Politicsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/super-glue597f1f91-21d8-496b-a665-f4524441d5d4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/super-glue597f1f91-21d8-496b-a665-f4524441d5d4-415x250-IndiaHerald.jpgశరీరానికి ఏ మాత్రం పెద్ద గాయమైనా.. ఆ గాయం తగ్గాలంటే కచ్చితంగా కుట్లు పడాల్సిందే. అయితే ఒక్క సారి శరీరంపై కుట్లు పడ్డాయంటే.. ఆ మచ్చలు జీవితాంతం అలానే ఉండిపోతాయి. కానీ ఇప్పుడు దానికో పరిష్కారం కనుక్కున్నారు డాక్టర్లు. అదే గాయాలకు గ్లూ వేయడం. మీరు విన్నది నిజమే.. super glue;jeevitha rajaseskhar;kiran;manu;maya;university;twitterఈ గ్లూతో గాయాలు మాయం.. ఎంత గొప్ప టెక్నాలజీనో..!ఈ గ్లూతో గాయాలు మాయం.. ఎంత గొప్ప టెక్నాలజీనో..!super glue;jeevitha rajaseskhar;kiran;manu;maya;university;twitterTue, 09 Feb 2021 16:59:06 GMT

ఇంటర్నెట్ డెస్క్: శరీరానికి ఏ గాయమైనా.. ఆ గాయం తగ్గాలంటే కచ్చితంగా కుట్లు పడాల్సిందే. అయితే ఒక్క సారి శరీరంపై కుట్లు పడ్డాయంటే.. ఆ మచ్చలు జీవితాంతం అలానే ఉండిపోతాయి. కానీ ఇప్పుడు దానికో పరిష్కారం కనుక్కున్నారు డాక్టర్లు. అదే గాయాలకు గ్లూ వేయడం. మీరు విన్నది నిజమే.. ఇకనుంచి గాయాలను గ్లూతో అతికించబోతున్నారు. ఈ సూపర్ గ్లూ వల్ల గాయాలు, పుండ్లు చాలా త్వరగా మానడమే కాకుండా.. జీవిత కాలం ఆ గాయాల గుర్తులను భరించాల్సి అవసరం కూడా లేదు.


అమెరికాకు చెందిన బయో మెడికల్ ఇంజినీర్లతోపాటు యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీకి చెందిన పరిశోధకులు ఈ సర్జికల్ గ్లూ ను అభివృద్ధి చేశారు. ఆ గ్లూ కు మెట్రో అనే పేరు పెట్టారు. ఈ గ్లూ ను గాయాలపై అప్లై చేయగానే కొన్ని నిమిషాల వ్యవధిలో ఆ గాయాన్ని సీల్ చేస్తుంది. దీంతో ఆ ప్రాంతం మూసుకుపోతుంది. రక్త స్రావం కూడా త్వరగా నిలిచిపోతుంది.


అయితే ఈ గ్లూను అప్లై చేశాక అల్ట్రా వయొలెట్ (యూవీ) కిరణాల సహాయంతో దాన్ని యాక్టివేట్ చేయాలి. అలా యాక్టివేట్ అయ్యాక ఆ గ్లూ పనిచేయడం ప్రారంభిస్తుంది. ఇక దీన్ని ఇప్పటికే పందులు, ఇతర జీవులపై ప్రయోగించి శాస్త్రవేత్తలు సత్ఫాలితాలను కూడా సాధించారు. ఈ క్రమంలోనే త్వరలోనే ఈ సర్జికల్ గ్లూ ను మనుషులపై కూడా క్లినికల్ ట్రయల్స్ జరపనున్నారని తెలుస్తోంది. ఆ తరువాత దీనిని వాణిజ్య పరంగా మార్కెట్‌లోకి తీసుకురానున్నారు. 

ఇక ఈ గ్లూ కు చెందిన ఓ వీడియోను ఆసియాకు చెందిన ప్రముఖ బయో ఫార్మాసూటికల్స్ సంస్థ బయోకాన్ చైర్ పర్సన్ కిరణ్ మజుందార్ షా షేర్ చేశారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఈ గ్లూ మార్కెట్లోకి వస్తే ఎంతో మందికి చాలా ఉపయోగపడుతుంది.



" style="height: 481px;">




ఏపీలో మొద‌లైన కౌంటింగ్‌: ప‌లు జిల్లాల్లో సై ' కిల్ ' ‌... ప‌చ్చ పార్టీ డ‌క్కౌట్లు ?

క్రాక్ వివాదం : ఎట్టకేలకు నోరు విప్పిన ఠాగూర్ మధు !

బాలయ్య 'BB3' టైటిల్ ని రివీల్ చేసేది అప్పుడే : బోయపాటి..!!

జూ.ఎన్టీఆర్ కు ఇక్కడోళ్లు సరిపోరా..?

కార్తీకదీపం వంటలక్కకి డబ్బింగ్ చెప్పే మాటలక్క ఈమే..!

నాగచైతన్య వెబ్ సిరీస్.. డైరెక్టర్ ఎవరంటే ?

నాకు ఆ వ్యాధి ఉంది.. దాంట్లో సిగ్గుపడాల్సింది ఏముందండీ: చందమామ కాజల్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>