PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ys-sharmila-revanth-reddy6d8191b7-bf56-4ff4-afc8-033d881fba7a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ys-sharmila-revanth-reddy6d8191b7-bf56-4ff4-afc8-033d881fba7a-415x250-IndiaHerald.jpgషర్మిల కొత్త పార్టీపై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.కేసీఆర్ వదిలిన బాణమే షర్మిల పార్టీ అన్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ను దెబ్బతీయడానికి కేసీఆర్ షర్మిలతో పార్టీ పెట్టిస్తున్నారని చెప్పారు, వైఎస్ కు తెలంగాణలో అభిమానులు ఉన్నారన్నారు. ఇందిరమ్మ పార్టీలోనే వైఎస్ సీఎం అయ్యారని చెప్పారు.వైఎస్ ఏ పథకం తెచ్చినా కాంగ్రెస్ నాయకుడుగానే చేశారని చెప్పారుys sharmila revanth reddy;kcr;manu;revanth;bharatiya janata party;jagan;andhra pradesh;telangana;revanth reddy;y. s. rajasekhara reddy;congress;mp;chief minister;reddy;partyబ్రేకింగ్ : షర్మిల పార్టీపై రేవంత్ సంచలనంబ్రేకింగ్ : షర్మిల పార్టీపై రేవంత్ సంచలనంys sharmila revanth reddy;kcr;manu;revanth;bharatiya janata party;jagan;andhra pradesh;telangana;revanth reddy;y. s. rajasekhara reddy;congress;mp;chief minister;reddy;partyTue, 09 Feb 2021 19:21:46 GMTవైఎస్సార్ తనయ,  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ సోదరి వైఎస్ షర్మిల పార్టీ పెట్టబోతున్నారన్న వార్త తెలుగు రాష్ట్రాల్లో  సంచలనంగా మారింది. తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు స్పష్టిస్తోంది. షర్మిల పార్టీపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. షర్మిల పార్టీ వెనుక బీజేపీ ఉందని కొందరు చెబుతుండగా.. కేసీఆరే అంతా నడిపిస్తున్నారని మరి కొందరు ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలో మరో పార్టీకి స్పేస్ ఉండదని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే  షర్మిల కొత్త పార్టీపై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

           కేసీఆర్ వదిలిన బాణమే షర్మిల పార్టీ అన్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ను దెబ్బతీయడానికి కేసీఆర్  షర్మిలతో పార్టీ పెట్టిస్తున్నారని చెప్పారు, వైఎస్ కు తెలంగాణలో అభిమానులు ఉన్నారన్నారు. ఇందిరమ్మ పార్టీలోనే వైఎస్ సీఎం అయ్యారని చెప్పారు.వైఎస్ ఏ పథకం తెచ్చినా కాంగ్రెస్ నాయకుడుగానే చేశారని చెప్పారు  రేవంత్ రెడ్డి. వైఎస్ అంటే తెలంగాణ సమాజానికి గౌరవం, అభిమానం ఉందన్న రేవంత్..  అంత మాత్రాన షర్మిల పార్టీ పెడితే ప్రజలు అంగీకరించరని తెలిపారు.తెలంగాణ బిడ్డలు ఏలుకోవడానికి రాష్ట్రం తెచ్చుకున్నాం కానీ... రాజన్న బిడ్డగా ఏలుకోవడానికి కాదంటూ హాట్ కామెంట్స్ చేశారు.

         షర్మిలకు తన అన్నతో పంచాయితీ ఉంటే అక్కడే చూసుకోవాలన్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఇక సీఎం అయ్యేది లేదని తేల్చి చెప్పారు.  కేసీఆర్ దోపిడీ చూసి వంది మీటర్ల గోతిలో పాతి పెట్టడానికి ప్రజలు రెడీ అయ్యారన్నారు. పులిచింతల, పోతిరెడ్డిపాడు, సంగమేశ్వరం పై షర్మిల వైఖరి చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.  తెలంగాణ వద్దు... సమైక్యరాష్ట్రం ముద్దు నినదించారు కాబట్టి.. చనిపోయిన బిడ్డలకు ముందు క్షమాపణ చెప్పాలని రేవంత్ రెడ్డి అన్నారు. అన్నని కాదని మా తెలంగాణ పక్షాన నువ్వు నిలబడే చిత్తశుద్ధి ఉందా అని షర్మిలను ప్రశ్నించారు రేవంత్ రెడ్డి.

మన రాష్ట్రం మనం ఏలాలా... పక్క రాష్ట్రం వాళ్లు వచ్చి ఏలాలో తెలంగాణ ప్రజలు నిర్ణయించుకోవాలన్నారు రేవంత్ రెడ్డి. షర్మిల పార్టీకి ఇక్కడ మనుగడ ఉండదన్నారు. 1200 మంది బిడ్డల బలిదానాలను అవమానించే వాడే షర్మిలకు స్వాగతం పలుకుతాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు  రేవంత్ రెడ్డి. షర్మిల పార్టీపై కేసీఆర్ ఎందుకు నోరు మెదపడం లేదన్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ వ్యతిరేక ఓట్ల చీలిక తెచ్చేందుకు పార్టీ పెట్టిస్తారా అని ప్రశ్నించారు. కేసీఆర్ కుట్ర నుంచి తెలంగాణ సమాజం అప్రమత్తం కావాలన్నారు రేవంత్ రెడ్డి.





పంచాయ‌తీల్లో క‌నీవినీ ఎరుగ‌ని పోలింగ్‌.. కార‌ణాలు ఏంటి ?

విశాఖలో దుమ్ము దులుపుతున్న ఫ్యాన్...?

పంచాయ‌తీల్లో బాబోరి సైకిల్ డొక్కు డొక్కు... ఇంత దారుణ ఫ‌లితాలా ?

చిత్తూరులో చంద్ర‌బాబు జీరో.. ఏ జిల్లాలో ఎవ‌రికెన్ని స‌ర్పంచ్‌లు అంటే ?

బ్రేకింగ్‌: సెంచ‌రీ కొట్టిన వైసీపీ... టీడీపీకి ఒక్క‌టొచ్చింది..!

క్రాక్ వివాదం : ఎట్టకేలకు నోరు విప్పిన ఠాగూర్ మధు !

బాలయ్య 'BB3' టైటిల్ ని రివీల్ చేసేది అప్పుడే : బోయపాటి..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>