉన్నా నాగార్జునసాగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్‌ను ఓడించండి అంటూ ఆయన ప్రజలకు ఆఫర్ ఇచ్చారుkcr;kcr;dharani;vidya;bharatiya janata party;telangana rashtra samithi trs;godavari river;congress;district;nalgonda;electricity;assembly;lakshmi devi;central government;partyనేను చెప్పే మాటల్లో ఒకటి అబద్ధం ఉన్నా సాగర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఓడించండి - కేసీఆర్నేను చెప్పే మాటల్లో ఒకటి అబద్ధం ఉన్నా సాగర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఓడించండి - కేసీఆర్kcr;kcr;dharani;vidya;bharatiya janata party;telangana rashtra samithi trs;godavari river;congress;district;nalgonda;electricity;assembly;lakshmi devi;central government;partyWed, 10 Feb 2021 23:20:00 GMTతెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లా హాలియాలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన సీఎం కేసీఆర్.. టీఆర్ఎస్ ప్రభుత్వ ఆరున్నరేళ్ల ప్రొగ్రెస్ రిపోర్టును ప్రజల ముందు ఉంచారు. 2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తామేం చేశామో ప్రజలకు వివరించారు. నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక త్వరలోనే జరగనున్న నేపథ్యంలో.. నిర్వహించిన ఈ సభలో కేసీఆర్ వ్యూహాత్మకంగా మాట్లాడారు. ఇక్కడ బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకొని ఆయన విమర్శలు గుప్పించారు. బీజేపీని విమర్శించినా.. వూహాత్మకంగానే కమలం పార్టీ ప్రస్తావనను పెద్దగా తీసుకురాలేదు. కాంగ్రెస్ నేతలు రైతుల కోసం చేపడుతున్న దీక్షలను ప్రశ్నించిన కేసీఆర్.. రైతు బంధు, 24 గంటల ఉచిత విద్యుత్ సహా రైతాంగం కోసం తాము ఏమేం చేస్తున్నామో వివరించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కల్యాణ లక్ష్మీ, కేసీఆర్ కిట్, ఫించన్ల పెంపు, ధరణి, కంటి వెలుగు, రైతు బంధు.. తదితర పథకాలను గులాబీ బాస్ ప్రస్తావించారు. కాంగ్రెస్ కంటే తామెంతో మెరుగైన పాలన అందిస్తున్నామనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేసీఆర్ ప్రయత్నించారు. రైతుల కోసం కాంగ్రెస్‌తో పోలిస్తే.. తామేం చేశామో చెప్పేందుకు టీఆర్ఎస్ అధినేత ప్రాధాన్యం ఇచ్చారు. ప్రతి గామ పంచాయతీలో నర్సరీతోపాటు.. పంచాయతీకో ట్రాక్టర్, ట్యాంకర్, ట్రాలీ ఉన్నాయన్నారు. ప్రతి ఊళ్లోనూ వైకుంఠధామం నిర్మిస్తున్నామన్నారు. గ్రామాల స్వరూపాన్ని మార్చేస్తున్నామన్నారు.




నల్గొండ జిల్లాలోని ఒక్కో గ్రామ పంచాయతీకి రూ.20 లక్షల చొప్పున మంజూరు చేస్తున్నట్లు ప్రకటించిన కేసీఆర్.. జిల్లాలోని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను ఏడాదిన్నరలో పూర్తి చేస్తామని.. లేదంటే ఓట్లు అడగబోమన్నారు. సీతారామ సాగర్ నుంచి గోదావరి జలాలను తీసుకొచ్చి నల్గొండ జిల్లాలోని సాగర్ ఆయకట్టుకు నీళ్లు అందిస్తామన్నారు. నల్గొండ జిల్లా దామరచర్లలో నిర్మిస్తోన్న 4 వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం వచ్చే రెండేళ్లలో అందుబాటులోకి వస్తుందన్నారు. దాని కోసం రూ.35 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలో ఎక్కువగా ఉన్న లంబాడీలు, యాదవుల గురించి కేసీఆర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. తండాలను పంచాయతీలుగా మార్చామన్న గులాబీ బాస్.. యాదవులకు గొర్రె పిల్లలను పంపిణీ చేస్తున్నామన్నారు. నాయీ బ్రాహ్మణులు మోడ్రన్ సెలూన్లు నిర్మించుకునేందుకు లక్ష రూపాయల చొప్పున మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. దళితుల కోసం వచ్చే బడ్జెట్లో సీఎం దళిత్ ఎంపవర్‌మెంట్ పేరిట రూ.1000 కోట్లను కేటాయిస్తామన్నారు. మా ప్రభుత్వం అభివృద్ధి చేసింది... నేను చెప్పే మాటల్లో ఒక్కటి అబద్ధం ఉన్నా నాగార్జునసాగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్‌ను ఓడించండి అంటూ ఆయన ప్రజలకు ఆఫర్ ఇచ్చారు. మంచిగ పని చేస్తున్న మమ్మల్ని పోగొట్టుకుంటే.. నష్టపోయేది మీరే అనే అర్థం ధ్వనించేలా కేసీఆర్ వ్యాఖ్యలున్నాయి. నల్గొండ జిల్లాపై వరాలు గుప్పించడం.. మాట తప్పబోమంటూ ప్రకటించడం.. ఇప్పటి దాకా ఏం చేశాం.. ఇక ముందు ఏమేం చేయబోతున్నామో.. వివరించడం ద్వారా.. నాగార్జునసాగర్ ప్రజలను పూర్తిగా తనవైపు తిప్పుకునేలా కేసీఆర్ మాట్లాడారు.




బ్రహ్మ జెముడు జ్యూస్ తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసుకోండి...

పుష్ప కొండపై 500 మందితో ఫైట్.. డిఎస్పి సీన్ లీక్ చేసేశాడు బాబోయ్..!

ఉప్పెన మొదటి షెడ్యూల్ అయ్యాక హీరోయిన్ ను మార్చారా..?

మెగా ఫ్యాన్స్ కు బిగ్ న్యూస్.. శంకర్ డైరక్షన్ లో రాం చరణ్ అఫీషియల్..!

విజయ్ సేతుపతిని బెదిరించి ఉప్పెనకు ఒప్పించారా..?

తెలుగు స్టార్లు అంత సాహసం కూడా చేస్తారా..?

గెలుపోటముల విషయం వదిలేసి మేయర్, డిప్యూటి మేయర్ పీఠం కోసం బిజేపి కూడా పోటీ పడనుంది




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>