Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/brahmi-mokkad2d3dac6-581f-4e26-9a57-a0d3924563ec-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/brahmi-mokkad2d3dac6-581f-4e26-9a57-a0d3924563ec-415x250-IndiaHerald.jpg ప్రతి ఒక్కరూ అందంగా కనిపించాలని అనుకుంటారు. అందంగా కనబడటానికి ఎన్నో క్రిములు వాడుతూ ఉంటాము.అనేక రకాల ప్రయోగాలు చేస్తూ ఉంటాం. ముఖ్యంగా జుట్టు కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం జుట్టు అందంగా ఉంటేనే మనిషి కూడా అందంగా కనపడతారు. అలాగే చర్మము అందంగా కనిపించడానికి చర్మంపై అనేక ప్రొడక్ట్స్ ను ఉపయోగిస్తుంటాం.ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం మాత్రం అంత మాత్రమే ఉంటుంది. అలాగే జుట్టు, చర్మం ఆరోగ్యంగా ఉండటానికి బ్రాహ్మీ ను వాడాల్సిందే.బ్రాహ్మి మొక్క వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు చూద్దాం... brahmi mokka;ayurvedaబ్రాహ్మి మొక్కతో జుట్టు,చర్మ సౌందర్యాలను మెరుగుపరుచుకోవచ్చని, మీకు తెలుసా...?బ్రాహ్మి మొక్కతో జుట్టు,చర్మ సౌందర్యాలను మెరుగుపరుచుకోవచ్చని, మీకు తెలుసా...?brahmi mokka;ayurvedaTue, 09 Feb 2021 08:00:00 GMT
 బ్రాహ్మీ మొక్కలో  ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.  ఈ మొక్క ఎక్కువగా బురదలో ను చిత్తడినేలలో పెరుగుతుంటుంది. ఈ మొక్కను ఆయుర్వేద ఔషధాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు.ఈ మొక్కలోని అన్ని భాగాలు ఔషధాలు గా ఉపయోగపడతాయి.

 చర్మంపై ఏర్పడ్డ తామర, అలర్జీ వంటి సమస్యలకు బ్రాహ్మీ మొక్క రసము బాగా పనిచేస్తుంది. ఈ రసమును తామర, అలర్జీ ఉన్న చోట రాయడం వల్ల తగ్గిపోతాయి.

 శరీరంలోని మెలనిన్ పిగ్మెంట్ ను మెరుగుపరచడానికి బ్రాహ్మి మొక్క బాగా ఉపయోగపడుతుంది. బ్రహ్మీ చెట్టు ఆకు రసమును తరచూ చర్మానికి పోసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా ఉంటుంది.అంతేకాకుండా మొటిమలను, మచ్చలను కూడా తగ్గిస్తుంది.

 జుట్టు రాలే సమస్య ఉంటే బ్రాహ్మి మొక్కను ఉపయోగించడం వల్ల ఈ సమస్య తగ్గుతుంది. ఎందుకంటే ఈ మొక్కలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.అందువల్ల ఈ ఆకుల రసాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివరి వరకు అప్లై చేయడం వల్ల జుట్టు ఎంతో దృఢంగా పెరుగుతుంది.

 బట్టతల ఉన్న వాళ్ళు,  జుట్టు అధికంగా రాలిపోతున్న వాళ్లు,జుట్టు చిట్లి పోవడం వంటి సమస్య ఉన్న వాళ్లు బ్రాహ్మి ఆకు రసాన్ని తలకు రాసుకుని గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయడం వల్ల సమస్యలు తొలగిపోయి జుట్టు పొడవుగా, దృఢంగా పెరుగుతాయని ఆయుర్వేద శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.


వైసీపీలో ఈ పంచాయితీ ఏంటీ గురూ...?

హెరాల్డ్ సెటైర్ : పవన్ను ఆటలో అరటిపండు లాగ చేసేశారా ?

మెగా నామ సంవత్సరం : ఏకంగా 11 సినిమాల రిలీజ్

వారెవ్వా.. జగన్ డబుల్ గేమ్ భలేగా ఉందే..

నేడే తొలిదశ పంచాయతీ పోలింగ్‌.. ఇవిగో ఫుల్ డిటైల్స్..!

హెరాల్డ్ ఎడిటోరియల్ : వైఎస్ షర్మిల దెబ్బకు పార్టీల్లో టెన్షన్ పెరిగిపోతోందా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఏకగ్రీవాలపై చేతులెత్తేసిన నిమ్మగడ్డ




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>