Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/work-from-home-udhyogi-mruthi-theevra-othide-karanamaa91ae6e99-0683-4ef5-a702-513110e02b92-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/work-from-home-udhyogi-mruthi-theevra-othide-karanamaa91ae6e99-0683-4ef5-a702-513110e02b92-415x250-IndiaHerald.jpgకరోనా వైరస్ పుణ్యమా అని ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్థలకు చెందిన ఉద్యోగులు కోరుకున్న కోరిక తీరింది అనే విషయం తెలిసిందే. రోజు ఆఫీసు కి వెళ్ళకుండా హాయిగా వర్క్ ఫ్రమ్ హోం వస్తే బాగుండు ఇక ఇంటి దగ్గరే ఉండి పని చేసుకునే వాళ్ళం అని ఎంతో మంది ఉద్యోగులు కోరుకునే ఉంటారు. ఇక ఆ కోరిక నెరవేరింది. కానీ ఇప్పుడు వద్దు బాబోయి వద్దు అన్న కూడా కూడా వర్క్ ఫ్రమ్ హోం మాత్రం పోవడం లేదు. దీంతో ఉద్యోగులు అందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అన్న విషయం తెలిసిందే. మొదట వర్క్ ఫ్రమ్ హోం సమయంలో కాస్త ఆనందపడి పోయిwfm;survey;house;officeవర్క్ ఫ్రమ్ హోమ్.. 90 శాతం మందికి ఇలాంటి నొప్పులే..?వర్క్ ఫ్రమ్ హోమ్.. 90 శాతం మందికి ఇలాంటి నొప్పులే..?wfm;survey;house;officeTue, 09 Feb 2021 10:00:00 GMT


 ఇక ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ పోయి ఎప్పుడెప్పుడు ఆఫీసులో తెరుచుకుంటాయా అని  వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు ఉద్యోగులు. కానీ అటు ఆయా కంపెనీలు మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా అంటే మెయింటెనెన్స్ చాలా తక్కువ అవుతున్న నేపథ్యంలో ఇప్పట్లో వర్క్ ఫ్రం హోం తీసేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదు అన్న విషయం తెలుస్తుంది.  ఇక వర్క్ ఫ్రం హోం చేస్తున్న ఉద్యోగులు వివిధ రకాల సమస్యలు వస్తున్నాయి అన్నది ఇటీవల నిర్వహించిన సర్వేలలో కూడా బయట పడుతూ ఉండడం గమనార్హం. కాగా ఇటీవలే హార్మోన్ మిల్లర్ అనే ఆఫీస్ ఫర్నిచర్ తయారీ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా కొంతమంది వర్క్ ఫ్రం హోం చేస్తున్న ఉద్యోగులపై సర్వే నిర్వహించగా కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.



 అయితే లాక్ డౌన్ కి ముందు వర్క్ ఫ్రమ్  హోం చేసిన సమయం కంటే లాక్డౌన్ సమయంలో ప్రస్తుతం 20 శాతం ఎక్కువ సేపు కూర్చొని పనిచేస్తున్నారట ఉద్యోగులు. ఇలా పనిచేయడం కారణంగా 90% మందికి శారీరక మానసిక ఒత్తిడి పెరిగిపోతోందని ఇటీవల నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. 39.40శాతం మందికి మెడ నొప్పి, 53.13శాతం మందికి నడుము నొప్పి, 44.28శాతం మందికి నిద్ర పట్టకపోవడం, 34.53శాతం మందికి చేతులు.. 33.83శాతం మందికి కాళ్ల నొప్పులు ఉన్నాయట. 27.26శాతం మందికి తలనొప్పి.. కళ్లు లాగడం జరుగుతున్నాయని సర్వేలో తేలింది. పదిలో తొమ్మిది మంది ఈ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని హర్మన్‌ మిల్లర్‌ సంస్థ పేర్కొంది.


జగడ్డ: అనంతలో ఆ టీడీపీ నేత మృతికి పోలీసులే కారణం...?

కొత్త పార్టీ యోచనలో ఈటెల!

జగడ్డ : పల్లె తీర్పు ఏం చెప్పనుంది..?

సీఎం కూతురికే డబుల్ షాక్‌ ఇచ్చాడు.. వీడు మామూలోడు కాదు..?

జగడ్డ : విశాఖ పంచాయతీలో గెలుపెవరిది...?

టీచర్ల వెతలు: వీళ్లు మనసు విప్పితే.. కన్నీటి జలపాతాలే..?

అయ్యప్పనుం కోషియం కోసం నలుగురు దర్శకులు !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>