PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/whatsappaa9d0ab4-6d52-4da8-880f-f4844509b45e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/whatsappaa9d0ab4-6d52-4da8-880f-f4844509b45e-415x250-IndiaHerald.jpgవాట్సప్ .. ఇప్పుడు ఇది లేకుండా చాలా మందికి రోజు గడవదు.. ఫ్రెండ్స్ తో అయినా, ఆఫీసు కొలీగ్స్‌ తో అయినా, బంధువులతో అయినా, సోషల్ మీడియా స్నేహితులతో అయినా ఇప్పుడు కమ్యూనికేషన్‌లో ఉండే సాధనంగా వాట్సప్ మారిపోయంది. ఒక్కొకరి సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే ఎన్ని గ్రూపులు ఉంటాయో లెక్క ఉండదు. చివరకు భార్యాభర్తలు, లవర్స్ కూడా తమకో గ్రూప్ పెట్టుకుని మెస్సేజులు పంపుకునే రేంజ్‌ కు వాట్సప్ ఓ నిత్యావసరంగా మారిపోయింది. మరి అలాంటి వాట్సప్‌ కస్టమర్ల డాటాకు మాత్రం భద్రత ఇవ్వడం లేదు. అంతే కాదు.. మీ డాటా అంతా మా సంస్థలతో పంచwhatsapp;varun sandesh;smart phone;whatsapp;media;central governmentవాట్సప్‌కు షాక్ ఇవ్వబోతున్న కేంద్రం.. మీ సంగతేంటి..?వాట్సప్‌కు షాక్ ఇవ్వబోతున్న కేంద్రం.. మీ సంగతేంటి..?whatsapp;varun sandesh;smart phone;whatsapp;media;central governmentTue, 09 Feb 2021 08:40:00 GMTవాట్సప్ .. ఇప్పుడు ఇది లేకుండా చాలా మందికి రోజు గడవదు.. ఫ్రెండ్స్ తో అయినా, ఆఫీసు కొలీగ్స్‌ తో అయినా, బంధువులతో అయినా, సోషల్ మీడియా స్నేహితులతో అయినా ఇప్పుడు కమ్యూనికేషన్‌లో ఉండే సాధనంగా వాట్సప్ మారిపోయంది. ఒక్కొకరి సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే ఎన్ని గ్రూపులు ఉంటాయో లెక్క ఉండదు. చివరకు భార్యాభర్తలు, లవర్స్ కూడా తమకో గ్రూప్ పెట్టుకుని మెస్సేజులు పంపుకునే రేంజ్‌ కు వాట్సప్ ఓ నిత్యావసరంగా మారిపోయింది.

మరి అలాంటి వాట్సప్‌ కస్టమర్ల డాటాకు మాత్రం భద్రత ఇవ్వడం లేదు. అంతే కాదు.. మీ డాటా అంతా మా సంస్థలతో పంచుకుంటామని ఇటీవల కస్టమర్లను బెదిరించిన సంగతి తెలిసిందే. అందుకే ఇప్పుడు వాట్సప్‌ కు షాక్ ఇవ్వాలని కేంద్రం ప్లాన్ చేస్తోంది. వాట్సాప్‌కు కేంద్రం త్వరలోనే గట్టి షాక్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఫేస్‌బుక్ నేతృత్వంలోని వాట్సాప్‌కు ధీటుగా సరికొత్త దేశీ యాప్‌ను లాంచ్ చేయబోతోందట. వాట్సాప్ ఇటీవల ప్రవేశపెట్టిన కొత్త ప్రైవరీ నిబంధనలతో వినియోగదారులు మరో ప్రత్యామ్నాయం కోసం యోచిస్తున్న సమయంలో ఈ  విషయం ఇంట్రస్టింగ్ గా మారింది.

కేంద్రం వాట్సప్‌కు పోటీగా తెస్తున్న యాప్‌కు సందేశ్ అని పేరు పెడుతున్నారట. ఇప్పటికే  ఈ యాప్‌ను ఇప్పటికే కొందరు ప్రభుత్వాధికారులు టెస్టింగ్ కోసం వాడుతున్నారట. ఇది ఐవోఎస్, ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌లపై పనిచేస్తుందట.  వాట్సాప్ మాదిరిగానే వాయిస్, డేటా సహా ఇతర సేవలను కూడా సందేశ్‌ ద్వారా అందుకోవచ్చట. లాగిన్ కోసం ఓటీపీ లేదా ఎల్‌డీఎపీ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయట. వాట్సప్ తరహాలోనే సందేశ్ కూడా మొబైల్, సిస్టమ్‌లో కూడా ఉపయోగించుకోవచ్చట.

అయితే ఈ సందేశ్ యాప్ పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇది కేవలం ప్రభుత్వ అధికారుల కోసమేనా.. లేక సాధారణ ప్రజలకు కూడా అందుబాటులో ఉంటుందా అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. కాకపోతే సందేశ్ యాప్ రావడం మాత్రం పక్కా అని చెబుతున్నారు. త్వరలోనే దీనిపై  కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. 


పెద్దిరెడ్డి ఇలాఖాలో ఎన్నికలు రద్దేనా!

టీచర్ల వెతలు: వీళ్లు మనసు విప్పితే.. కన్నీటి జలపాతాలే..?

అయ్యప్పనుం కోషియం కోసం నలుగురు దర్శకులు !

“ఒకే ఒక్క మాట” తో కేసీఆర్ పై రాష్ట్రమంతటా వెల్లువెత్తుతున్న తీవ్ర వ్యతిరేఖత

హెరాల్డ్ సెటైర్ : పవన్ను ఆటలో అరటిపండు లాగ చేసేశారా ?

మెగా నామ సంవత్సరం : ఏకంగా 11 సినిమాల రిలీజ్

వారెవ్వా.. జగన్ డబుల్ గేమ్ భలేగా ఉందే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>