MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/neelakhanta-bad-lck-becomes-hot-topic5b433b0a-029b-4490-bce1-6f43131b8e55-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/neelakhanta-bad-lck-becomes-hot-topic5b433b0a-029b-4490-bce1-6f43131b8e55-415x250-IndiaHerald.jpgఫిలిం ఇండస్ట్రీలో హిట్స్ లేకపోతే ఎంత సమర్ధుడైన దర్శకుడుని అయినా పట్టించుకోరు. ఇప్పుడు దర్శకుడు నీలకంఠ పరిస్థితి కూడ ఇలాగే మారింది అంటూ ఇండస్ట్రీ వర్గాలు కామెంట్స్ చేస్తున్నాయి. క్రియేటివ్ దర్శకుడు గా పేరున్న ఈయన గతంలో తీసిన ‘షో’ మూవీకి జాతీయ స్థాయిలో అవార్డు కూడ దక్కింది.ఆతరువాత ఆయన తీసిన ‘మిస్సమ్మ’ ‘విరోధి’ ‘మిష్టర్ మేధావి’ సినిమాలకు ప్రశంసలతో పాటు అవార్డులు కూడ వచ్చాయి. అలాంటి దర్శకుడు ఇప్పుడు రాజశేఖర్ తో తీయాలి అని భావించిన మూవీ ప్రాజెక్ట్ లో ఆయనను తప్పించి అతడి స్థానంలో ఇప్పుడు ఒక యంగ్ డneelakhanta;dr rajasekhar;jeevitha rajaseskhar;neelakanta;rani;sekhar;cinema;industry;director;march;darsakudu;queen;missammaహాట్ న్యూస్ గా మారిన నీలకంఠ దురదృష్టం !హాట్ న్యూస్ గా మారిన నీలకంఠ దురదృష్టం !neelakhanta;dr rajasekhar;jeevitha rajaseskhar;neelakanta;rani;sekhar;cinema;industry;director;march;darsakudu;queen;missammaTue, 09 Feb 2021 11:00:00 GMTఫిలిం ఇండస్ట్రీలో హిట్స్ లేకపోతే ఎంత సమర్ధుడైన  దర్శకుడుని అయినా పట్టించుకోరు. ఇప్పుడు దర్శకుడు నీలకంఠ పరిస్థితి కూడ ఇలాగే మారింది అంటూ ఇండస్ట్రీ వర్గాలు కామెంట్స్ చేస్తున్నాయి. క్రియేటివ్ దర్శకుడు గా పేరున్న ఈయన గతంలో తీసిన ‘షో’ మూవీకి జాతీయ స్థాయిలో అవార్డు కూడ దక్కింది.


ఆతరువాత ఆయన తీసిన ‘మిస్సమ్మ’ ‘విరోధి’ ‘మిష్టర్ మేధావి’ సినిమాలకు ప్రశంసలతో పాటు అవార్డులు కూడ వచ్చాయి. అలాంటి దర్శకుడు ఇప్పుడు రాజశేఖర్ తో తీయాలి అని భావించిన మూవీ ప్రాజెక్ట్ లో ఆయనను తప్పించి అతడి స్థానంలో ఇప్పుడు ఒక యంగ్ డైరెక్టర్ వచ్చి చేరడంతో చాలామంది షాక్ అవుతున్నారు.


తెలుస్తున్న సమాచారం మేరకు లాక్ డౌన్ ముందు రాజశేఖర్ తో నీలకంఠ ఒక సినిమాను ప్లాన్ చేసాడు. ఆ మూవీ స్క్రిప్ట్ వరకు కూడ పూర్తి అయిన తరువాత రాజశేఖర్ కు కరోనా రావడంతో ఆమూవీ ఆగిపోయింది. కరోనా నుంచి తేరుకున్నాక రాజశేఖర్ జీవిత లకు మరో ఆలోచన వచ్చి నీలకంఠ ను తప్పించి అతడి స్థానంలో లలిత్ ను దర్శకుడుగా మార్చి శేఖర్ మూవీని ఎనౌన్స్ చేసారు. మొదట్లో ఈ సినిమాను రాజశేఖర్ నీలకంఠ దర్శకత్వంలో చేయాలని అనుకున్నాడు అని అంటారు. ఇక ఈ దర్శకుడు ఎన్నో ఆశలు పెట్టుకుని తమన్నాతో తీసిన ‘క్వీన్’ మూవీ విషయంలోనూ ఇతడికి అన్యాయం జరిగింది అంటారు.


ఈమూవీ షూటింగ్ లో తమన్నాకు నీలకంఠ కు వచ్చిన భేదాభిప్రాయాలు వల్ల ఇతడు ఈమూవీ ప్రాజెక్ట్ నుండి సగంలో తప్పుకోవలసి వచ్చింది. వాస్తవానికి మంచి సినిమాలు తీయదగ్గ సత్తా ఈ దర్శకుడుకు ఉన్నా ఇతడిని నమ్మే పరిస్థితి నిర్మాతలకు హీరోలకు లేదు. అందుకే కాబోలు ఎంత సమర్థత ఉన్నా రవ్వంత అదృష్టం లేకపోతే రాణించడం కష్టం అంటారు. దీనితో ఈ క్రియేటివ్ డైరెక్టర్ మళ్ళీ తనకు అవకాశాలు ఇచ్చే వ్యక్తి కోసం అన్వేషణలో ఉన్నట్లు టాక్..  






ఏకంగా సీఎం కూతురునే బురిడీ కొట్టించిన సైబర్ నేరగాళ్లు....

బ్రాహ్మ‌ణ ఘోష‌: అగ్ర‌వ‌ర్ణ పేద‌ల రిజ‌ర్వేష‌న్ ఏమైన‌ట్టు ?

బొత్స కుటుంబంలో లోక‌ల్ చిచ్చు... అన్న‌ద‌మ్ముల స‌మ‌రం..!

జగడ్డ: నిమ్మగడ్డని వదిలిపెట్టని పెద్దిరెడ్డి..

ఏడిటోరియల్: వైఎస్ ష‌ర్మిల‌ పార్టీ అంటే కేసీఆర్ భయపడుతున్నారా? భయపెడుతున్నారా?

కొత్త పార్టీ యోచనలో ఈటెల!

జగడ్డ : పల్లె తీర్పు ఏం చెప్పనుంది..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>