PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/hydarabad22c2ee8e-0ccc-474a-a7e0-114b1978044e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/hydarabad22c2ee8e-0ccc-474a-a7e0-114b1978044e-415x250-IndiaHerald.jpgహైదరాబాద్ లో ఎన్నికలు వచ్చాయంటే పార్టీల నేతల్లో కొత్త జోష్ ఉరకలేస్తుంది. అధికార పార్టీ వర్సెస్ బీజేపి పోరు మొదలవుతుంది. మొన్నటి వరకు హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల ఆసక్తి గా మారాయి.. ఇకపోతే ఇప్పుడు మరోసారి రచ్చ జరగబోతుంది. ఒకవైపు ఎన్నిక చెల్లదంటూ ట్రిబ్యునల్‌లో కేసు.. మరోవైపు జీహెచ్‌ఎంసీ అధికారుల సంతకాలు ఫోర్జరీ చేశారంటూ ఆరోపణలు.. ఇంకోవైపు కార్పొరేటర్‌గా ప్రమాణస్వీకారం.. జూబ్లీహిల్స్‌ డివిజన్‌ నుంచి బీజేపీ తరఫున కార్పొరేటర్‌గా ఎన్నికైన డేరంగుల వెంకటేశ్‌ వ్యవహారం ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగాhydarabad;hyderabad;bharatiya janata party;రాజీనామా;police;jubilee hills;court;february;josh;banjara hills;party;racchaప్రమాణ స్వీకారం చేయాలా లేక రాజీనామా?ప్రమాణ స్వీకారం చేయాలా లేక రాజీనామా?hydarabad;hyderabad;bharatiya janata party;రాజీనామా;police;jubilee hills;court;february;josh;banjara hills;party;racchaTue, 09 Feb 2021 07:00:00 GMTహైదరాబాద్ లో ఎన్నికలు వచ్చాయంటే పార్టీల నేతల్లో  కొత్త జోష్ ఉరకలేస్తుంది. అధికార పార్టీ వర్సెస్ బీజేపి పోరు మొదలవుతుంది. మొన్నటి వరకు హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల ఆసక్తి గా మారాయి.. ఇకపోతే ఇప్పుడు మరోసారి రచ్చ జరగబోతుంది. ఒకవైపు ఎన్నిక చెల్లదంటూ ట్రిబ్యునల్‌లో కేసు.. మరోవైపు జీహెచ్‌ఎంసీ అధికారుల సంతకాలు ఫోర్జరీ చేశారంటూ ఆరోపణలు.. ఇంకోవైపు కార్పొరేటర్‌గా ప్రమాణస్వీకారం.. జూబ్లీహిల్స్‌ డివిజన్‌ నుంచి బీజేపీ తరఫున కార్పొరేటర్‌గా ఎన్నికైన డేరంగుల వెంకటేశ్‌ వ్యవహారం ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా తయారైంది.


జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు నాలుగు నెలల ముందు పార్టీలోకి వచ్చిన వెంకటేశ్‌కు టికెట్‌ ఇవ్వడం అన్నీ క్షణాల్లో జరిగిపోయింది. ఎన్నికల ఫలితాల తర్వాత డివిజన్‌లో పరిణామాలు వేగంగా మారిపోయాయి. ఎన్నికల అఫిడవిట్‌లో ఇద్దరు పిల్లల నిబంధనను ఉల్లంఘించి గెలిచిన డేరంగుల వెంకటేశ్‌ ఎన్నికను రద్దు చేయాలంటూ టీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ కార్పొరేటర్‌ కాజా సూర్యనారాయణ ఎన్నికల ట్రిబ్యునల్ ఆఫీసర్ ను కలిశారు. ఈ మేరకు ఈ కేసును మూడు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించింది. దీంతో బీజేపి పార్టీ నేతలలో ఆందోళన మొదలైంది.


వాటితో సంఘానికి ఇచ్చిన అఫిడవిట్‌లో సమర్పించిన బర్త్‌ సర్టిఫికెట్లు ఫోర్జరీ చేశారంటూ ఇటీవల కాజా సూర్యనారాయణ బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా ఎన్నికల ట్రిబ్యునల్‌ ముందు ఫిబ్రవరి 18 న విచారణకు హాజరు కావాలంటూ రెండురోజుల క్రితం డేరంగుల వెంకటేశ్‌తో పాటు ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులందరికీ నోటీసులు అందాయి.. 11 న నామినేషన్ వేయాలా లేదా 18 న కోర్టుకు హాజరు కావాలా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.జూబ్లీహిల్స్‌ డివిజన్‌ ఎన్నిక విషయంలో మాత్రం మూడునెలల్లోనే విచారణ పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాజీనామా చేయాలని, తద్వారా ఉప ఎన్నిక వస్తుందని కొంతమంది బీజేపీ నాయకులు సూచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సొంత పార్టీ నేతలే అతన్ని గద్దె దిగమని చెబుతున్నారు. మరి ఈ విషయం ఎక్కడికి వెళ్తుంది.. ఎన్నికలు ఉన్నాయో లేదో సందిగ్ధం లో ఉన్నారని తెలుస్తోంది.


అందులో కోహ్లీ కన్నా రూట్ చాలా బెటర్..!!

హెరాల్డ్ ఎడిటోరియల్ : వైఎస్ షర్మిల దెబ్బకు పార్టీల్లో టెన్షన్ పెరిగిపోతోందా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఏకగ్రీవాలపై చేతులెత్తేసిన నిమ్మగడ్డ

కార్తీకదీపం సౌర్య గురించి ఈ విషయాలు తెలిస్తే షాక్ అవుతారు..!

భారీ బడ్జెట్ చిత్రాలకు ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన సినిమా ఏదో తెలుసా..?

టీచర్ల వెతలు : చాలని జీతాలు..గురువుల కష్టాలు !!

బ్రాహ్మణ ఘోష : రాష్ట్రంలో చాలా గుడులకి ప్రభుత్వం మరమ్మత్తులు చేయించాలి...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>