PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rape79083569-8002-4b63-a656-93c47e2af762-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rape79083569-8002-4b63-a656-93c47e2af762-415x250-IndiaHerald.jpgసమాజంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఎదో ఒక్క ప్రాంతంలో కామాంధుల వికృత చేష్టలకు అమ్మాయిలు బలైపోతూనే ఉన్నారు. తాజాగా 13 ఏళ్ల మానసిక వికలాంగురాలు. తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్తే, ఆ బాలిక మాత్రం ఇంట్లోనే ఉంటుంటుంది. లోకం పోకడ తెలియని ఆ అమాయకురాలిపై ఇద్దరు కామాంధుల కన్ను పడింది. ఆమెతో పరిచయం పెంచుకుని మాటలు కలిపారు. ఆ తర్వాత స్వీట్లు ఇస్తామంటూ ఆశచూపి ఆమెపై లైంగిక దాడి చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. rape;police;uttar pradesh;local language;lie;bareliదారుణం: 13 ఏళ్ల మానసిక వికలాంగురాలిపై అఘాయిత్యం..!?దారుణం: 13 ఏళ్ల మానసిక వికలాంగురాలిపై అఘాయిత్యం..!?rape;police;uttar pradesh;local language;lie;bareliWed, 10 Feb 2021 21:00:00 GMTఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్ష్మీపూర్ జిల్లాలో బరేలీ ప్రాంతంలో ఓ వ్యవసాయ కుటుంబం ఉంది. ఆ రైతు కుటుంబంలో ఓ 13 ఏళ్ల బాలిక మానసిక వైకల్యంతో బాధపడుతోంది. కుటుంబ సభ్యులంతా పొలం పనులకు వెళ్తే, ఆ బాలిక ఒక్కత్తే ఇంట్లో ఉండేది. దీన్ని ఆసరాగా చేసుకుని స్థానికంగా ఉండే ఇద్దరు యువకులు ఆమెతో మాటలు కలిపారు. ఆమెకు స్వీట్లు అంటే ఇష్టం అని తెలిసి వాటిని కొనిచ్చేవాళ్లు. ఆ తర్వాత ఆమెతో లైంగిక వాంఛలను తీర్చుకునేవాళ్లు. స్వీట్లు ఇస్తామన్న ఆశ చూపి ఆ కామాంధులు ఇద్దరూ నెలల తరబడి ఆ బాలికపై పలుమార్లు దారుణానికి ఒడిగట్టారు.

ఆ బాలిక కడుపు ఎత్తుగా ఉబ్బినట్టుగా అవుతుండటంతోపాటు, కడుపు నొప్పి అంటూ బాధపడటంతో తల్లిదండ్రులు స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం ఆ బాలిక రెండు నెలల గర్భవతి అని డాక్టర్లు తేల్చారు. దీంతో ఆ తల్లిదండ్రులిద్దరికి ఒక్కసారిగా షాక్ కి గురైయ్యారు. తమ కూతురిపై దారుణానికి ఒడిగట్టిందెవరో తెలియక, ఆ బాలికను అడిగితే చెప్పలేకపోవడంతో వారు మనోవేధనకు గురయ్యారు.

ఇక మానసిక వైద్య నిపుణులు ఆమెతో మాట్లాడి, ఆమెను కలిసేందుకు ఎవరెవరు వస్తుంటారన్న వివరాలను బాలిక నుంచి రాబట్టారు. దీంతో ఈ దారుణానికి తెగించిన ఆ ఇద్దరు యువకులను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. భయపడి పొలాల్లో దాక్కున్నప్పటికీ వారిని వెతికి పట్టుకోగలిగారు. వారిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు..







టీచర్ల వెతలు : సీనియర్ ప్రైవేట్ టీచర్లకి గవెర్నమెంట్ తరపున ప్రతినెలా ఫించన్ ఇవ్వాలి ...

గెలుపోటముల విషయం వదిలేసి మేయర్, డిప్యూటి మేయర్ పీఠం కోసం బిజేపి కూడా పోటీ పడనుంది

మెగాస్టార్ సరసన రకుల్...?

ఉప్పెన హిట్ అవ్వాలంటే ఎంత కలెక్ట్ చేయాలి.. వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాకే భారీ టార్గెట్..!

ఉప్పెన కథ కొట్టేశాడా.. ఎన్.టి.ఆర్ కు ఆ డౌట్ ఎందుకొచ్చింది..!

జగడ్డ : విశాఖ మేయర్ కి పొగ పెట్టనున్న ఉక్కు సెగ ?

రిలీజ్ అవ్వకుండానే రికార్డు సృష్టించిన ఉప్పెన సినిమా...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>