MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/krutib25cbd8c-6ee6-46a3-92f2-a1aed0d5fccb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/krutib25cbd8c-6ee6-46a3-92f2-a1aed0d5fccb-415x250-IndiaHerald.jpgఅందమైన అమ్మాయి దొరకాలే కానీ వెండి తెర అంతా నిండుగా గ్లామర్ పరచుకుంటుందిగా. పట్ట పగలే పండు వెన్నెలలు వెల్లి విరిసి మురిపిస్తాయిగా. టాలీవుడ్ కి ఐ ఫీస్ట్ కావాలి. ఎందరో వయ్యారి భామలు తెలుగు సినీ సీమను వరించి తరింపచేశారు. kruti;beauty;pooja hegde;rashmika mandanna;surya sivakumar;bollywood;tollywood;cinema;telugu;rajani kanth;kollywood;kannada;blockbuster hit;girl;silver;heroine;silver screen;nagashauryaకృతికి షాకింగ్ డిమాండ్ ?కృతికి షాకింగ్ డిమాండ్ ?kruti;beauty;pooja hegde;rashmika mandanna;surya sivakumar;bollywood;tollywood;cinema;telugu;rajani kanth;kollywood;kannada;blockbuster hit;girl;silver;heroine;silver screen;nagashauryaTue, 09 Feb 2021 20:30:00 GMTఅమ్మాయి దొరకాలే కానీ వెండి తెర అంతా నిండుగా గ్లామర్ పరచుకుంటుందిగా. పట్ట పగలే పండు వెన్నెలలు వెల్లి విరిసి మురిపిస్తాయిగా. టాలీవుడ్ కి ఐ ఫీస్ట్ కావాలి. ఎందరో వయ్యారి భామలు తెలుగు సినీ సీమను వరించి తరింపచేశారు.

ఇపుడు ఆ లిస్ట్ లో కొత్త బ్యూటీ కృతి శెట్టి  వచ్చి చేరింది. ఆమె ఉప్పెన సినిమా ఈ నెల 12న విడుదల కానుంది. కానీ ఈ సినిమా విడుదలకు ముందే కృతి డిమాండ్ చాల జోరుగా ఉంది. ఎన్నో సినిమాలు చేసిన అనుభవం కలిగినట్లుగా ఉప్పెనలో కృతి చేసిందట. దాంతో ఆ నోటా ఈ నోటా ఆమె టాలెంట్ విన్న వారంతా తమ సినిమాల్లో వెంటనే ఆఫర్ ఇచ్చేసి మరీ తీసేసుకున్నారు.

కోలీవుడ్ సూపర్ స్టార్ సూర్య పక్కన అలా కృతి లక్కీ చాన్స్ కొట్టేసింది. ఇక తెలుగులో నాగశౌర్య మూవీలో కూడా కృతి హీరోయిన్ గా నటిస్తోంది. ఇవే కాదు చేతిలో మరో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. దాంతో కృతి డైరీ 2021 మొత్తం క్లోజ్. ఆమె కాల్షీట్లు ఈ ఏడాది అయితే అసలు లేవు అంటున్నారు.

ఇక కచ్చితంగా హిట్ అని భావించే ఉప్పెన కనుక బ్లాక్ బస్టర్ అయితే కృతి జోరుని పట్టడం ఎవరి తరం కాదనే అంటున్నారు. ఈ ముద్దు గుమ్మ  వైఖరి  చూస్తే 2022 డైరీ కూడా ఫుల్ అయిపోతుందని ముందే జోస్యం చెప్పేస్తున్నారు.  కన్నడ  బ్యూటీగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కృతి సరైన సమయంలోనే కాలు పెట్టారని అంటున్నారు.

ఓ వైపు పూజా హెగ్డే బాలీవుడ్ లో పాగా వేయాలని చూస్తోంది. అదే బాటలో రష్మిక మందన కూడా ఉంది. దాంతో అర్జంటుగా న్యూ టాలెంట్ కావాలి. గ్లామర్ భామలు కూడా రావాలి. ఈ సమయంలో కృతి శెట్టి రావడం అంటే ఆమె పంట పండిందనే అంటున్నారు. మరి తనదైన గ్లామర్ తో ఏకంగా టాలీవుడ్ లో కొత్త ఉప్పెనను తెచ్చేందుకు ఈ అమ్మడు రెడీ అంటున్నారు.




జగడ్డ : కడపలో ఫ్యాన్ స్పీడ్ కు సైకిల్ గల్లంతు..!

ప్రకాశం: స‌్థానిక ఫ‌లితాల్లో ఆ మంత్రికి షాక్ ?

ప్ర‌కాశం: ఆ నియోజ‌క‌వ‌ర్గంలో సైకిల్ జోరు.. ఫ్యాన్ బేజారు

బ్రేకింగ్: హమ్మయ్య నిమ్మాడలో గెలిచిన టీడీపీ, 40 ఏళ్ళ తర్వాత

వామ్మో తమన్నా.. జిమ్ లో చమటలు పట్టించేస్తుందిగా..!

పంచాయ‌తీల్లో క‌నీవినీ ఎరుగ‌ని పోలింగ్‌.. కార‌ణాలు ఏంటి ?

విశాఖలో దుమ్ము దులుపుతున్న ఫ్యాన్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>