PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/natures-red-eye-on-uttarakhand0130887b-e78b-4860-8ecb-c2c875e4b255-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/natures-red-eye-on-uttarakhand0130887b-e78b-4860-8ecb-c2c875e4b255-415x250-IndiaHerald.jpgహిందూ పుణ్యక్షేత్రాల పుట్టినిల్లుగా పేరు గాంచిన ఉత్తరాఖండ్‌లో ఇటీవలే సంభవించిన జలప్రళయం తీవ్ర విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. గత ఆదివారం (ఫిబ్రవరి 7) ఉదయం ప్రమాదం జరగడానికి ముందు అలకనంద నదిలో చేపలు వింతగా ప్రవర్తించాయట. అయితే.. స్థానికులు ఆ విషయాన్ని ఆ రోజు గుర్తించలేకపోయారు. ముప్పు రాబోతుందని గ్రహించడం వల్లే ఆ చేపలు అలా ప్రవర్తించి ఉంటాయని భావిస్తున్నారు.uttarakhand;vidya;uttarakhand;electricity;february;aqua;tsunami;local language;v;siva kumarఉత్తరాఖండ్ ఉపద్రవాన్ని ఆ చేపలు ముందే పసిగట్టాయట కానీ....ఉత్తరాఖండ్ ఉపద్రవాన్ని ఆ చేపలు ముందే పసిగట్టాయట కానీ....uttarakhand;vidya;uttarakhand;electricity;february;aqua;tsunami;local language;v;siva kumarWed, 10 Feb 2021 23:00:00 GMTహిందూ పుణ్యక్షేత్రాల పుట్టినిల్లుగా పేరు గాంచిన ఉత్తరాఖండ్‌లో ఇటీవలే సంభవించిన జలప్రళయం తీవ్ర విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. ఒక్కసారిగా ఇంత పెద్ద ఉపద్రవం చోటు చేసుకోవడానికి అసలు కారణం ఏంటనేది ఇప్పటికీ ఎవరికీ అంతుబట్టడంలేదు. దీనికి తోడు ఈ ఘటనకు సంబంధించి రోజుకొక కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. గత ఆదివారం (ఫిబ్రవరి 7) ఉదయం ప్రమాదం జరగడానికి ముందు అలకనంద నదిలో చేపలు వింతగా ప్రవర్తించాయట. అయితే.. స్థానికులు ఆ విషయాన్ని ఆ రోజు గుర్తించలేకపోయారు. ముప్పు రాబోతుందని గ్రహించడం వల్లే ఆ చేపలు అలా ప్రవర్తించి ఉంటాయని భావిస్తున్నారు. ఆ రోజు ఉదయం 9 గంటల కంటే ముందు అలకనంద నదిలో చేపలు గుంపులు గుంపులుగా కనిపించాయని లాసు గ్రామస్థుడొకరు తెలిపారు. చేపలు సహజంగా ప్రవాహం మధ్య భాగంలో ఎక్కువగా కనిపిస్తుంటాయట. కానీ, ఆ రోజు ఎప్పుడూ లేనివిధంగా నదికి ఇరువైపులా ఒడ్డు భాగంలో చేపలు ఎక్కువగా ఉన్నాయని అతడు చెప్పాడు.




‘ఆ రోజు చేపలు అప్రయత్నంగానే దొరికాయి. వలలు, ఇతర సాధనాల అవసరం లేకుండానే చాలా మంది పెద్ద మొత్తంలో చేపలను పట్టుకెళ్లారు. వట్టి చేతులతోనే చేపలను పట్టుకున్నారు. కొందరైతే బకెట్లు, కుండలను కూడా తీసుకొచ్చి నింపుకుపోయారు’ అని ఓ గ్రామస్థుడు తెలిపాడు. ‘ఎవరికి వారు చేపలను పట్టడంలో బిజీగా గడిపారు. కానీ, అది రాబోయే ఉపద్రవానికి సంకేతం కావొచ్చు. ఆ విషయాన్ని ఎవరూ గ్రహించలేకపోయారు’ అని గ్రామస్థుడు అన్నాడు. ధౌళిగంగా పరివాహక ప్రాంతాలైన నంద్‌ప్రయాగ్, లంగసు, గిర్సా, కర్ణ్ ప్రయాగ్, రైనీ గ్రామాల్లోనూ స్థానికులు ఇదే రకమైన అనుభవాన్ని ఎదుర్కొన్నారట. ఆ గ్రామాల్లోనూ చాలా మంది చేపలను పెద్ద ఎత్తున తీసుకెళ్లారు. ‘ఆ రోజు కొన్ని అరుదైన చేపలను కూడా పట్టుకున్నాం. అది కూడా ప్రవాహంలో బాగా లోతుకి దిగకుండానే..’ అని గిర్సా గ్రామానికి చెందిన రాధాక్రిష్ణ చెప్పాడు.




‘ఆ రోజు చాలా మంది నదీ తీరంలో పోగయ్యారు. ఎన్నడూ లేనివిధంగా పెద్ద సంఖ్యలో చేపలను పట్టుకెళ్లారు. కానీ, చేపలు పడుతున్నప్పుడు వారందరూ చిన్న విషయాన్ని గమనించలేకపోయారు. తేట తెల్లని వర్ణంలో ఉండే ఆ నదీ జలాలు బూడిద రంగులోకి మారాయి. ఆ ప్రమాదానికి కొన్ని గంటల ముందే ఇలా జరిగింది’ అని రాధాక్రిష్ణ చెప్పుకొచ్చాడు. పెద్ద ఉపద్రవం ఎదురు కాబోతుందని చేపలకు ముందే సంకేతాలు అంది ఉంటాయని శాస్త్రవేత్తలు కూడా అభిప్రాయపడుతున్నారు. జంతువులు, వణ్యప్రాణులకు ఇలాంటి సంకేతాలను గ్రహించడానికి ప్రత్యేక అవయవాలు ఉంటాయని చెబుతున్నారు. 2006లో సునామీ రావడానికి ముందు పశువులు, కుక్కలు తాళ్లను తెంపుకొని కిలోమీటర్ల దూరం పరుగెత్తిన విషయాన్ని కొంత మంది నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఆ రోజు చిలుకలు, ఇతర పక్షులు కూడా వింతగా ప్రవర్తించాయని తెలిపారు. ‘పెద్ద విపత్తు ఎదురయ్యేటప్పుడు నీటిలో కొన్ని వైబ్రేషన్స్ వస్తాయి. నీటిలో ఉండే చేపలు ఈ సంకేతాలను గ్రహిస్తాయి. నీటి ప్రవాహంలో చిన్న తేడా వచ్చినా, ప్రవాహ ఒత్తిడిలో స్వల్ప మార్పు వచ్చినా చేపలు గుర్తిస్తాయి. ఇందుకోసం వాటికి ప్రత్యేక అవయవాలు ఉంటాయి’ అని సీనియర్ శాస్త్రవేత్త శివకుమార్ తెలిపారు. ఘటన జరిగిన రోజు కూడా చేపలకు ముందుగానే సంకేతాలు అందింటాయని శివకుమార్ అభిప్రాయపడ్డారు. ప్రవాహం అంతర్భాగంలో వరద ఉధృతికి సంబంధించిన ధ్వనులను చేపలు ముందే గ్రహించి ఉండవచ్చునని ఆయన అన్నారు. మరేదైనా కారణం కూడా ఉండవచ్చని చెప్పారు. నీటి ప్రవాహంలో ఏదైనా విద్యుత్ ప్రవహించే తీగ పడి, చేపలు ఎలక్ట్రిక్ షాక్‌కు గురైనప్పుడు కూడా ఇదే విధంగా ప్రవర్తిస్తాయని ఆయన చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా ఆ గ్రామస్థులు మాత్రం దీని గురించి ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.




బ్రహ్మ జెముడు జ్యూస్ తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసుకోండి...

పుష్ప కొండపై 500 మందితో ఫైట్.. డిఎస్పి సీన్ లీక్ చేసేశాడు బాబోయ్..!

ఉప్పెన మొదటి షెడ్యూల్ అయ్యాక హీరోయిన్ ను మార్చారా..?

మెగా ఫ్యాన్స్ కు బిగ్ న్యూస్.. శంకర్ డైరక్షన్ లో రాం చరణ్ అఫీషియల్..!

విజయ్ సేతుపతిని బెదిరించి ఉప్పెనకు ఒప్పించారా..?

తెలుగు స్టార్లు అంత సాహసం కూడా చేస్తారా..?

గెలుపోటముల విషయం వదిలేసి మేయర్, డిప్యూటి మేయర్ పీఠం కోసం బిజేపి కూడా పోటీ పడనుంది




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>