PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/latest-news81df2836-ee0a-47da-bc31-b6e50bdfea8d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/latest-news81df2836-ee0a-47da-bc31-b6e50bdfea8d-415x250-IndiaHerald.jpg "రాజన్న రాజ్యం తెస్తా " వైఎస్ షర్మిల చేసిన ప్రకటన రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది. నిన్న జరిగిన సమావేశం లో షర్మిల రాజన్న రాజ్యం తెస్తానంటూ ప్రత్యేక్ష పార్టీ పెట్టె యోచనలో ఉన్నట్లు చెప్పకనే చెప్పింది. అయితే ముఖ్యంగా షర్మిల పార్టీ పెట్టడం వల్ల ఏపీ సి‌ఎం జగన్మోహన్ రెడ్డి కి పెద్ద ఎదురు దేబ్బే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఎందుకంటే తన సొంత చెల్లెలు తన పార్టీ కాదని ప్రత్యేక పార్టీ పెట్టేందుకు సిద్దం కావడం వల్ల వారిద్దరి మద్య విభేదాలు ఉన్నాయనే అభిప్రాయం ప్రజల్లో బలంగా పెరిజ్గlatest news;ramakrishna;jagan;andhra pradesh;2019;media;letter;ycp;reddy;partyషర్మిల రాకతో..జగనోరికి కొత్త చిక్కు ..?షర్మిల రాకతో..జగనోరికి కొత్త చిక్కు ..?latest news;ramakrishna;jagan;andhra pradesh;2019;media;letter;ycp;reddy;partyWed, 10 Feb 2021 10:17:04 GMT "రాజన్న రాజ్యం తెస్తా " వైఎస్ షర్మిల చేసిన ప్రకటన రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది. నిన్న జరిగిన సమావేశం లో షర్మిల రాజన్న రాజ్యం తెస్తానంటూ ప్రత్యేక్ష పార్టీ పెట్టె యోచనలో ఉన్నట్లు చెప్పకనే చెప్పింది. అయితే ముఖ్యంగా షర్మిల పార్టీ పెట్టడం వల్ల ఏపీ సి‌ఎం జగన్మోహన్ రెడ్డి కి పెద్ద ఎదురు దేబ్బే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఎందుకంటే తన సొంత చెల్లెలు తన పార్టీ కాదని ప్రత్యేక పార్టీ పెట్టేందుకు సిద్దం కావడం వల్ల వారిద్దరి మద్య విభేదాలు ఉన్నాయనే అభిప్రాయం ప్రజల్లో బలంగా పెరిజ్గిపోతుంది. దీని వల్ల వైఎస్ అభిమానులలో చీలిక వచ్చి జగన్ ఇమేజ్ ను దెబ్బ తీస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

 గతంలో జగన్ అక్రమాస్తుల కేసుల విషయంలో జైల్లో ఉన్నప్పుడూ పార్టీ బలోపేతం చెయ్యడం లో షర్మిల కీలక పాత్ర వహించింది. "జగనన్న సంధించిన బాణాన్ని " సుదీర్ఘ పాదయాత్రతో ప్రజల్లో నిలిచింది. అలాగే 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ కీలక నియోజిక వర్గాలలో ప్రచారలతో హోరెత్తించి పార్టీ గెలుపులో తనదైన పాత్ర వహించింది వైఎస్ షర్మిల. ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించిన తర్వాత... షర్మిల మళ్లీ ఎక్కడా కనిపించలేదు. చెల్లెలికి జగన్‌ న్యాయం చేయలేదని, ఆమెకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని వైసీపీ ముఖ్యనేతలు అంగీకరిస్తున్నారు. ఇప్పుడు షర్మిల ప్రత్యేక పార్టీ ఏర్పాటు చేయాలనే నిర్ణయం వెనుక... సొంత అస్తిత్వాన్ని, బలాన్ని చాటుకోవాలనే లక్ష్యముందని చెబుతున్నారు.

 ఇది జగన్ కు మింగుడు పడడంలేదని అందుకే ప్రబుత్వ పార్టీ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి తో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే మీడియా సమావేశంలో సజ్జల వివరణను చూస్తే  ఇద్దరి మధ్య విభేదాలు నిజమని, దీని వల్లే అన్న జగన్‌ వద్దన్నా, తెలంగాణలో పార్టీ ఏర్పాటు విషయంలో షర్మిల ముందుకే వెళ్లారని పరోక్షంగా అంగీకరించినట్లయింది. మీడియా సమావేశంలో సజ్జల సుదీర్ఘ వివరణను ఇచ్చినా... పలుచోట్ల ఆయన తడబడటం స్పష్టంగా కనిపించింది. ఈ పరిణామాలతో వైసీపీ వర్గాల్లో ఒకింత కలవరం, కొంత గుబులు మొదలైంది.  అయితే సజ్జల మాటలను బట్టి చూస్తే అన్న చెల్లెలు మద్య విభేదాలు ఉన్నాయని స్పష్టంగా అర్థమవుతుంది. సజ్జల వివరణలో "వ్యక్తిగత విభేధాలు లేవు గాని బిన్నాభిప్రాయాలు మాత్రమే " అంటూ తెలిపారు. ఏది ఏమైనప్పటికి వైఎస్ షర్మిల నిర్ణయం జగన్ ఇమేజ్ ను దెబ్బ తీస్తుందని రాజకీయ పండితులు అభిప్రాయ పడుతున్నారు. .


వైసీపీ ఎమ్మెల్యే బెదిరింపున‌కు అదిరిపోయే జవాబు...?

బీజేపీ పెద్ద‌ల‌తో జ‌న‌సేన భేటీ.. సోముపై సంచ‌ల‌న ఫిర్యాదులు..!

ఎడిటోరియల్: నానా యాగి చేసి ఏపి ఎన్నికల కమీషన్ సాధించేమిటి?

ష‌ర్మిల కొత్త ఛానెల్‌.. ఏర్పాట్ల‌లో బిజీబిజీ..!

గుంటూరు పంచాయ‌తీల్లో వైసీపీ ఎమ్మెల్యేల‌కు షాకులు

జగడ్డ: నెల్లూరు జిల్లాలో నోటా రికార్డు..?

బ్రాహ్మ‌ణ ఘోష‌: ఆ మూడు రాష్ట్రాల్లో బ్రాహ్మ‌ణులకు రిజ‌ర్వేష‌న్లు... ఏపీలో వాళ్లేం ఖ‌ర్మ చేసుకున్నారు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>