PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ys-sharmila8c94a2db-88a7-4ca3-8da0-8194a8f624a8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ys-sharmila8c94a2db-88a7-4ca3-8da0-8194a8f624a8-415x250-IndiaHerald.jpgతెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు వైఎస్ షర్మిల సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఈనేప‌థ్యంలోనే ఆమె సోమ‌వారం రాత్రి హైదారాబాద్ చేరుకోవ‌డం ఆస‌క్తి రేపుతోంది. సోమవారం రాత్రి బెంగళూరు నుంచి బ్రదర్ అనిల్, షర్మిల.. హైదరాబాద్‌లోని తమ నివాసం లోటస్‌పాండ్‌కు వచ్చారు. మంగళవారం ఉదయం 10గంటలకు వైఎస్ అభిమానుల ఆత్మీయ సమ్మేళనంలో షర్మిల పాల్గొంటార‌ని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఇప్ప‌టికే ఆమె ప‌క్కా ప్లానింగ్‌తో ముంద‌స్తుగా తెలంగాణ‌లోని స‌న్నిహితులు, అభిమానుల‌కు ఫోన్ ద్వారా స‌మాచారం ఇచ్చిన‌ట్లుగా తెలుస్తోంది. sharmila;anil music;telangana;y. s. rajasekhara reddy;district;smart phone;suryapeta;yadadri;ycp;party;jagtialష‌ర్మిల పార్టీలోకి ఆ జిల్లా నేత‌లు... ఈరోజు భేటీ వారితోనే..ష‌ర్మిల పార్టీలోకి ఆ జిల్లా నేత‌లు... ఈరోజు భేటీ వారితోనే..sharmila;anil music;telangana;y. s. rajasekhara reddy;district;smart phone;suryapeta;yadadri;ycp;party;jagtialTue, 09 Feb 2021 08:37:16 GMTపార్టీ పెట్టేందుకు వైఎస్ షర్మిల సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఈనేప‌థ్యంలోనే ఆమె సోమ‌వారం రాత్రి హైదారాబాద్ చేరుకోవ‌డం ఆస‌క్తి రేపుతోంది. సోమవారం రాత్రి బెంగళూరు నుంచి బ్రదర్ అనిల్, షర్మిల.. హైదరాబాద్‌లోని తమ నివాసం లోటస్‌పాండ్‌కు వచ్చారు. మంగళవారం ఉదయం 10గంటలకు వైఎస్ అభిమానుల ఆత్మీయ సమ్మేళనంలో షర్మిల పాల్గొంటార‌ని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఇప్ప‌టికే ఆమె ప‌క్కా ప్లానింగ్‌తో ముంద‌స్తుగా తెలంగాణ‌లోని స‌న్నిహితులు, అభిమానుల‌కు ఫోన్ ద్వారా స‌మాచారం ఇచ్చిన‌ట్లుగా తెలుస్తోంది.  షర్మిల ‘వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ’ స్థాపించబోతున్నారన్న ప్రచారంతో తెలంగాణలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.


తొలుత ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలతో సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ మేరకు నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు చెందిన పలువురు వైసీపీ నేతలు, వైఎస్పార్‌ అభిమానులకు సమాచారం అందించిన‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.అలాగే జగిత్యాల, నిజామాబాద్, ఖ‌మ్మం, వ‌రంగ‌ల్ ఉమ్మ‌డి‌ జిల్లా నేతలకు కూడా సమాచారం వెళ్లిన‌ట్లుగా తెలుస్తోంది.  మరోవైపు, కోమటిరెడ్డి బ్రదర్స్‌, అలాగే ఖమ్మం మాజీ ఎంపీపొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు షర్మిలతో సమావేశమైనట్లు తెలుస్తోంది. వ‌రంగ‌ల్ జిల్లాపై గ‌ట్టి ప‌ట్టున్న కొండా దంప‌తుల‌ను కూడా ఆమె ప‌ల‌క‌రించిన‌ట్లుగా తెలుస్తోంది. అయితే ఇందులో ఎంత వాస్త‌వం ఉంద‌న్న విష‌యం కొద్దిరోజులు ఆగితేగాని తెలియ‌దు.


ష‌ర్మిల రాజ‌కీయ అడుగుల‌ను, నిర్ణ‌యాల‌ను గ‌మ‌నించాకే స్పందించాల‌ని కొంత‌మంది  తెలంగాణ నేత‌లు ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. ప్రస్తుత ప‌రిస్థితుల్లో తెలంగాణ‌లో మ‌రో రాజ‌కీయ పార్టీకి చోటుందా అనే అంశంపైనా జోరుగా చ‌ర్చ జ‌రుగుతోంది.ష‌ర్మిలా పార్టీ విధివిధానాలు, ఇత‌ర ఎజెండా అంశాల‌ను ఉమ్మ‌డి జిల్లా ప్రాతిప‌దిక‌న క‌లిసి రావాల‌నుకునే నేత‌ల‌కు వివ‌రించ‌నున్న‌ట్లుగా తెలుస్తోంది. రోజు విడిచి రోజు ఈ భేటీలు జరుగుతాయని సమాచారం. తెలంగాణలో రాజకీయంగా ఏ రకంగా ముందుకు వెళ్తే బాగుంటుంది, ఏ అంశాలను ఎజెండాగా తీసుకోవాలనే విషయంలో ఆమె అభిప్రాయ సేకరణ జరిపే అవకాశం ఉందని తెలుస్తోంది.


పెద్దిరెడ్డి ఇలాఖాలో ఎన్నికలు రద్దేనా!

టీచర్ల వెతలు: వీళ్లు మనసు విప్పితే.. కన్నీటి జలపాతాలే..?

అయ్యప్పనుం కోషియం కోసం నలుగురు దర్శకులు !

“ఒకే ఒక్క మాట” తో కేసీఆర్ పై రాష్ట్రమంతటా వెల్లువెత్తుతున్న తీవ్ర వ్యతిరేఖత

హెరాల్డ్ సెటైర్ : పవన్ను ఆటలో అరటిపండు లాగ చేసేశారా ?

మెగా నామ సంవత్సరం : ఏకంగా 11 సినిమాల రిలీజ్

వారెవ్వా.. జగన్ డబుల్ గేమ్ భలేగా ఉందే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>