MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jr-ntr-fans-will-be-very-proud-with-that-moviebc21d10d-9a80-4b4c-8992-3475f22e5d63-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jr-ntr-fans-will-be-very-proud-with-that-moviebc21d10d-9a80-4b4c-8992-3475f22e5d63-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ ఎన్టీఆర్ అతి త్వరలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్న విషయం తెల్సిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్స్ కలిసి ఎంతో భారీ ఖర్చుతో నిర్మించనున్న ఈ సినిమా మంచి పొలిటీకల్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్నట్లు ఇటీవల కొద్దిరోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఎన్టీఆర్ ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ రొల్ పోషిస్తున్నట్లు టాక్. jr ntr;ntr;geetha;rajamouli;srinivas;thaman s;trivikram srinivas;india;bollywood;tollywood;rrr movie;cinema;sangeetha;kollywood;media;audience;success;yuva;nandamuri taraka rama rao;aravinda sametha veera raghava;ntr artsఎన్టీఆర్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకోవచ్చు అంటున్నారు....??ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకోవచ్చు అంటున్నారు....??jr ntr;ntr;geetha;rajamouli;srinivas;thaman s;trivikram srinivas;india;bollywood;tollywood;rrr movie;cinema;sangeetha;kollywood;media;audience;success;yuva;nandamuri taraka rama rao;aravinda sametha veera raghava;ntr artsTue, 09 Feb 2021 22:26:07 GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ అతి త్వరలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్న విషయం తెల్సిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్స్ కలిసి ఎంతో భారీ ఖర్చుతో నిర్మించనున్న ఈ సినిమా మంచి పొలిటీకల్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్నట్లు ఇటీవల కొద్దిరోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఎన్టీఆర్ ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ రొల్ పోషిస్తున్నట్లు టాక్.

యువ సంగీత తరంగం థమన్ ఈ ప్రతిష్టాత్మక సినిమాకి సంగీతం అందించనుండగా, ఒక బాలీవుడ్ స్టార్ నటి ఎన్టీఆర్ కి జోడీగా ఇందులో నటించనుందని, అలానే పలువురు టాలీవుడ్ తో పాటు కోలీవుడ్, బాలీవుడ్ చిత్రపరిశ్రమలకు చెందిన దిగ్గజ నటులు ఇందులో కీలక పాత్రలు చేయనున్నట్లు సమాచారం. ఇక గతంలో ఎన్టీఆర్, త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత సినిమా అందరి అంచనాలు అందుకుని మంచి సక్సెస్ సాదించిన విషయం తెల్సిందే. దానితో రెండవ సారి వీరిద్దరి కంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు ఇటు నార్మల్ ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

మరోవైపు రాజమౌళి తో ప్రస్తుతం ఎన్టీఆర్ భారీ పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్  చేస్తుండడంతో దానితో పాటు త్రివిక్రమ్ మూవీ కూడా సూపర్ సక్సెస్ అందుకోవడం ఖాయం అని వారు భావిస్తున్నారు. అయితే అందరూ భావిస్తున్న దానికి మించేలా ఈ మూవీ యొక్క స్క్రిప్ట్ ని ఎంతో అత్యద్భుతంగా రెడి చేశారట దర్శకుడు త్రివిక్రమ్. ప్రస్తుతం తన టీమ్ తో కలిసి స్క్రిప్ట్ కి ఆయన మరింత గా సాన పడుతున్నారని, అలానే ఈ మూవీ లో ఎన్టీఆర్ క్యారెక్టర్ పై ఆయన మరింత శ్రద్ధ తీసుకుంటున్నారని, తప్పకుండా రిలీజ్ తరువాత ఈ మూవీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా కాలర్ ఎగరేసుకుని చెప్పుకునేలా ఉంటుందని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నైజమే అయితే ఇది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి సూపర్ న్యూస్ అనే చెప్పాలి.....!!


ప్రాధాన్యం సంతరించుకున్న పవన్, అమిత్ షా భేటీ !!

మూడు నెలల్లోనే మెగా మేనల్లుడి పెళ్లి.. అంతా సీక్రెట్ నడిపిస్తున్నారా..?

దివి పాప క్యాబ్ స్టోరీస్.. ప్రోమోనే పిచ్చెక్కించేసిందిగా..!

పుష్ప అల్లు అర్జున్ ఎంట్రీ సీన్.. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనేట్టుగా..!

జూనియర్ సత్యదేవ్ ని చూసారా..? భార్య కొడుకు ని పరిచయం చేసిన హీరో సత్య దేవ్

జగడ్డ : కడపలో ఫ్యాన్ స్పీడ్ కు సైకిల్ గల్లంతు..!

కృతికి షాకింగ్ డిమాండ్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>